హ్యాండ్‌బాల్ జిల్లా జట్టుకు ఎంపిక
Published Fri, Aug 5 2016 7:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
శ్రీరాంపూర్ : జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్ హ్యాండ్ బాల్ జిల్లా జట్టుకు నస్పూర్ మార్టిన్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 2న జరిగిన ఎంపికలో వీరికి చోటు దక్కింది.
పాఠశాల విద్యార్థులు ఏ.మనీషా, వి.లక్ష్మీప్రియ, సుప్రతిక ఎంపికయ్యారు. వీరు త్వరలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ పెంచాల వేణు తెలిపారు. ఈ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సబియాసుల్తానా, వైస్ ప్రిన్సిపల్ వసీం రాజా, సాధన స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు సాయి, వేణు, వంశీకష్ణ, బాలకష్ణ అభినందించారు.
Advertisement
Advertisement