బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌ | BSNL's Sensational Offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

Published Sun, Feb 19 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌ : 
బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. ప్రైవేటు టెలికం కంపెనీలకు ధీటుగా మొబైల్‌ సేవలు విస్తరించేందుకు చర్యలకు దిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌ టెలికం పరిధిలో సుమారు 9 లక్షల వరకు మొబైల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత సీమ్‌ కార్డుల మేళాతో ప్రతి నేల 10 నుంచి 20 వేల వరకు కొత్త వినియోగదారులు ఆకర్షితులవుతున్నట్లు పీజీఎం రాంచంద్ర తెలిపారు. మొబైల్‌ వోచర్స్‌ పై పలు ఆఫర్స్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.

ఆల్‌ఫ్రీ ప్లాన్‌
ఆల్‌ ఫ్రీ ప్లాన్‌ పేరుతో రూ.144 వోచర్స్‌లకు 30 రోజుల కాలపరిమితితో అన్నిరకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం కల్పించింది. అదేవిధంగా 90 రోజుల కాలపరిమితి గల రూ.439 వోచర్‌కు అన్ని రకాల నెట్‌వర్క్‌లకు  రోజుకు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ కాలపరిమితి మార్చి 31 వరకు వర్తిస్తుంది.
 
స్పెషల్‌ టారిప్‌ వోచర్‌
స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ కింద రూ.339 విలువ గల వోచర్‌పై 28 రోజుల కాలపరిమితితో అన్ని రకాల నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్‌తోపాటు 1జీబీ డాటా అందిస్తోంది.  రూ. 139 వోచర్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు పరిమితి లేకుండా ఉచిత కాల్స్‌ తోపాటు300ఎంబీ డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ మార్చి 17 వరకు ఉంటుంది.

అదనపు టాక్‌టైమ్‌
రూ. 220, రూ. 2000, రూ.2200, రూ. 2500, రూ.3000 టాప్‌ఆప్‌పై ఫుల్‌ టాక్‌ టైమ్, రూ. 550 టాప్‌ఆప్‌పై 575, రూ. 1100లకు 1200లు, రూ.3300లకు 3500 , రూ.5500లకు 6000ల ఎక్స్‌ట్రా టాక్‌ టైమ్‌ అందిస్తోంది.

డబుల్‌ డాటా ఆఫర్స్‌
ఎస్‌టీవీ కింద డబుల్‌ డాటా ఆఫర్స్‌ ప్రకటించింది. 365 కాలపరిమితి గల  రూ. 4498 వోచర్‌కు 80 జీబీలు. రూ. 3998లకు 60 జీబీలు, 2798లకు 36 జీబీలు,  1498లకు  18జీబీల డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ కూడా మార్చి 31 వరకు  వర్తిస్తోంది. కొత్త కనెక్షన్లకు 300 ఎంబీ డాటా ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా 5రోజుల కాలపరిమితితో రూ.78లకు 2జీబీ, 14రోజుల కాలపరిమితితో రూ.98లకు 2జీబీ,  15 రోజుల  కాలపరిమితితో రూ.155లకు 2జీబీ 10 రోజుల కాలపరిమితితొ రూ.156లకు 3జీబీ, 29 కాలపరిమితితో రూ. 198లకు 3జీబీ, 28 కాలపరిమితితో  రూ.198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ. 291లకు 8జీబీ, 60 రోజుల కాలపరిమితితో 444లకు 8జీబీలు, 60 రోజుల కాలపరిమితితో రూ.451లకు 6జీబీ, 80 టాక్‌టైమ్, 30 రోజుల కాలపరిమితితో రూ.549లకు 15జీబీ,  60రోజుల కాలపరిమితితో రూ.561లకు 11జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.821లకు 15జీబీ, 30 రోజుల కాలపరిమితితో  రూ. 3099లకు 20జీబీ డాటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత కాల్స్‌ వరిస్తాయి.
 
కాంబో ఎస్‌టీవీ
కాంబో ఎస్‌టీవీ ఆఫర్‌ కింద  రెండు రోజుల కాలపరిమితితో రూ. 13లకు 15 రూపాయల విలువగల టాక్‌టైమ్, 10ఎంబీ డాటా, 10రోజుల కాలపరిమితితో రూ.77 వోచర్‌కు  80ల విలువగల టాక్‌టైమ్, 30 ఎంబీల డాటా, 15 రోజుల కాలపరిమితితో  రూ.177 వోచర్‌కు 180 రూపాయల విలువగల  టాక్‌ టైమ్‌తోపాటు 50ఎంబీ అందిస్తోంది. ఈ ఆఫర్‌ కూడా మార్చి 31 వరకు వర్తిస్తోంది. అదేవిధంగా రూ. 30 రోజుల కాలపరిమితి గల 1099 విలువగల ఎస్‌టీవీకి అన్‌ లిమిటేడ్‌ డాటా స్పీడ్‌  ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement