state level
-
నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ!
విశాఖ స్పోర్ట్స్: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. 14,997 గ్రామాల నుంచి మెన్, వుమెన్ జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. 37.5 లక్షల మంది మెన్, వుమెన్ క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి. 12.21 లక్షల నగదు ప్రోత్సాహాకాల్ని సత్తా చాటిన జట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో విజేతలు నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోగా, తుది పోరులో రాష్ట్ర టైటిల్‌తో పాటు ప్రోత్సాహాకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మెన్ క్రికెట్ టైటిల్ పోరును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుక రైల్వే స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పోటీలను ప్రారంభించనుండగా, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ గురువారం స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించి పలు సూచనలు చేశారు. విజేతలకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు వైఎస్సార్ స్టేడియంలో 50 రోజుల క్రీడా పండగ ముగింపు కార్యక్రమాన్ని 13న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సత్తాచాటిన ఆటగాళ్లకు మరిన్ని మెలకువలు నేర్పేందుకు చెన్నయ్ సూపర్ కింగ్స్ పరిశీలకులతో పాటు ఆయా క్రీడల్లో నిష్ణాతుల్ని ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఆహ్వానించామన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతగా నిలిచిన జట్లు ఐదు లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకోనున్నాయి. రన్నరప్ జట్లు మూడు లక్షలు, సెకండ్ రన్నరప్ జట్లు రెండు లక్షలు అందుకోనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన జట్లు రెండు లక్షలు అందుకోనుండగా.. రన్నరప్ లక్ష, సెకండ్ రన్నరప్ జోడి యాభై వేలు అందుకోనుంది. ఏయే ఆటలు ఎక్కడంటే.. రాష్ట్ర స్థాయిలో పోటీపడేందుకు అన్ని జిల్లాల నుంచి 1,482 మంది పురుషులు, 1,482 మంది స్త్రీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో జట్లుగా ఆడేందుకు అర్హత సాధించాయి. వారికి స్థానికంగా ఉన్న టిడ్కో గృహాల్లో ఏర్పాట్లు పూర్తయాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని వుమెన్ క్రికెట్ పోటీలను వైఎస్సార్ బి గ్రౌండ్‌లోనే నిర్వహించనుండగా, మెన్ క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం గ్రౌండ్, ఏఎంసీ గ్రౌండ్, కొమ్మాది కేవీకే స్టేడియం గ్రౌండ్లలో నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో కోసం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్, వాలీబాల్ కోసం ఏయూ సిల్వర్ జూబ్లీ గ్రౌండ్లను సిద్ధం చేశారు. బ్యాడ్మింటన్ కోసం జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐదు కోర్టులను వినియోగించనున్నారు. -
ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో 22న మోదీ ప్రసంగం వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు. -
రాష్ట్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీలో కీలకమైన 23 అనుబంధ సంఘాలను చెవిరెడ్డి రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా సంఘాలను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయనున్నారు. గతంలో పార్టీ అప్పగించిన పెనుగొండ మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్, ఆత్మకూరు, బద్వేల్ ఎన్నికలు.. ఇలా ఎన్నింటినో ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. వీటితో పాటు పార్టీ ప్లీనరీ నుంచి ఇటీవల వైజాగ్‌లో ప్రధాని మోదీ పర్యటన వరకు ఆయా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రస్థాయిలో వైఎస్సార్సీపీ అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రతిష్ట పెంచేందుకు సైనికుడిలా పని చేస్తానన్నారు. చదవండి: (20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి) -
బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్ కమిటీ జాతీయ ఇన్చార్జి పి. మురళీధర్‌రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. మొత్తం 14 సెషన్స్.. పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్ సాధించిన విజయాలపై కిషన్‌రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్‌రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. బీఎల్ సంతోష్ హాజరవుతారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సంతోష్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
‘ము పట్టొ పొడిబి’.. దీనికి అర్థం ఏంటో తెలుసా?
