ముగిసిన నామినేషన్ల ప్రక్రియ | the end of the nomination process | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Published Sat, Dec 13 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

the end of the nomination process

హన్మకొండ : జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా ఉండే 17 మంది జెడ్పీటీసీ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 2, జనరల్‌కు 3 రిజర్వు అయ్యాయి. ఈ కేటగిరీలకు చెందిన 17 స్థానాలకు.. 28 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15న నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ, 17న పోలింగ్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు చేసిన వారి జాబితా ఇదీ...

ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక స్థానం ఉంది. ముగ్గురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీటీసీ భూక్య సామ్య(టీఆర్‌ఎస్), వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి(టీఆర్‌ఎస్), తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు జాటోతు కమలాకర్(టీఆర్‌ఎస్).
     
ఎస్టీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ పదవికి రఘునాథపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు భానోతు శారద(టీఆర్‌ఎస్), తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు పుల్సం సరోజన(స్వతంత్ర) నామినేషన్ వేశారు.
     
ఎస్సీ జనరల్ కేటగిరీలో ఒక స్థానం ఉంది. నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యుడు ధర్మారపు వేణు(కాంగ్రెస్) నామినేషన్ వేశారు.
     
ఎస్సీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నా యి. నలుగురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. దేవరుప్పుల జెడ్పీటీసీ సభ్యురాలు నల్ల ఆండాలు(కాంగ్రెస్), గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు నామవరపు విజయలక్ష్మి(కాంగ్రెస్), కొడకండ్ల జెడ్పీటీసీ సభ్యురాాలు బక్కి కవిత(కాంగ్రెస్), పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ(టీఆర్‌ఎస్) నామినేషన్ వేశారు.
     
బీసీజనరల్ కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఆరుగురు జెడ్పీటీసీలు నామినేషన్ వేశారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు(టీఆర్‌ఎస్), ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సకినాల శోభన్(టీఆర్‌ఎస్), నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడు చెట్టుపల్లి మురళీధర్(టీడీపీ), హసన్‌పర్తి జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్(టీఆర్‌ఎస్), మరిపెడ జెడ్పీటీసీ సభ్యుడు పూల్నె మాణిక్యం(కాంగ్రెస్), మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న(కాంగ్రెస్) నామినేషన్ వేశారు.
     
బీసీ మహిళా కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ వేశారు. జనగామ జెడ్పీటీసీ సభ్యురాలు బెలిదె విజయ(టీఆర్‌ఎస్), బచ్చన్నపేట జెడ్పీటీసీ సభ్యురాలు వేముల స్వప్న(టీఆర్‌ఎస్), చేర్యాల జెడ్పీటీసీ సభ్యురాలు సుంకరి సరిత(టీఆర్‌ఎస్), మద్దూరు జెడ్పీటీసీ సభ్యురాలు నాచగోని పద్మ(కాంగ్రెస్), ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ(కాంగ్రెస్), కేసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు బండారు పద్మ(కాంగ్రెస్), హన్మకొండ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరామోజు అరుణ(టీఆర్‌ఎస్) నామినేషన్లు వేశారు.
   
జనరల్ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి(టీఆర్‌ఎస్), భూపాలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మీరాబాయి జర్పుల(టీఆర్‌ఎస్) నామినేషన్ వేశారు.
     
జనరల్ కేటగిరీ స్థానాలు మూడు ఉన్నాయి. లింగాలఘణపురం జెడ్పీటీసీ సభ్యుడు గంగసాని రంజిత్‌రెడ్డి(టీఆర్‌ఎస్), నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం భరత్(కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారారు), ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యుడు లేతాకుల సంజీవరెడ్డి(కాంగ్రెస్) నామినేషన్లు వేశారు.
 
 ఏకగ్రీవానికి సహకరించాలి : జెడ్పీ చైర్‌పర్సన్
 
డీపీసీ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవం చేయనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. ఈ మేరకు నామినేషన్ వేసిన సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జిల్లా పరిషత్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ముఖ్య నాయకులతో, జెడ్పీ ఫ్లోర్ లీడర్లు, నామినేషన్ వేసిన జెడ్పీటీసీ సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. దీనికి సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement