వందేభారత్ రైలులో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఒక యువకుడు వాష్‌రూమ్‌లోకి దూరి, డోర్ లాక్ చేసుకున్నాడు. అధికారులు ఎంతచెప్పినా బయటకు రానంటూ మొండికేశాడు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కి, వాష్‌రూమ్‌లో నక్కిన ఆ యువకుడు ఎవరు చెప్పినా బయటకు రాలేదు. అయితే రైలు పాలక్కడ్ పరిధిలోని షోర్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అధికారులు వాష్‌రూమ్ డోర్ పగులగొట్టి ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చారు.
ఆ యువకుడు ఎరుపురంగు చెక్స్ కలిగిన టీ ధరించివున్నాడు. అధికారులకు ఎంతో భయపడుతూ కనిపించాడు. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడిని ఆర్‌పీఎఫ్ పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తాను మహారాష్ట్రకు చెందినవాడినని తెలిపాడు. ఆ యువకుడు హిందీలో మాట్లాడుతున్నాడు. తాను కాసర్‌గోడ్‌లో ఉంటానని కూడా ఆ యువకుడు రైల్వే పోలీసులకు తెలిపాడు.
టిక్కెట్ లేకుండానే ప్రయాణిస్తూ..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకునికి సంబంధించిన ఖచ్చితమైన గుర్తింపు లభ్యం కాలేదు. పైగా ఆ యువకుడు టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ యువకుడు భయపడుతూ పోలీసులతో తనను ఎవరో వెంబడిస్తున్నారని, వారి నుంచి తప్పించుకునేందుకే రైలులోకి ఎక్కి, వాష్‌రూమ్‌లో దాక్కున్నానని తెలిపాడు. కాగా కోజికోడ్, కన్నూర్‌లలో రైలు ఆగినప్పుడు అధికారులు ఆ యువకుడిని వాష్‌రూమ్ నుంచి బయటకు రావాలని కోరినా, బయటకు రాలేదు. దీంతో అధికారులు ఆ యువకుడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడని గుర్తించి, వాష్‌రూమ్ డోర్ పగులగొట్టి, అతనిని బయటకు తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్‌వర్క్ ఉన్నా..
Comments
Please login to add a commentAdd a comment