రాష్ర ్టస్థాయి బాస్కెట్‌బాల్‌కు కృత్తివెంటి విద్యార్థులు
Published Mon, Oct 24 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
రామచంద్రపురం :
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాల క్రీడాకారులు నలుగురు ఎంపికైనట్టు పాఠశాల పీడీ గెడా శ్రీనివాసు, పీఈటీ సయ్యిద్ మస్తానీ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అండర్ 14 బాలుర విభాగం పోటీల్లో పవ¯ŒSకుమార్ స్వర్ణపతకం సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడన్నారు. అదే విధంగా అండర్ 17 బాలుర విభాగంలో షేక్ సలీం, ఎ. ప్రవీణ్, అండర్ 17 బాలికల విభాగంలో పి. పాప, కౌసల్య జిల్లా జట్టుకు ఎ ంపికయ్యారన్నారు. చిత్తూరులో జరిగే రాష్ర ్టస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పాఠశాల హెచ్‌ఎం జి. రాంప్రసాద్, రీజినల్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేష¯ŒS అధికారి ప్రమీలాకుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సూర్యమోహన్, బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, రాష్ట్ర అసోసియేష¯ŒS కోశాధికారి గన్నమని చక్రవర్తి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Advertisement