23న హాకీ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
Published Mon, Nov 21 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
కర్నూలు(టౌన్): జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు స్థానిక ఎస్‌టీబీసీ కళశాల మైదానంలో హాకీ జూనియర్ బాలుర జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి డి. సుధీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 1998 తర్వాత జన్మించిన క్రీడాకారులే ఎంపికకు హాజరు కావాలన్నారు. 15 సంవత్సరాల వయస్సు దాటిన అభ్యర్థులు ప్రవేశ రుసుం రూ.10 చెల్లించి పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారన్నారు.
Advertisement
Advertisement