సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికుల 2018 ఎంపికకు సంబంధించిన కంప్యూటరైజ్డ్ డ్రా పద్ధతిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లో ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఏ షుకూర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు 17,146 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 ఏళ్లకు పైబడిన కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 508 మందిని నిబంధనల ప్రకారం డ్రా లేకుండా నేరుగా ఎంపిక చేశామని తెలిపారు.
ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం దేశ హజ్ కోటాలో 5 వేలు పెంచడంతో రాష్ట్ర కోటాలో 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడేళ్లు యాత్రకు దరఖాస్తు చేసుకున్నా డ్రాలో ఎంపిక కానివారిని నాలుగోసారి నేరుగా ఎంపిక చేసే కేటగిరీని కేంద్ర హజ్ కమిటీ రద్దు చేసిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మందికి డ్రా ద్వారా యాత్రకు వెళ్లే అవకాశం దక్కనుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment