unlimited call
-
ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా అవి టారిఫ్‌లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది.14 నెలల ప్లాన్ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బీఎస్ఎన్ఎల్ సేవలకు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం.ఇప్పుడు పరిచయం చేసిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలలు లేదా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇప్పుడు దీనిని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట.ప్రయోజనాలురూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్‌తో సహా అపరిమిత కాల్‌లను ఆస్వాదించవచ్చు. 425రోజులు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ డేటా పూర్తయిపోయినప్పటికీ.. 4kbps వేగంతో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితం.జియో, ఎయిర్టెల్ (Airtel) వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తరువాత.. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. ఆ తరువాత రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కొంత తగ్గించడంతో.. కొందరు మళ్ళీ జియో, ఎయిర్టెల్ వైపు తిరిగారు. ప్రస్తుతం జియో కూడా వార్షిక ప్లాన్స్ రూ. 3,599 ధరతో అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!జియో (Jio) వార్షిక ప్లాన్ (రూ.3599)తో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ (రూ. 2399) చాలా తక్కువ. కాబట్టి ధరలను దృష్టిలో ఉంచుకుని యూజర్లు తమకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 14 నెలల ప్లాన్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ప్రైవేటు టెలికం కంపెనీలకు ధీటుగా మొబైల్ సేవలు విస్తరించేందుకు చర్యలకు దిగింది. ప్రస్తుతం హైదరాబాద్ టెలికం పరిధిలో సుమారు 9 లక్షల వరకు మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత సీమ్ కార్డుల మేళాతో ప్రతి నేల 10 నుంచి 20 వేల వరకు కొత్త వినియోగదారులు ఆకర్షితులవుతున్నట్లు పీజీఎం రాంచంద్ర తెలిపారు. మొబైల్ వోచర్స్ పై పలు ఆఫర్స్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆల్‌ఫ్రీ ప్లాన్ ఆల్ ఫ్రీ ప్లాన్ పేరుతో రూ.144 వోచర్స్లకు 30 రోజుల కాలపరిమితితో అన్నిరకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం కల్పించింది. అదేవిధంగా 90 రోజుల కాలపరిమితి గల రూ.439 వోచర్‌కు అన్ని రకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ ఆఫర్ కాలపరిమితి మార్చి 31 వరకు వర్తిస్తుంది. స్పెషల్ టారిప్ వోచర్ స్పెషల్ టారిఫ్ వోచర్ కింద రూ.339 విలువ గల వోచర్‌పై 28 రోజుల కాలపరిమితితో అన్ని రకాల నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్‌తోపాటు 1జీబీ డాటా అందిస్తోంది. రూ. 139 వోచర్‌పై బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు పరిమితి లేకుండా ఉచిత కాల్స్ తోపాటు300ఎంబీ డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ మార్చి 17 వరకు ఉంటుంది. అదనపు టాక్‌టైమ్ రూ. 220, రూ. 2000, రూ.2200, రూ. 2500, రూ.3000 టాప్‌ఆప్‌పై ఫుల్ టాక్ టైమ్, రూ. 550 టాప్‌ఆప్‌పై 575, రూ. 1100లకు 1200లు, రూ.3300లకు 3500 , రూ.5500లకు 6000ల ఎక్స్ట్రా టాక్ టైమ్ అందిస్తోంది. డబుల్ డాటా ఆఫర్స్ ఎస్టీవీ కింద డబుల్ డాటా ఆఫర్స్ ప్రకటించింది. 365 కాలపరిమితి గల రూ. 4498 వోచర్‌కు 80 జీబీలు. రూ. 3998లకు 60 జీబీలు, 2798లకు 36 జీబీలు, 1498లకు 18జీబీల డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ కూడా మార్చి 31 వరకు వర్తిస్తోంది. కొత్త కనెక్షన్లకు 300 ఎంబీ డాటా ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా 5రోజుల కాలపరిమితితో రూ.78లకు 2జీబీ, 14రోజుల కాలపరిమితితో రూ.98లకు 2జీబీ, 15 రోజుల కాలపరిమితితో రూ.155లకు 2జీబీ 10 రోజుల కాలపరిమితితొ రూ.156లకు 3జీబీ, 29 కాలపరిమితితో రూ. 198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ.198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ. 291లకు 8జీబీ, 60 రోజుల కాలపరిమితితో 444లకు 8జీబీలు, 60 రోజుల కాలపరిమితితో రూ.451లకు 6జీబీ, 80 టాక్‌టైమ్, 30 రోజుల కాలపరిమితితో రూ.549లకు 15జీబీ, 60రోజుల కాలపరిమితితో రూ.561లకు 11జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.821లకు 15జీబీ, 30 రోజుల కాలపరిమితితో రూ. 3099లకు 20జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లు, ఉచిత కాల్స్ వరిస్తాయి. కాంబో ఎస్టీవీ కాంబో ఎస్టీవీ ఆఫర్ కింద రెండు రోజుల కాలపరిమితితో రూ. 13లకు 15 రూపాయల విలువగల టాక్‌టైమ్, 10ఎంబీ డాటా, 10రోజుల కాలపరిమితితో రూ.77 వోచర్‌కు 80ల విలువగల టాక్‌టైమ్, 30 ఎంబీల డాటా, 15 రోజుల కాలపరిమితితో రూ.177 వోచర్‌కు 180 రూపాయల విలువగల టాక్ టైమ్తోపాటు 50ఎంబీ అందిస్తోంది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు వర్తిస్తోంది. అదేవిధంగా రూ. 30 రోజుల కాలపరిమితి గల 1099 విలువగల ఎస్‌టీవీకి అన్ లిమిటేడ్ డాటా స్పీడ్ ప్రకటించింది. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయ టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెల్కోలన్నీ దిగివచ్చి చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది. నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది. దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను అఫర్ చేస్తోంది. 'బీబీజీ కాంబో ప్లాన్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులు నెలకు రూ.1199 దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితం, దీంతోపాటు అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఈ పట్టికను గమనించండి.