ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో 12 కోచ్‌లు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు.
వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు.
ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్‌డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్‌డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది.
అటువంటిప్పుడు మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment