
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లుబాటుతో అపరిమిత కాల్‌లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.
హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 2399. ఇది 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేరుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేసుకోవచ్చు. కొంత తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజుల ప్లాన్ కోసం వేచి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్స్
➤రూ. 1999 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.
➤రూ.1499 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా మరియు, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.
➤రూ.1198 ప్లాన్: 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3 జీబీ డేటా మరియు నెలకు 30 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.
➤రూ.997 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తుంది. వాలిడిటీ 160 రోజులు.
➤రూ. 897 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 90 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తుంది. వాలిడిటీ 180 రోజులు.
Comments
Please login to add a commentAdd a comment