DPO
-
మీ సొంత ఖర్చులతో షెడ్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ చిన్నషెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్‌కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్ను బుల్డోజర్తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోర్టు ఆదేశించింది.కౌంటర్ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్
-
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
ఈ పోలీసుల లెక్కే వేరు..!
సాక్షి, ఆదిలాబాద్ : తామున్న ఠాణా వదిలేది లేదంటూ ఆ పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. క్రమశిక్షణకు పెద్దపీట వేసే పోలీసుశాఖలో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత నెలలోనే బదిలీలు జరిగినప్పటికీ తమ స్థానాల నుంచి కదలడం లేదు. పోలీసులు బదిలీలకు విముఖత చూపుతుండడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. బదిలీలకు ఆదేశాలు.. గత నెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సివిల్ పోలీసులైన పోలీస్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలకు ఆదేశాలు వెలవడ్డాయి. అంతకుముందు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు, మంచిర్యాల జిల్లా కిందకు వచ్చే రామగుండం సీపీలు ఆయా జిల్లాల్లోని పీసీలు, హెచ్‌సీలు, ఏఎస్సైల నుంచి బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయా ఠాణాల్లో పోలీసు అధికారులకు దరఖాస్తులను మరుసటి రోజులోగా సమర్పించాలని ఆదేశాలు రావడంతో అప్పట్లోనే పోలీసు సిబ్బందిలో హైరానా వ్యక్తమైంది. ఆ తర్వాత రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటీవ్ గ్రౌండ్స్‌లో ఉమ్మడి జిల్లాలో సుమారు 70 మంది వరకు బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి ఇతర జిల్లాలకు పలువురిని బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా పోలీసులను సంబంధిత డీఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్సైలు తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్ నుంచి రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు సంబంధిత పోలీసు ఉన్నతాధికారికి జాయినింగ్ లెటర్ ఇవ్వాలని సూచించారు. ఇది జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు తమ స్థానాల నుంచి రిలీవ్ కాలేదు. ఇప్పుడీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చనీయాశంగా మారింది. అసలు ఏం జరుగుతోంది..? పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ వ్యవహారంలో పోలీసులు పట్టువీడనట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటి పోయినందున తాము వెళ్లలేమని పేర్కొన్నారని సమాచారం. 2016లో జిల్లా విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు పలువురు పోలీసులను ఆర్డర్ టు సర్వ్ ద్వారా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో రెండు సార్లు బదిలీలు జరిగాయి. అయితే ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఉమ్మడి జిల్లాలోనే బదిలీ అయిన వారు ప్రస్తుతం సొంత జిల్లాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు. అయితే గత నెల జరిగిన బదిలీలకు సంబంధించి ఆదేశాలు వెలువడినా పోలీసులు బేఖాతరు చేయడం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పరిశీలన జరిగిందా..! జిల్లాల విభజనకు ముందే పలువురు పోలీసులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రధానంగా కొన్నేళ్లుగా ఒకే దగ్గర పోస్టింగ్ ఉండడంతో ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే 2016లో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు సంబంధించి జిల్లా పోలీసు అధికారి (డీపీవో) కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాడ్డాయి. మంచిర్యాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అప్పట్లోనే పోలీసులకు సంబంధించి సర్వీస్ బుక్‌లను ఆయా జిల్లాల వారీగా డీపీవో కార్యాలయాలకు