బాల్ బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎన్‌జీవో హోమ్‌లో జిల్లా బ్యాడ్మింటన్ జూనియర్, సబ్ జూనియర్ జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ జూనియర్ జిల్లా జట్లు ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. సబ్ జూనియర్ జట్లు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. ఎంపికైన జట్లకు ఎన్‌జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్థన్‌రెడ్డి, సునీల్ బాబు, కృష్ణారెడ్డి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.