బరంపురం(భువనేశ్వర్): నగరంలోని హిల్‌పట్నా మెయిన్‌రోడ్డులో ఉన్న బిజూ పట్నాయక్ సాంస్కృతిక భవనంలో ఒడిశా నాటక సమారోహ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిశు నాటక మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా గంజాం జిల్లా బంజనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు చేపట్టిన ‘ము పట్టొ పొడిబి’(నేను చదువుకుంటాను) అనే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో.. రాఖీ ఘెష్‌కు ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం భువనేశ్వర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం–2021..ది పయనీర్ ఇంగ్లిష్ జర్నలిస్ట్ రాఖీ ఘోష్‌ని వరించింది. వర్చువల్ మాధ్యమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. సుందరగఢ్ ప్రాంతంలో కోవిడ్ మృతుల దహన సంస్కారాలను స్వచ్చంధంగా నిర్వహిస్తున్న యుజవన సాంఘిక సేవా సంస్థలపై పత్రికలో రాసిన కథనానికి గాను ఆమెకి ఈ అవార్డుల లభించినట్లు తెలుస్తోంది. చదవండి: భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి -
టీఆర్ఎస్ కేడర్ కట్టడికి కమిటీ.. రంగంలోకి మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఏకాకిని చేయడం లక్ష్యంగా సాగుతున్న పరిణామాల్లో మరింత వేడి పెరిగింది. ఇప్పటికే ఈటల అనుకూల, ప్రతికూల వర్గాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కేడర్ చీలిపోయింది. ప్రతికూల వర్గం నేతలు తాము పార్టీ వెంటే ఉంటామని ప్రకటనలు చేస్తుండగా, అనుకూల నేతలు ఈటల రాజేందర్ వెంట నడుస్తామని తేల్చి చెబుతున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో మకాం వేయాలని ఈటల నిర్ణయించారు. దీంతో రాజకీయ విమర్శలు ఊపందుకోవడంతో పాటు, అనుకూల ప్రతికూల వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పార్టీ కేడర్‌పై పట్టు సాధించేందుకు అటు టీఆర్ఎస్, ఇటు ఈటల పావులు కదుపుతుండటంతో హుజూరాబాద్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేడర్‌పై పట్టు కోసం కమిటీ ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి టీఆర్ఎస్ కేడర్‌పై పట్టు బిగిస్తున్నారు. దీంతో ఈటల, గంగుల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి ఈటల రాజీనామా చేసినా కేడర్ చెక్కు చెదరకుండా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, కరీంనగర్ జిల్లా స్థాయిలో గంగుల కమలాకర్.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయనున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి కేడర్‌తో మంతనాలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్‌లో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇన్‌చార్జీలుగా పనిచేస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్ రవీందర్‌రావుకు కమలాపూర్ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్‌తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు పార్టీ వెంట నడిచేలా వీరు చూడాల్సి ఉంటుంది. గంగుల, ఈటల నడుమ మాటల యుద్ధం ఇటీవలి వరకు మంత్రివర్గంలో సహచరులుగా ఉన్న గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఈటల హైదరాబాద్‌లో ఓసీ.. హుజూరాబాద్‌లో బీసీ అని విమర్శిస్తూ.. ఆయన భూ కబ్జాలు చేశారంటూ గంగుల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలపై గంగులను ఉద్దేశించి ఈటల మంగళవారం విమర్శలు గుప్పించారు. మరోవైపు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
బాస్కెట్‌బాల్ బాలికల విజేత గుంటూరు
బాలుర విభాగంలో తూర్పు గోదావరి విజయం మూడో స్థానమూ దక్కించుకోలేకపోయిన ఆతిథ్య జట్లు అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి మూడవ జూనియర్స్ బాలికల బాస్కెట్‌బాల్ విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. అనంతపురం ఇండోర్ స్టేడియంలో సోమవారం గుంటూరు, తూర్పు గోదావరి జట్లు ఫైనల్స్ ఆడాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రెండవ సెషన్లో గుంటూరు జట్టు దూకుడుగా ఆడి విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు స్కోరు 52 కాగా, తూర్పుగోదావరి జట్టు 38. గుంటూరు జట్టులో ఉమ 24, ఎస్తేరు 15 బాస్కెట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మూడవ స్థానం కోసం అనంతపురం, కృష్ణ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆతిథ్య జట్టు గెలుస్తుందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు భావించినప్పటికీ, చివర్లో కృష్ణ జట్టు క్రీడాకారులు దూకుడు ప్రదర్శించి 4 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. అనంత జట్టు స్కోరు 32కాగా, కృష్ణ జట్టు 36 పాయింట్లు సాధించింది. సెమీస్‌లో అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా గుంటూరు జట్టు అనంతను ఓడించి ఫైనల్ చేరింది. మరో సెమీస్‌లో కృష్ణ, తూర్పుగోదావరి జట్లు తలపడగా కృష్ణ జట్టును ఓడించి తూర్పుగోదావరి జట్టు ఫైనల్‌కు చేరింది. - బాలుర విజేతగా తూర్పుగోదావరి జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి, విశాఖపట్టణం జట్లు తలపడ్డాయి. తూర్పుగోదావరి జట్టు 48 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. జట్టులో అహమ్మద్ 20 బాస్కెట్లు వేసి విజయంలో కీలకంగా మారాడు. విశాఖపట్టణం జట్టు 34 పాయింట్లతో రెండవ స్థానాన్ని నిలుపుకొంది. మూడవ స్థానం కోసం అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా అనంత జట్టు గుంటూరు చేతిలో ఓటమిని చవిచూసింది. ముందుగా సెమీస్‌లో అనంతపురం, విశాఖపట్టణం జట్లు తలపడగా విశాఖ జట్టు అనంతను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీస్‌లో తూర్పుగోదావరి, గుంటూరు జట్లు తలపడగా తూర్పుగోదావరి జట్టు గుంటూరును ఓడించి ఫైనల్‌కు చేరింది. క్రీడలతో ఆరోగ్యం : డీఎస్పీ క్రీడలతో ఆరోగ్యం బాగుంటుందని డీఎస్పీ మల్లికార్జున వర్మ అన్నారు. సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన, లేడీస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అరుంధతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని వర్గాలవారు ఏదో క్రీడలో ప్రాతినిథ్యం వహించడం చాలా అవసరమన్నారు. మంచి క్రీడాకారులంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు శ్రీకాంత్‌రెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నరేంద్ర చౌదరి, కోచ్‌లు జగన్నాథరెడ్డి, వెంకటేష్, నరేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చీరాలలో రాష్ట్రాస్థాయి ఎడ్ల పోటీలు
-
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కొవ్వూరు : పట్టణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను జిల్లా అదనపు సెషన్స్ జడ్జి వైవీఎస్జీబీ పార్ధసారథి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ అసోసియోషన్ పదేళ్లుగా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో జాతీయస్థాయి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులు ఇటువంటి టోర్నమెంటులను సద్వినియోగ పరచుకుని జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా రాష్ట్రస్థాయి పోటీలతో పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. తమ అసోసియోషన్ వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొవ్వూరులో క్రీడలను ప్రోత్సహించే ఔత్సహికులుండడం అభినందనీయం అన్నారు. శాశ్వత క్రీడా సదుపాయాలు ఏడాదిలో సమకూరే అవకాశం ఉందన్నారు. కొవ్వూరులో స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వచ్చే ఏడాదికి గ్రౌండ్ సమస్య తీరుతుందన్నారు. అసోసియోషన్ కార్యదర్శి సూరపనేని చిన్ని, వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, బ్యాడ్మింటన్ అసోసియోషన్ కార్యదర్శి పొట్రు మురళీకృష్ణ, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, నాయకులు సూర్యదేవర రంజిత్, బొబ్బా సుబ్బారావు మాట్లాడారు. అనంతరం అతిథులు సర్వీసు చేసి పోటీలను ప్రారంభించారు. ప్రకాశం, కృష్ణ జిల్లా జట్లు తొలిమ్యాచ్‌లో తలపడ్డాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు జాతీయ చీఫ్ రిఫరీ డి.నేతాజీ తెలిపారు. నేషనల్ రిఫరీలు బి.శ్రీనివాసరావు, పి.సుబ్బారెడ్డి, రాష్ట్రస్థాయి రిఫరీలు ఆర్.సురేష్, ఎస్కే మస్తాన్ వలీ, కె.రామ్‌కుమార్ ఎంఫైర్లుగా వ్యవహరిస్తున్నారు. నాయకులు పరిమి రామకృష్ణ, పరిమి రాజేష్, పోలవరం ప్రాజెక్టు డీఈఈ ఎన్ పీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
ధర్మవరం టౌన్ : పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి డైమండ్ జూబ్లీ ఓపెన్ విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ హాకీ చాంపియన్‌షిప్ టోర్నీ శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగింది. టోర్నీ ప్రారంభంలో పుంగనూరు సీఐ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లలో తొలుత ఆర్డీటీ అనంతపురం జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా నెల్లూరు జట్టు 4–3 తేడాతో విజయం సాధించింది. అనంతరం ధర్మవరం జట్టు విజయవాడ జట్టుతో తలపడగా ధర్మవరం జట్టు 4–1 తేడాతో గెలుపొందింది. చంద్రగిరి జట్టు వైజాగ్‌తో తలపడగా వైజాగ్ జట్టు 4–2తేడాతో జయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ జట్టు యలమంచిలి జట్టుతో తలపడగా వైఎస్సార్ జట్టు 3–0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే అనంతపురం ఆర్డీటీ జట్టు నెల్లూరు జట్టుతో తలపడగా 1–1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో శనివారం జరగనున్న సూపర్‌లీగ్ మ్యాచ్‌లకు ధర్మవరం, వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్, నెల్లూరు, వైజాగ్ జట్లు అర్హత సాధించాయి. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు పల్లెం వేణుగోపాల్, బందనాథం సూర్యప్రకాష్, వడ్డే బాలాజీ, అశ్వర్థనారాయణ, సీనియర్ క్రీడాకారులు జెన్నే చందు, అమ్ను, మారుతీ, కోచ్ హస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్ విద్యార్థులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో శంకరాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఆ కాలేజీ డైరెక్టర్ డాక్టర హరికిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం కళాశాలలో అభినందించి మాట్లాడారు. క్విజ్ పోటీలలో వెంకటరమణ, రూపేష్ , సోలోసాంగ్ పోటీలలో శ్రావణి విజేతలుగా నిలిచారన్నారు. వీరు ఈ నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ మద్దిలేటి, అధ్యాపకులు సోమశేఖర్, రఘునందన్, పాల్గొన్నారు. -
2 నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
ధర్మవరం టౌన్ : ధర్మవరంలోని ధర్మాంబ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ డైమండ్ ఓపెన్ హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాంబ హాకీ అసోసియేషన్ ప్రతినిధులు పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, బంధనాథం సూర్యప్రకాష్, వడ్డె బాలాజీ, ఉడుముల రాము, అశ్వర్థనారాయణ, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో 12 జట్లు పాల్గొంటాయన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు చొప్పున బహుమతులు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో హాకీ కోచ్ హుసేన్, సీనియర్ క్రీడాకారులు ఉడుముల కిరణ్, జిన్నే చంద్ర, మధు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు
అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేత అండర్–14,17 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్లు విజేతలు అండర్ 14 బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు విజేత అండర్ 17 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జట్టువిజేత గుంటూరు స్పోర్ట్స్ : 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు ముగిశాయి. అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పు గోదావరి జట్టు విజేతగా నిలువగా, అనంతపురం జట్టు ద్వితీయ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్టు విజేత నిలువగా, బాలికల విభాగంలో శ్రీకాకుళం విజేతగా నిలిచింది. అండర్–17 బాలుర విభాగంలో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలువగా, బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామకృష్ణ, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి కరీముల్లారావు, అధ్యక్షుడు కాంతరావు, అబ్జర్వరర్ విజయ్, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి గణేష్, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్
- భీమవరంలో శరీర సౌష్టవ పోటీలు - నాల్గు విభాగాల్లో నంద్యాల వాసుల ప్రతిభ కర్నూలు (టౌన్) : రాష్ట్రస్థాయి బహిరంగ శరీర సౌష్టవ పోటీల్లో నంద్యాలకు చెందిన సుధీర్ (బంగారు పతకం ) ఏపీ చాంపియన్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ బాడి బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వతేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ సోమవారం విలేకరులకు తెలిపారు. 65 కేజీల విభాగంలో సుధీర్ చాంపియన్‌గా నిలిచాడన్నారు. అలాగే నంద్యాలకే చెందిన సురేష్, ఫయాజ్, కరీముల్లా వరుసగా 75 కేజీలు, 85 కేజీలు, 90 కేజీల విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ విజేత కర్నూలు
– బాలికల విభాగంలో నెల్లూరు జయకేతనం కర్నూలు (టౌన్): రాష్ట్ర స్థాయి అండర్ –17 హ్యాండ్‌బాల్ బాలుర పోటీల్లో కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. నగరంలోని స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. 10–17 గోల్స్‌తో కర్నూలు విజేతగా నిలిచింది. రెండో స్థానం ప్రకాశం జిల్లా, మూడో స్థానం పశ్చిమ గోదావరి జిల్లా కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జట్టు ఫైనల్స్‌లో తలపడ్డాయి. 4–3 గోల్స్‌తో నెల్లూరు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో ప్రకాశం, మూడో స్థానంలో కడప నిలిచింది. ముఖ్య అతి«థిగా హాజరైన ఆర్సి రెడ్డి కళశాల కరస్పాండెంట్ విజేతలకు ట్రోఫీలు , మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎన్నికైన క్రీడాకారులు బెంగళూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుందరమ్మ , జిల్లా స్కూల్‌గేమ్స్ ఇన్చార్జి లక్ష్మీనరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, ఎస్జీఎఫ్ రాష్ట్ర అబ్జ్ర్వర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
భానుగుడి (కాకినాడ) : పెద్దిరెడ్డి గంగాధరం మెమోరియల్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంగీతంలో కాకినాడకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి గంగాధరం మాస్టారని, ఆయన స్మృతిగా కాకినాడలో ఈ ఈత పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సెకండ్ వింటర్ అక్వాటిక్ ఛాంపియ¯ŒSషిప్ పోటీలకు 13 జిల్లాల నుంచి 340 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టయిల్, మెడ్లే, ఇండివిడ్యువల్ మెడ్లే, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో జరిగిన పోటీల్లో వారు పాల్గొన్నారు. డీఎస్డీఓ పి.మురళీధర్, స్టేట్ స్విమ్మింగ్ అసోషియేష¯ŒS అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు విజేతలు వీరే.. 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో రెండు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మొదటి కేటగిరీలో బాలుర నుంచి పీవీజీ శ్రీరామ్, బాలికల విభాగంలో మితాక్షి (విశాఖ) బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే, 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ రెండో కేటగిరీలో లో పి.సుజ¯ŒS చౌదరి (కృష్ణా), బాలికల విభాగంలో నిఠాష (విశాఖ) బంగారు పతకాలు సాధించారు. 200 మీటర్ల ఇండివిడ్యువల్ మిడ్లేలో బి.వెంకటయ్య (కడప), బాలికల విభాగంలో నవ్యశ్రీ మాధురి (చిత్తూరు); 200 మీటర్ల ఇండివిడ్యువల్ మిడ్లే జీపీ–4 బాలుర విభాగంలో ఎం.శరత్ (కృష్ణా), బాలికల విభాగంలో ఎం.నిహారిక (విశాఖ); 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (కృష్ణా), పి.దేవీప్రియ (తూర్పు గోదావరి); 50 మీటర్ల ఫ్రీ స్టయిల్లో సృజ¯ŒS (తూర్పు గోదావరి), పవ¯ŒS సరయు (కృష్ణా) బంగారు పతకాలు సాధించారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు సహితం పతకాలు అందించారు. ఈ పోటీల ముగింపు ఆదివారం జరగనుంది. -
సెమీస్‌కు కర్నూలు
హోరాహోరీగా రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు కర్నూలు (టౌన్): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. కర్నూలులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో 62వ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలబాలికల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం క్వార్టర్స్ ఫైనల్లో కర్నూలు బాలుర జట్టు విశాఖపట్నం జట్టుపై 22–06 తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే బాలికల మ్యాచ్‌లో కర్నూలు బాలికలపై నెల్లూరు బాలికలు 10–05 తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మరో క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో కడప జిల్లాపై వెస్టుగోదావరి 13–19 పాయింట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. మరో బాలికల మ్యాచ్‌లో అనంతపురం జిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్టుపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ ఇంచార్జి చెన్నారెడ్డి ఈ మ్యాచ్‌లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్ సమాఖ్య ఇంచార్జి కార్యదర్శి నరసయ్య, పీఈటీల సంఘం అధ్యక్షులు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్‌హుసేన్, క్రీడల నిర్వహణ కార్యదర్శి డీవీ సుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్షీర సమరం ప్రారంభం
మండపేటలో మొదలైన రాష్ట్ర స్థాయి పాల, ప్రదర్శన పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పాడిపశువులు మండపేట : మండపేటలో క్షీర సమరం మొదలైంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పాడి పశువులతో మారేడుబాక రోడ్డులో పోటీల ఆవరణలో సందడి నెలకొంది. మూడురోజుల పాటు జరుగనున్న రాష్ట్రస్థాయి పాల, ప్రదర్శన పోటీలను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఐదు విభాగాల్లో జరిగే ఆయా పోటీల్లో పాల్గోనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పాడిరైతులు తమ పశువులను తీసుకువచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పాలపోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఒంగోలు, పుంగనూరు తదితర జాతుల సంరక్షణకు, పాడిరైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రూ.లక్షల వ్యయంతో పాలపోటీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు మాట్లాడుతూ మేలుజాతి పశుపోషణలో మండపేట ప్రాంత రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. పోటీల్లో 211 పశువులు పాల దిగుబడి, పశు ప్రదర్శనకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొంనేందుకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల నుంచి 211 పశువులు పోటీల్లో పాల్గొంటున్నాయి. పాలపోటీలకు సంబంధించి గేదెలకు సంబంధించి ముర్రా విభాగంలో 17, జాఫర్‌బాదిలో నాలుగు, ఆవులకు సంబంధించి ఒంగోలు విభాగంలో 17, గిర్‌లో ఆరు, పుంగనూరులో ఒక ఆవు పోటీలో నిలిచాయి. పశు ప్రదర్శన పోటీలకు సంబంధించి పోతుల విభాగంలో ముర్రా దున్నలు నాలుగు, ఒంగోలు గిత్తలు 22, గిర్ ఐదు, పుంగనూరు తొమ్మిది, పెయ్యిల విభాగంలో ముర్రా గేదెలు 25, ఒంగోలు ఆవులు 63, గిర్ 11, పుంగనూరు 25 ఆవులు పాల్గొంటున్నాయి. వీటిని తిలకించేందుకు మండపేట, పరిసర గ్రామాల నుంచి పాడిరైతులు, పశుపోషకులు, ఔత్సాహికులు తరలివస్తున్నారు. ఆయా పశువుల ప్రత్యేకతల గురించి సంబంధిత రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. తమ ఉత్పత్తుల గురించి రైతులకు వివరించేందుకు మందుల తయారీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పోటీల పర్యవేక్షణ కోసం 12 మంది ఏడీఏ స్థాయి అధికారులు, 50 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, దాదాపు 80 మంది గోపాల మిత్రలను నియమించినట్టు అధికారులు తెలిపారు. విజేత నిర్ణయం ఇలా.. l పాల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తీసిన పాలను నమూనాగా భావిస్తారు. శుక్రవారం రెండు పూటలు, శనివారం ఉదయం తీసిన పాలను లెక్కించి విజేతలను నిర్ణయిస్తారు. అదే రోజు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తారు. l శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు పడాల సుబ్బారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కా ర్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), డీసీఎంఎస్ మాజీ చైర్మ¯ŒS రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, మండపేట పీఏసీఎస్ అధ్యక్షుడు మల్లిపూడి గణేశ్వరరావు, ఆలమూరు తాలుకా రైస్‌మిల్లర్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్‌వీవీ సత్యనారాయణమూర్తి, జేడీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఏడీఏలు విజయకుమారశర్మ, ఎం.రామకోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మురళీ, ఉమామహేశ్వరరెడ్డి, కేంద్రీయ పశునమోదు పథకం జిల్లా స్టాక్మె¯ŒS పూర్ణచంద్రరావు, రైతులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణలు పోటీల సందర్భంగా కృష్ణాజిల్లాలోని వీరవల్ల నుంచి తీసుకువచ్చిన ఏడేళ్ల ముర్రా దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రూ.12 లక్షలు వెచ్చించి హర్యానాలో ఈ దున్నను కొనుగోలు చేసినట్టు రైతు చిలకపాటి రాజీవ్ తెలిపారు. తన వద్ద ఈ తరహా దున్నలు 15 వరకు ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా నాదేండ్లకు చెందిన నల్లమోతు వేణుగోపాలరావుకు చెందిన ఒంగోలు గిత్తలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన పాడిరైతు రిమ్మలపూడి గంగరాజు గిర్ ఆవులు, పలువురు పాడిరైతులకు చెందిన ముర్రా గేదెలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. -
ముగిసిన గురుకుల క్రీడా పోటీలు
బుట్టాయగూడెం : మ ండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గురుకుల బాలబాలికల క్రీడా పోటీలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 6 వందల మంది బాలబాలికలు పాల్గొన్నారు. జోన్ –1, జోన్ –2, జోన్ –3, జోన్ –4 విభాగాల్లో నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్, పోటీలు వివిధ జట్టుల మధ్య హోరాహోరీగా సాగాయి. వీటిలో గెలుపొందిన వారి వివరాలను క్రీడా నిర్వహణ అ«ధికారులు వివరించారు. విజేతల వివరాలు బాలికల 100, 200 మీటర్ల పరుగు పందెంలో బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి పాఠశాల విద్యార్థిని టి.సుమలత, 400 మీటర్ల పరుగుపందెంలో నెల్లూరు జిల్లాకు చెందిన వై.పూజిత, షాట్ పుట్లో ఆర్.నాగేశ్వరి, జావెలిన్ త్రోలో ఎ.శ్రావణి(విజయనగరం), డిస్కస్ త్రోలో ఎస్.శ్రీజ(కూనవరం)విజేతలుగా నిలిచారు. 400 మీటర్ల రిలే పరుగుపందెంలో బూసరాజుపల్లి, కొడవలూరు, రంపచోడవరం పాఠశాల విద్యార్థులు నెగ్గారు. కబడ్డీలో విసన్నపేట గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. వాలీబాల్‌లో విజయనగరం జిల్లా భద్రగిరికి చెందిన విద్యార్థులు గెలుపొందినట్టు తెలిపారు. షటిల్ డబుల్స్‌లో రంపచోడవరం విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారన్నారు. పాఠశాల బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్ సగా బూసరాజుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థిని టి.సుమలత, కొలవలూరుకు చెందిన వై.పూజిత విజేతగా నిలిచారు. బాలుర వి«భాగం 100 మీటర్ల పరుగుపందెంలో భ్ర««దlగిరికి చెందిన కామేశ్వరరావు, 200 వందల మీటర్ల పరుగుపందెంలో కొయ్యూరుకు చెందిన భీమరాజు, 400 మీటర్ల పరుగుపందెంలో నెల్లూరు జిల్లా చిట్టేడుకు చెందిన బి.వినోద్, షాట్‌పుట్ ఎస్.భీమరాజు, డిస్క్ త్రో వై.రాజశేఖరరెడ్డి, జావ్లెన్ త్రో గురునాయక్ శ్రీశైలం విజయం సాధించారు. కబడ్డీలో వైజాగ్ జిల్లా అరకుకు చెందిన విద్యార్థులు, వాలీబాల్‌లో జీలుగుమిల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు, షటిల్లో రంపచోడవరం విద్యార్థులు, వ్యక్తిగత విభాగంలో కొయ్యూరుకు చెందిన ఎస్.భీమరాజు విజేతలుగా నిలిచారు. కళాశాల బాలికల విభాగంలో 100, 200 మీటర్ల పరుగుపందెంలో కూనవరంకు చెందిన ఎస్.పుష్పలత, 400 మీటర్లలో కూనవరంకు చెందిన ఆర్.మంజుల, షాట్‌పుట్ రంపచోడవరానికి చెందిన జె.రమణ, డిస్కస్ త్రోలో వై.రామవరానికి చెందిన ఎ.పుష్ప, జావెలిన్ త్రోలో వైజాగ్ జిల్లా భధ్రగిరికి చెందిన వై.శ్రావణి ప్రథమస్థానంలో నిలిచినట్టు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్‌లో బూసరాజుపల్లి, బూసరాజుపల్లి, బాలుర విభాగంలో వాలీబాల్ కేఆర్‌పురం విద్యార్థులు గెలిచినట్టు ప్రకటించారు. విద్యార్థులకు ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్, గురుకుల జాయింట్ డైరెక్టర్ దేవరవాసు, కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లికార్జునరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ప్రారంభ మ్యాచ్‌గా ఆంధ్ర, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు తుని రూరల్ : వైఆర్కే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఇన్విటేష¯ŒS కబడ్డీ పోటీలను టి.తిమ్మాపురంలో జిల్లా పరిషత్ చైర్మ¯ŒS నామన రాంబాబు ప్రారంభించారు. ఆదివారం రాత్రి అసోసియేష¯ŒS అధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS యనమల కృష్ణుడు, ఏపీ కబడ్డీ అసోసియేష¯ŒS కార్యదర్శి వి.వీరలంకయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర మహిళా జట్టు, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు మధ్య ఎగ్జిబిష¯ŒS మ్యాచ్‌తో పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల జట్లు పాల్గొంటున్నట్టు జిల్లా అసోసియేష¯ŒS అధ్యక్షుడు టీవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
రాష్ట్ర వ్యాప్తంగా 212 పట్టణ ఆరోగ్య కేంద్రాలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని కిమ్స్‌లో ఐఎంఏ ఏపీ కా¯Œ –2016 ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వెయ్యి మంది వైద్యులు అమలాపురం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 212 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో శనివారం ప్రారంభమైన ఐఎంఏ ఏపీ కాన్–2016 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో ఒక డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తామన్నారు. తమిళనాడు విధానంలోలా మూడేళ్లకు ప్రభుత్వ వైద్యుడిని రెగ్యులర్ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడం వల్ల 28 శాతం ఓపీ అదనంగా పెరిగిందన్నారు. త్వరలో చిన్న పిల్లలకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అధునాతన ప్రక్రియలపై విస్తృత చర్చ ప్రస్తుత వైద్య రంగంలో ఎదురవుతున్న ఒడిదుడుకులు, అధునాతన సాంకేతిక వైద్య ప్రక్రియలపై సదస్సు విస్తృతంగా చర్చించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇండియ¯ŒS మెడికల్ అసోసియేష¯ŒS (ఐఎంఏ) నవ్యాంధ్ర ప్రదేశ్ శాఖగా విడిపోయి తొలిసారిగా రాష్ట్రస్థాయి సదస్సును అమలాపురం కిమ్స్ వైద్యకళాశాల వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది వైద్యులు హాజరయ్యారు. సదస్సులో తొలుత ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కోనసీమ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంధం రామం అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, ఐఎంఏ నూతన అధ్యక్షుడు కె.గంగాధరరావు, కార్యదర్శి ఎం.ఎ.రెహమాన్, మాజీ అధ్యక్షుడు జి.ఎస్.మూర్తి, డాక్టర్ సమరం, కోనసీమ కార్యదర్శి డాక్టర్ పి.సురేష్‌బాబు, మాజీ అధ్యక్షుడు అరిగెల వెంకటేశ్వరరావు, కోశాధికారి డాక్టర్ కె.రమేష్, డీ¯ŒS ఎ.కామేశ్వరరావు, ఏవో కె.రఘు, వైద్యులు రామచంద్రరావు, బి.