తరలించారు. ప్రస్తుతం బదిలీల్లో సదరు పోలీసులు చదువుకున్న ప్రాంతానికి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికెట్, పోలీసు శాఖలో అతని సర్వీసుకు సంబంధించిన బుక్‌ను పరిశీలించి వారు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి చెందినవారైతే ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏళ్లుగా తమ సొంత ప్రాంతాన్ని విడిచి ప్రస్తుతం వేరే చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు బదిలీపై వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరో పక్క ఆర్డర్ టు సర్వ్ ద్వారా కొంత మంది ఇతర జిల్లాలకు వెళ్లిన వారు మూడు సంవత్సరాలైనా తమ సొంత జిల్లాకు బదిలీ చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. -
పంచాయతీకి ‘ఉపాధి’ అనుసంధానం
నల్లగొండ : గ్రామపంచాయతీలకు ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేయనున్నారు. కూలీలకు వంద రోజులు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గ్రామపంచాయతీలకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పనుల్లో మరింత జవాబు దారీతనం పెరిగే అవకాశం ఉంది. గ్రామాలకు అవసరమైన పనులనే గ్రామ సర్పంచ్, కార్యదర్శుల తీర్మానాల మేరకు చేపట్టి గ్రామాభివృద్ధికి బాటలు వేయనున్నారు. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తారు. ఉపాధి హామీ పథకం పనులను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో జరిగే ఉపాధి పనులను గ్రామ పంచాయతీల పర్యవేక్షణలోనే చేపట్టాలని నిర్ణయించింది. దీనిని ప్రస్తుతం డీఆర్డీఏ పరిధిలోని సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పనులపై పెద్దగా పంచాయతీలకు పర్యవేక్షణ ఉండడం లేదు. దాంతో జవాబుదారీతనం లేకపోవడం వల్ల చేపట్టే వాటితో ఇటు గ్రామపంచాయతీకి ఉపయోగపడకపోనూ, కూలీలకు కూడా వంద రోజులు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. అయితే క్షే త్రస్థాయిలోని గ్రామ పంచాయతీ సహాయకులు, ఇటు గ్రామ కా ర్యదర్శులను కూడా భాగస్వాములను చేసే విధంగా గ్రా మీ ణా భివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో వన నర్సరీలు ఇప్పటికే చేపడుతున్నారు. ఐదో విడత హరితహారం కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. వీటికి తోడు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పనులను కూడా వారికే అప్పగిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం. వంద రోజుల పని తప్పనిసరి గ్రామాల్లో నమోదు చేసుకున్న కూలీకి వంద రోజుల పని తప్పనిసరి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఎవరు కూలీలు అనేది పంచాయతీ పాలకవర్గానికి కచ్చితంగా తెలుస్తుంది. దాంతో ఎవరికైతే వంద రోజులు పని రాదో వారిని గుర్తించి కల్పించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి పర్యవేక్షణలోనే పనులు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే ఉపాధి హామీ పనులన్నీ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి పర్యవేక్షణలో చేపట్టనున్నారు. పనుల గుర్తింపుతో పాటు పనుల నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. దీనికి తోడు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం పంచాయతీలో ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం ప్రభుత్వం చేపట్టింది. వారికే ఉపాధి పనుల అదనపు బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. ఇక పంచాయతీలకు అవసరమైన పనులను సర్పంచ్, కార్యదర్శులు ఆ గ్రామాభివృద్ధికి వాటిని గుర్తించి చేపట్టుకునేందుకు కూడా ఆస్కారం ఉంది. గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం పంచాయతీలకు ఉపాధి పనులు అనుసంధానం చేయడం వల్ల మరింత అభివృద్ధి పనులు జరగనున్నాయి. సర్పంచులు ప్రత్యేక దృష్టిని సారిస్తే కోట్లాది రూపాయల విలువ చేసే పనులు గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనులకు సంబంధించి డంపింగ్ యార్డుల నిర్మాణానికి పంచాయతీ నిధులు కాకుండా ఉపాధి నిధులను వాడవచ్చు. చెత్తను తరలించడం ద్వారా కూలీలకు నిత్యం పని కల్పించే అవకాశం ఉంది. ఈ నిధులతోనే వైకుంఠదామాలు నిర్మించుకునేందుకు కూడా అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రతి ఇంట్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేందుకు ఉపాధి పథకం ద్వారా రూ. 4వేలు ఇవ్వనుంది. స్వచ్ఛభారత్ కా>ర్యక్రమాలు, మరుగుదొడ్లు, పశువులకు నీటితొట్లు, వర్మికంపోస్టు తదితర వాటిని చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి ఉపాధి హామీ పనులు పంచాయతీలకు అనుసంధానం చేయడం వల్ల గ్రామాల్లో ఏయే పనులు అవసరమో గుర్తించడంతోపాటు అత్యవసరమైనవాటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. పనుల గుర్తింపు పంచాయతీల పరిధిలోనే జరుగుతుండడం వల్ల ఆ గ్రామంలో ఏది అవసరమో వారికి తెలుస్తుంది. తద్వారా గ్రామంలో ప్రజలకు అత్యవసరమైన పనులను వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గ్రామ పంచాయతీ భవనంలోనే ఉంటారు. తద్వారా అంతా కలిసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. – డీపీఓ విష్ణువర్థన్ రెడ్డి -
జాబితాలో సవరణకు అవకాశం
ధరూరు : ఓటరు లిస్టులో సవరణల కోసం ఈ నెల 8 వరకు అవకాశం ఉందని దానిని రాజకీయ పార్టీల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి నరసింహనాయుడు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో అయిదో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు లిస్టులో తొలగింపు చేయాల్సి ఉందని, కొత్తగా చేర్చిన వారి జాబి జాబితాలో నమోదు కాలేదని నాయకులు ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్ట్రోరల్ అధికారి, లేదా డీపీఓలను కలవాలని సూచించారు. మూడు చోట్ల ఓటు హక్కు.. మల్దకల్ : ప్రభుత్వం ఒక ఓటరు ఒకే చోట తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిబంధనలు విధించినప్పటికీ బీఎల్ఓల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొన్ని గ్రామాల్లో ఒక ఓటరు మూడు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మండల అధ్యక్షుడు పాలవాయి రాముడు, బ్రహ్మోజిరావు, బంగి గోవిందులు ఆరోపించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సూపరింటెండెంట్ రాజారమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాలో ఒక కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరైనా వేర్వేరు చోట ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఈ నెల 10లోపు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటరు జాబితాలో కొందరు ఓటర్ల పేర్లను బీఎల్ఓలు తొలగించకుండా అలాగే ఉంచారని, బీఎల్ఓలు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ.. వారి అనుచరుల పేర్లు తొలగించడం లేదన్నారు. వివాహాలు చేసుకుని వెళ్లిన, గ్రామంలో నివాసం లేకుండా వెళ్లిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉన్నాయని వాటన్నింటిని తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సవారమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు, నీలిపల్లి కృష్ణయ్య, కిశోర్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నూతన కానిస్టేబుళ్లు 1న డీపీఓలో హాజరుకావాలి
కర్నూలు : సివిల్, ఏఆర్, వార్డర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులు జూన్ 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో పాల్గొని ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన సివిల్ అభ్యర్థులు 218 మంది, ఏఆర్ అభ్యర్థులు 42 మంది, వార్డర్ పురుష అభ్యర్థులు 49 మంది, ఒక వార్డర్ మహిళా అభ్యర్థి అటెస్టేషన్ ఫారంలో పూర్తి వివరాలను నింపి డీపీఓలో అధికారులకు సమర్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్(పీఈటీ)లలో పాల్గొని సివిల్, ఏఆర్, వార్డర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని ఎస్పీ సూచించారు. -
వసూల్ రాణిపై విచారణంటేనే హడల్!
చేతులెత్తేసి తప్పుకున్న డీపీఓ వసూళ్లపై ప్రాథమికంగా నిర్థారణ విచారణాధికారిగా జేసీ–2 రాధాకృష్ణ నియామకం సాక్షి ప్రతినిధి, కాకినాడ : వసూళ్ల రాణిపై విచారణ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎం.బాలామణిపై శాఖాపరమైన విచారణ చేయలేనంటూ స్వయంగా ఇన్చార్జి డీపీఓ టీవీఎస్‌జీ కుమార్ చేతులెత్తేశారు. డీపీఓ కార్యాలయ ఏఓ బాలామణి పంచాయతీ కార్యాదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయాన్ని గత నెల 29న ‘వసూళ్ల రాణి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో గత నెల 30న ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వసూళ్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ డీపీఓ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన డీపీఓ నలుగురైదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను విచారించి వసూళ్ల విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. విచారణ ముందుకు వెళితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనే నిర్థారణకు రావడంతో అధికార పార్టీ నేతలు విచారణను అడ్డుకునే ప్రయత్నాలకు తెరతీశారు. కాకినాడలోని డీపీఓ కార్యాలయంలో అన్ని వ్యవహారాలు తెలిసి పరోక్షంగా ఆధిపత్యం చెలాయించే ఒక రిటైర్డ్ డీపీఓ కూడా విచారణను ముందుకుసాగకుండా అడ్డుతగులుతున్నారని కార్యాలయ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలే ఇన్చార్జి బాధ్యతలు, తనను డీపీఓగా నియమించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పుడు అనవసర రాద్ధాంతం నెత్తిన పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గానీ డీపీఓ కుమార్ హఠాత్తుగా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవడం కార్యాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టర్ అప్పగించిన బాధ్యతల మేరకు డీపీఓ అప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభమైన నాలుగు రోజులకే అధికార పార్టీ నేతలు అడ్డుచక్రం వేయడం మొదలుపెట్టారు. విచారణ నివేదిక ‘కర్ర విరగకండా...సామెత మాదిరిగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇంతలో డీపీఓ విచారణలో వసూళ్ల వ్యవహారం వాస్తవమేనని ప్రాథమికంగా ఒక నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమయంలోనే విచారణ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో డీపీఓ స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. వసూళ్ల వ్యవహారంపై డీపీఓ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జేసీ–2ను లోతైన విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే విచారించిన గ్రామ కార్యదర్శులతో పాటు కోనసీమలోని పలువురు కార్యదర్శులను విచారించాల్సి ఉందని చెబుతున్నారు. -
శతశాతం ఎలక్ట్రికల్ సర్వే నిర్వహించాలి
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శతశాతం ఎలక్ట్రికల్ సర్వే చేయాలని డీపీఓ బలిబాడ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోనూ ఎన్ని విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు ఉన్నాయో సర్వే చేపట్టాలన్నారు. ఎన్నింటికి డబ్బులు చెల్లించారు..? అధనంగా ఎన్నింటికి చెల్లించి ఉన్నారన్న విషయాలను సర్వే చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీ సమాచారాన్ని ఎంత మేరకు సేకరించారన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడి ఉన్న మెంటాడ, ఇతర మండలాధికారులను మందలించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై వారికి అవగాహన కల్పించారు. తాగునీటి పథకాలు విద్యుత్ లేని కారణంగా ఆగిపోరాదన్నారు. అలా జరిగితే సంబంధిత సర్పంచ్‌లు, కార్యదర్శులే బాధ్యులన్నారు. ఇంటి పన్నుల వసూళ్లను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం డీఎల్పీఓ మోహనరావు, ఈఓపీఆర్ఆర్డీల సంఘం అధ్యక్షుడు ఐ.సురేష్, పర్యవేక్షకుడు కేఆర్ఎం పంతులు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
► పూర్తిస్థాయి పరిశీలన అనంతరం చర్యలు ► డీపీవో సుదర్శన్ జూలపల్లి: వడ్కాపూర్ గ్రామ సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు వార్డు సభ్యులు ఈనెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులు చేస్తున్నారని, పంచాయతీలో వసూలైన ఇంటి పన్ను, నల్లా బిల్లు, నూతన నల్లా కనెక్షన్ల డబ్బులు, గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే అంగడిలో వసూలు చేస్తున్న డబ్బులు ఎస్టీవోలో జమ చేయకుండానే సొంతానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా సర్పంచ్ కనకట్ల కళ గతంలో వార్డు సభ్యులకు రూ.5వేల చొప్పున ఇచ్చినట్లు, మరిన్ని డబ్బుల కోసమే వేధిస్తున్నారని డీపీవోకు రాసి ఇ చ్చారు. పంచాయతీ రికార్డులను స్వాదీనం చేసుకున్న డీపీవో పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, సెక్రటరీ అంజ య్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మోడల్ జీపీల ఏర్పాటే లక్ష్యం
అక్రమలే అవుట్లపై కొరడా పారిశుధ్యం, తాగునీటి వసతులపై ప్రత్యేక దృష్టి ‘సాక్షి‘తో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ హాజీపూర్(మంచిర్యాల రూరల్) : గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తూ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తగిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి చిట్టుమల్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డీపీవో బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌తో ‘సాక్షి‘ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి : ఇప్పటి వరకు పంచాయతీ వ్యవస్థలో ఎలాంటి బాధ్యతలు చేపట్టారు? డీపీవో : 1990లో గ్రూప్-2 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలో భాగంగా బాధ్యతలు స్వీకరించాను. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, మావల గ్రేడ్ పంచాయతీలో పని చేశాను. 2007లో ఈవోపీఆర్డీగా పని చేశారు. ఇక ఎంపీడీవోగా కౌటాల, బెజ్జూర్, తాంసీలో పని చేశాను. ఇన్చార్జి డీఎల్పీవోగా 2010లో ఆదిలాబాద్‌లో పని చేశాను. 2013 నుంచి ఇప్పటి వరకు డివిజినల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో)గా జగిత్యాలలో పని చేశాను. జిల్లాల ఏర్పాటులో భాగంగా జీపీ అధికారిగా పదోన్నతి పొంది మంచిర్యాల జిల్లాలో మొదటి డీపీవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి : పారిశుధ్యం, తాగు నీరు అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? డీపీవో : మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉం డగా మొత్తం 205 గ్రామ పంచాయతీలున్నాయి. వ్యా ధుల సీజన్ అని కాకుండా ప్రతీ కాలంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వ్యూ హా త్మకంగా ముందుకు వెళ్తాం. మురికికాలువలు శ ుభ్ర ం, క్లోరినేషన్ తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాక్షి : వర్షాకాల సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డీపీవో : వర్షాకాల సీజన్లో భాగంగా ఈ అక్టోబర్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ప్రజలకు సురక్షిత నీరు అందేలా చూస్తాం. పౌష్టికాహారం, వైద్యం విషయాల్లో కూడా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా పందుల పెంపకం గ్రామాల్లో జరగకుండా చూస్తాం. సాక్షి : గ్రామాల అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తున్నారు? డీపీవో : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం, తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతాం. అభివృద్ధిలో ప్రత్యేక ప్రణా ళికతో గ్రామాలను ఆదర్శంగా తయారు చేసేలా చూస్తాం. సాక్షి : నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎలా అధిగమిస్తారు ? డీపీవో : పలు జీపీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. ఈ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరి స్తాం. ప్రజలకు జవాబుదారీ తనంగా ఇదే సమయంలో పారదర్శక పాలన అందేలా బాధ్యతల నిర్వహణ సాగుతుంది. సాక్షి : మోడల్ గ్రామ పంచాయితీలపై ఎలా వ్యవహరిస్తారు? డీపీవో : జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి చేస్తాం. మొదటి విడతలో మండలానికి 2 గ్రామాలను మోడల్ జీపీలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికతో ముందుకు సాగుతాం. సాక్షి : పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి? డీపీవో : జిల్లాలో పన్నుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామాల పన్నుల లక్ష్యాలను మాత్రం వచ్చే జనవరిలోగా సాధించేలా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు 100 శాతం పన్నుల లక్ష్యాలను చేరుకున్నాం. సాక్షి : అక్రమ లే అవుట్ వెంచర్లపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? డీపీవో : ముందు ఆ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణ విషయంలో ఇబ్బందులు తప్పవు. ఇక అక్రమ లే అవుట్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అ నుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై నివేది క తెప్పించుకున్నాం. అక్రమ లే అవుట్లపై కొరడా ఝుళిపిస్తాం. సాక్షి : జీపీల అభివృద్ధికి చర్యలు? డీపీవో : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ని బద్ధతగా పని చేయాలి. -
డీపీవో కార్యాలయం పరిశీలన
జగిత్యాల అర్బన్ : దసరా నుంచి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో కలెక్టరేట్, డీపీవో, ఇతర కార్యాలయాలను కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ అధికారులు పరిశీలించారు. కార్యాలయాల్లో ఓఎఫ్సీ కేబుల్ వేయాలని, సౌకర్యాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్, డీపీవో కార్యాలయంలో ఆన్లైన్ ఏర్పాట్లు ప్రధానమైనవని వారు అన్నారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్‌రావు, బీఎస్ఎన్ఎల్ డీఈ ప్రభాకర్‌రావు, ఎస్డీఈ శేఖర్, జేఈలు గంగాధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
డీపీఓ అరుణ శామీర్‌పేట్: ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని డీపీఓ అరుణ అన్నారు. ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల గురించి తెలుసుకుని మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మండలంలోని 8 గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది డీపీఓను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీడీఓ జ్యోతి, ఈఓపీఆర్డీ శ్రీనివాస్ గుప్త, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లే‘ఔట్’..!
