నూతన కానిస్టేబుళ్లు 1న డీపీఓలో హాజరుకావాలి | new constables should attend in dpo on 1st | Sakshi
Sakshi News home page

నూతన కానిస్టేబుళ్లు 1న డీపీఓలో హాజరుకావాలి

Published Sat, May 27 2017 11:23 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

new constables should attend in dpo on 1st

కర్నూలు : సివిల్, ఏఆర్, వార్డర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులు జూన్‌ 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో పాల్గొని ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన సివిల్‌ అభ్యర్థులు 218 మంది, ఏఆర్‌ అభ్యర్థులు 42 మంది, వార్డర్‌ పురుష అభ్యర్థులు 49 మంది, ఒక వార్డర్‌ మహిళా అభ్యర్థి అటెస్టేషన్‌ ఫారంలో పూర్తి వివరాలను నింపి డీపీఓలో అధికారులకు సమర్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిసియన్సీ టెస్ట్‌(పీఈటీ)లలో పాల్గొని సివిల్, ఏఆర్, వార్డర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని ఎస్పీ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement