రెండో రోజు 330 మంది ఎంపిక | second day 330 persons selected | Sakshi
Sakshi News home page

రెండో రోజు 330 మంది ఎంపిక

Published Wed, Nov 9 2016 12:21 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

second day 330 persons selected

- కొనసాగుతున్న కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ
 
కర్నూలు: కమ్యూనికేషన్‌ కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్‌ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో రెండో రోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 603 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్టుకు హాజరయ్యారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన, బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారిని 30 మంది ప్రకారం బ్యాచ్‌లుగా చేసి1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రెండో రోజు మొత్తంగా 330 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 182 మంది ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్‌ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన  స్క్రీనింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలు మినహా వచ్చే నెల 3వ తేదీ వరకు నిరంతరాయంగా దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతాయని ఎస్పీ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement