డీపీవో కార్యాలయం పరిశీలన
Published Sat, Oct 1 2016 11:51 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
జగిత్యాల అర్బన్ : దసరా నుంచి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో కలెక్టరేట్, డీపీవో, ఇతర కార్యాలయాలను కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పరిశీలించారు. కార్యాలయాల్లో ఓఎఫ్‌సీ కేబుల్ వేయాలని, సౌకర్యాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్, డీపీవో కార్యాలయంలో ఆన్‌లైన్ ఏర్పాట్లు ప్రధానమైనవని వారు అన్నారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్‌రావు, బీఎస్‌ఎన్‌ఎల్ డీఈ ప్రభాకర్‌రావు, ఎస్‌డీఈ శేఖర్, జేఈలు గంగాధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement