జిల్లాస్థాయి చెస్ జట్ల ఎంపిక
Published Mon, Jun 19 2017 12:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాస్థాయి అండర్–7, సీనియర్ బాలికల జట్ల ఎంపికను ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జూలై 1, 2 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.
ఎంపికైన క్రీడాకారులు
సీనియర్ బాలికల విభాగం
సాయి సుష్మ, నిరుపమాబాయి
అండర్–7 బాలికలు
స్ఫూర్తిరెడ్డి
బాలురు
సంప్రీత్ దేశాయ్, వరుణ్ సాయి.
Advertisement
Advertisement