రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.
రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్‌ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్‌లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.
ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు
ఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment