విశాఖపట్నం: కడప వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌లోని నాలుగవ తరగతిలో ప్రవేశాలకు బాలుర విభాగంలో 24 మంది, బాలికల విభాగంలో 15 మందిని జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. ఈనెల 27న జరగనున్న రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు వీరంతా హాజరుకానున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి ఎంపికైన వీరంతా ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈనెల 25న మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా క్రీడాభివద్ధి సంస్థ వద్ద హాజరుకావాలని డి.ఎస్.డి.ఓ. జూన్ గాల్యట్ కోరారు. ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్‌లతో పాటు 20 పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. బి.భాస్కరరావు, శ్యామ్, హేమంత్, పూర్ణసాయి, పూర్ణచందు, శేషు, పి.భాస్కరరావు, జి.రోహిత్, ఎం.రోహిత్, కాసువంత్, హేమ్‌చరణ్, హరీష్, అనిల్, చరణ్‌తేజ్, నాయుడు, తేజ, బి.రోహిత్, సాయికుమార్, ప్రవీణ్‌సాయి, పి.అనిల్‌కుమార్, ఆకాష్, పి.రాజేష్, ఎస్.గౌతమ్, కె.కిరణ్ బాలుర విభాగంలో ఎంపికయ్యారు. కె.దేవి, పి.రామలక్ష్మి, వసంత, దేవి, పూజిత, హేమవర్షిణి, శ్రావణి, కె.దేవి, సాయిలత, లావణ్య, దేవమణి, రమ్య, అనురాధ, దీపిక, రిచిత బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఎంపికైన వారిలో ఉన్నారు.
జిల్లా నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక
Published Sun, Jul 24 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement
Advertisement