♦ జిల్లా పరిధిలో 102 అక్రమ లేఅవుట్లు రద్దు ♦ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వెంచర్లు ♦ అక్రమమని తేలుస్తూ పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ♦ వాటిని రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. అనధికారికంగా వెలిసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపింది. డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని మండలాల్లో పుట్టుకొచ్చిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డగోలుగా వెలిసిన వెంచర్ల చిట్టాను సేకరించిన డీటీసీపీ విభాగం అక్రమార్కుల జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖకు పంపింది. ఈ మేరకు డీటీసీపీ నిర్ధారించిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్లు డీపీఓ అరుణ ప్రకటించారు. కేసులు పెడతాం.. అనధికారికంగా వెలిసిన లేఅవుట్లను కూల్చేస్తాం. 102 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డగోలుగా లేఅవుట్లు చేస్తే ఉపేక్షించేది లేదు. అక్రమమని తేల్చిన లేఅవుట్ల జాబితాను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తాం. ప్లాట్లు కొనేముందు ఆయా వెంచర్లకు అనుమతి ఉందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకుంటే మోసాల బారినపడే అవకాశముండదు. - అరుణ , డీపీఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ఎలాంటి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఎండీఏకు.. ఆ పరిధి దాటిన మండలాల్లో డీటీసీపీకి మాత్రమే లేఅవుట్లకు అనుమతులు జారీ అధికారం ఉంది. అయితే, ఈవిషయాన్ని గుట్టుగా ఉంచుతున్న రియల్టర్లు పంచాయతీ లేఅవుట్ల పేర కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. అభివృద్ధి చేయని వెంచర్లలో కారుచౌకగా ప్లాట్లు విక్రయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్లతో పోలిస్తే తక్కువ ధరకు స్థలాలు దొరుకుతుండడంతో అల్పాదాయవర్గాలు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న స్థిరాస్తి సంస్థలు.. మారుమూల ప్రాంతాల్లో సైతం వెంచర్లు చేశాయి. కనీస రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా వేయకుండా.. నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. కొ న్ని సంస్థలయితే.. భూ వినియోగ మార్పి డి చేయకుండానే లేఅవుట్లుగా అభివృద్ధి చేసినట్లు డీటీసీపీ అధికారుల పరిశీలనలో తేలి ంది. అంతేకాకుండా కొన్నిచోట్ల భూ యజ మానికి కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కాపీతోనే ప్లాట్లను అమ్మేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డీటీసీపీ అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా దా దాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లు (102) వెలిసినట్లు తేల్చి జాబితాను జిల్లా పంచాయతీశాఖాధికారికి అంద జేసింది. -
ఫిర్యాదు వస్తే పండగే!
డీపీవోలో అక్రమాల దందా విచారణతోనే సరి చర్యలకు కాసులతో బంధం కరీంనగర్ సిటీ : ‘గంగాధర మండలం కొండన్నపల్లి సర్పంచ్ అవినీతికి పాల్పడ్డారంటూ గత సంవత్సరం గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2015 నవంబర్ 9వ తేదీన డీఎల్పీవో విచార ణ కోసం నోటీసు జారీ చేశారు. అదే నెల 18వ తేదీన గ్రామంలో డీఎల్పీవో విచారణ చేపట్టి, రికార్డులు సీజ్ చేసి తీసుకెళ్లారు. సుమారు రూ.9 లక్షల నిధుల్లో రూ.55 వేలు దుర్వినియోగం అయినట్లు నిర్ధారిస్తూ 2016 జనవరి 5వ తేదీన డీఎల్పీవో తన నివేదికను డీపీవో కార్యాలయానికి పంపించారు.’ కాని ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. విచారణలో డబ్బులు స్వాహా చేసినట్లు నిర్ధారణ అయినా ఎందుకు చర్యతీసుకోవడం లేదంటూ గ్రామస్థులు సోమవారం మరోసారి డీపీవోను కలిసి ఫిర్యాదు చేశారు. ఇది జిల్లాలో సర్పంచుల అక్రమాలపై విచారణ పేరుతో జరుగుతున్న తంతుకు ఒక ఉదాహరణ మాత్రమే. సర్పంచులపై ఫిర్యాదు వచ్చిందంటే చాలు డీపీవో కార్యాలయంలో కాసులు కురుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పంచాయతీ జిల్లా కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి ఈ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నాడనేది బహిరంగ రహస్యం. ఫిర్యాదు రావ డం, డీఎల్పీవో విచారణ చేయడం సాధారణంగా జరిగేదే అయినా.. నివేదిక రాగానే సదరు ఉద్యోగి రంగ ప్రవేశం చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ సదరు ఉద్యోగిని ‘కలవగానే’ డీఎల్పీవోలు ఇచ్చిన నివేదికలు అటకెక్కుతుండడం ఇక్కడ పరిపాటి. కొండన్నపల్లి గ్రామస్థులు మరోసారి డీపీవోను కలిసి ఎందుకు చర్యతీసుకోవడం లేదని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. కాని సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, గంగాధర, జమ్మికుంట తదితర మండలాల్లోని పలు గ్రామాల్లోనూ ఇదే తతంగం చోటుచేసుకుందనే విమర్శలున్నాయి. ఎవరైనా ప్రజాప్రతినిధి వెంటపడితే అక్కడక్కడా సర్పంచుల చెక్‌పవర్‌లో కోత విధించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కఠిన చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు లేవు. వీటికి కారణం డీపీవో కార్యాలయంలో చక్రం తిప్పే సదరు ఉద్యోగి అండదండలు సదరు సర్పంచులకు ఉండడం కారణమనే ప్రచారం ఉంది. జిల్లాలో సర్పంచులపై వచ్చిన ఆరోపణలు, డీఎల్పీవోల విచారణ నివేదికలు, ఎంతమందిని దోషిగా తేల్చారు, ఎందరిపై చర్యతీసుకున్నారనే అంశాలపై కలెక్టర్ దృష్టిసారిస్తే అవినీతి, అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు
-
లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు
మరో అవినీతి చేప ఏబీసీ వలలో చిక్కింది. వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఉద్యోగం కోసం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. సోమ్లా నాయక్ తో పాటు.. సీనియర్ అసిస్టెంట్ అలీ, అటెండర్ సారంగ పాణిలను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఇదో రకం..పంచాయితీ!
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం నగర పంచాయతీగా మారి సుమారు ఏడాది అవుతోంది. ఇటీవలే ఎన్నికలు జరిగి కౌన్సిల్ పాలకవర్గం కూడా ఏర్పాటైంది. కానీ ఇప్పటికీ ఇక్కడ పంచాయతీ పాలనే కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రధాన మార్కెట్లోని షాపుల లీజుల వ్యవహారం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి పట్టణ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారం నగర పంచాయతీగా మారిన తర్వాత కూడా కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు పంచాయతీగా ఉన్న పాలకొండలోని ప్రధాన మార్కె ట్లో సుమారు 28 ఏళ్ల క్రితం నిర్మించిన షాపులకు ఇప్పటికీ నామమాత్రపు అద్దెలే వసూలు చేస్తున్నారు. 36 పెద్ద, 10 చిన్న షాపులు ఉండగా.. పెద్ద షాపులకు రూ.700, చిన్నవాటికి రూ.550 అద్దె వసూలవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల పాలకొండ గత పంచాయతీ, ప్రస్తుత నగర పంచాయతీ లక్షల్లోనే ఆదాయం కోల్పోయింది. స్థాయి పెరిగిన తర్వాత కూడా.. నిబంధనల మేరకు అద్దె ఎందుకు పెంచలేదన్నది పక్కన పెడితే నగర పంచాయతీగా మారిన తర్వాత దాని పరిధిలోని షాపులు, ఇతరత్రా లీజులను టెండర్లు పిలిచి మున్సిపల్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉంటంది. అద్దెలను కూడా నగర పంచాయతీ స్థాయికి తగినట్లు పెంచాలి. కానీ ఇక్కడ మాత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలోని కొందరి అండదండలతో పాలకొండ పంచాయతీ అధికారులే ఆ పని కానిచ్చేశారు. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆగమేఘాల మీద పాత రేట్లకే లీజులు రెన్యూవల్ చేసేశారు. స్పెషల్ అధికారి దృష్టికి గానీ, కమిషనర్ దృష్టికి గానీ తీసుకువెళ్లక పోవడంతో అక్రమాలు జరగాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందుకు గాను ఒక్కో షాపు నుంచి వేలల్లో దండుకున్నారని తెలుస్తోంది. పైగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు లీజు కాలపరిమితి పెంచినట్లు ఆయా అధికారుల సంతకాలతోనే ధ్రువపత్రాలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ధ్రువపత్రాలు చూపేందుకు అటు సిబ్బంది.. ఇటు షాపుల నిర్వాహకులు అంతగా సుముఖత చూపకపోవడంతో అధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయన్న అనుమానాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. సొంత షాపుల్లా చెలామణీ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన మార్కెట్లో ఉన్న ఈ 46 షాపులను ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వర్తకులు వీటిని తమ సొంత షాపుల్లా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వీటిలో వస్త్రాలు, కిరాణా, సిమెంట్, ఐరెన్ వంటి హోల్‌సేల్ దుకాణాలతో పాటు కూరగాయలు, పండ్లు వంటి చిరు వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. ప్రతి మూడేళ్లకోసారి లీజు గడువును పొడిగించుకుంటూ నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు. తాజాగా 2014-15 సంవత్సరానికి గాను ఈ షాపుల రెన్యూవల్ ఇటీవలే జరిగింది. అయితే అద్దెలు మాత్రం పంచాయతీ హయాంలో చెల్లిస్తున్న రేట్లే చెల్లిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా లీజుకు తీసుకున్న ఈ షాపుల్లో కొన్నింటిని లీజుదారులు వేరే వ్యక్తులకు ఇచ్చి అధిక అద్దెలు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ టి.కనకరాజు వద్ద ప్రస్తావించగా ఏళ్ల తరబడి ఉన్న వ్యాపారస్తులు మూడేళ్లకోసారి షాపుల రెన్యూవల్‌కు దరఖాస్తు చేస్తున్నారని, తాజాగా మార్చి నెలలో ఈ షాపుల లీజు రెన్యూవల్ చేసిన సమయంలో 33.13 శాతం అద్దె పెంచినట్లు చెప్పడం విశేషం. ఫైళ్లు చూపించడం లేదు:డీపీవో ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత ఫైల్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ఫైల్‌ను తనకు చూపించలేదని ఎక్కడ ఉందో కూడా తెలియడంలేదన్నారు. దాంతో తనకూ కూడా అనుమానం కలుగుతోందన్నారు. నగర పంచాయతీగా మారిన తర్వాత లీజు పొడిగింపు అధికారం పంచాయతీ అధికారులకు ఉండదన్నది వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం
- దేవరపల్లి ఘటనపై ఎస్పీ, డీపీవోకు వైఎస్సార్ సీపీ నేతలఫిర్యాదు - స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని వినతి సాక్షి, ఏలూరు : దేవరపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నేత తలారి వెంకట్రావు జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ, డీపీవో పి.నాగరాజువర్మకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. దేవరపల్లిలో శుక్రవారం ఎంపీపీ ఎన్నికను టీడీపీ నేతలు అడ్డుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతలపై దాడులకు పాల్పడటంపై ఆ పార్టీ నేతలు ఎస్పీని, డీపీవోను శుక్రవారం రాత్రి కలిశారు. ఘటనకు సంబంధిం చిన వివరాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, శనివారం జరిగే రీ పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రిటర్నింగ్ అధికారి రామారావు టీడీపీకి కొమ్ముకాస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఇదేవిధమైన దౌర్జన్యాలను కొనసాగిస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేంతోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జిల్లాలో ఒక్క ఎంపీపీ పదవి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కన్వికూడదన్న దురుద్దేశంతో టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. పచ్చని పశ్చిమలో కొట్లాటల సంస్కృతిని తీసుకురావడం దారుణమన్నారు.