7న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
Published Mon, Aug 1 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికల ఈనెల 7వ తేదీన పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ శంకర్ సోమవారం తెలిపారు. ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు 02–01–1997 తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జారి చేసిన జనన ధ్రువీకరణ పత్రము తీసుకొని రావాలని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌కు పంపటం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 93969 90666, 98497 03676 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement