మరో అవినీతి చేప ఏబీసీ వలలో చిక్కింది. వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఉద్యోగం కోసం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. సోమ్లా నాయక్ తో పాటు.. సీనియర్ అసిస్టెంట్ అలీ, అటెండర్ సారంగ పాణిలను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.