లాంగ్‌జంప్ చేస్తున్న క్రీడాకారిణి
గుంటూరు స్పోర్ట్స్: అండర్–14, 16 బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మంగళవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఈ పోటీల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేసి విశాఖపట్నంలో నవంబర్‌లో 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధ్యక్షుడు ఓరుగంటి అంకయ్య, అథ్లెటిక్స్ శిక్షకుడు భాష్యం కృష్ణారావు, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్, పీఈటీలు శరత్, నాయక్, రమాసుందరి, జి.జె.కిషోర్, ఎన్.శ్రీనివాస్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.