వరహాలు, రాఘవేంద్రరావు, కొమ్ముల ధన్వంతరినాయుడు, గొలకోటి రంగారావు, ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తిలు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య సదస్సులు వివిధ జిల్లాల నుంచి వైద్యులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, వైద్య విధానంలో నూతన మార్పులపై సదస్సులో అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో వైద్యవిధానంపై కిమ్స్ డీ¯ŒS ఎ.కామేశ్వరరావు వివరించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే ఎలా నయం చేయవచ్చో వివరించారు. విశాఖకు చెందిన వైద్యుడు వి.మురళీకృష్ణతోపాటు పలువురు వివిధ అంశాలపై పేపర్ ప్రెజంటేష¯ŒS ద్వారా అవగాహన కల్పించారు. ఆకట్టుకున్న పోర్ట్రెయిట్స్ ఐఎంఏ సదస్సులో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వైద్యవిధానంలో కొత్తగా వచ్చిన పరికరాలు, మందులు, ఉత్పత్తులను వీటిలో ప్రదర్శించారు. అపోలో ల్యాబ్స్ ఏర్పాటు చేసిన స్టాళ్లలో వైద్యులు పోట్రెయిట్స్ గీయించుకునేందుకు ఉత్సాహం చూపించారు. విజయనగరానికి చెందిన ఆర్టిస్ట్ క్రాంతి ఐదు నిమషాల్లో వైద్యులు బొమ్మలు వేసి ఆకట్టుకున్నారు. -
ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం
నంద్యాల: స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏపీ మహిళా హాకీ టోర్నీ శుక్రవారంప్రారంభమైంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఏపీ హాకీ అసోసియేషన్ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి పాల్గొని టోర్నీని ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమా క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమని, ఓడిన వారు మళ్లీ గెలవడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని విజయనగరం మినహా మిగతా జిల్లాల నుంచి 250మంది క్రీడాకారులు, 50మంది కోచ్‌లు, మేనేజర్లు టోర్నీకి హాజరయ్యారు. తొలిరోజు పశ్చిమగోదావరి జిల్లాపై నెల్లూరు 5–0స్కోరుతో ప్రకాశంపై గుంటూరు 4–0 స్కోరుతో విజయం సాధించగా కృష్ణ–చిత్తూరు జిల్లాల మ్యాచ్ టైగా ముగిసింది. ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. కార్యక్రమంలో కర్నూలు హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు చాణిక్యరాజు, కార్యదర్శి సుధీర్, కర్నూలు విండోస్ స్కూల్ మేనేజర్ అగస్టీన్ పాల్గొన్నారు. -
చెస్ టోర్నీ విజేత సుభాని
ధర్మవరం టౌన్ : స్థానిక ఉషోదయ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో వైఎస్సార్ జిల్లా వాసి అస్రాఫ్ సుభాని విజేతగా నిలిచాడు. శశిధర్ కార్తీక్ (వైజాగ్), ప్రసాద్ (ప్రకాశం) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కింగ్ చెస్ అకాడమి ఆధ్వర్యంలో యువర్స్ ఫౌండేష¯న్ సహకారంతో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 162 మంది పాల్గొన్నారు. వారిలో ఉత్తమ పాయింట్లు సాధించిన 25 మందిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉషోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాధవరావు, యువర్స్ పౌండేషన్ సభ్యులు చాంధ్‌బాషా, పోలా ప్రభాకర్ హాజరయ్యారు. సుభాని, కార్తీక్, ప్రసాద్‌లతోపాటు మరో 23 మందికి డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్బీఐ మేనేజర్ మాధవరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం క్రీడతో మానవుని మేధస్సును పెంచుకునే వీలుందన్నారు. ఈ క్రీడను అభివృద్ధి చేయడంలో ధర్మవరం వాసులు మంచి కృషి చేస్తున్నారని అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతియేటా నవంబర్ నెలలో రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్ చెస్ అకాడమి నిర్వాహకుడు జాకీర్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ బీవీ ప్రకాష్, సీనియర్ చెస్ క్రీడాకారుడు అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పిఠాపురం విద్యార్ధికి బంగారు పతకం
పిఠాపురం విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం పిఠాపురం టౌ¯ŒS : పిఠాపురం విద్యార్థి సాల రవికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకం లభించింది. ఈనెల 5, 6, 7 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో జరిగిన అండర్–18 అథ్లెటిక్ పోటీల్లో పోల్‌వాల్ట్ విభాగంలో రవి ప్రథమస్థానం పొంది బంగారు పతకం సాధించాడు. పదో తరగతి వరకు బ్లూస్టార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చదివిన రవి ప్రస్తుతం సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. బ్లూస్టార్ స్కూల్ పీఈటీ ఎలిపే సునీల్‌దేశాయ్ కోచ్‌గా వ్యవహరిస్తూ రవికి శిక్షణ ఇచ్చారు. గతంలో రెండు కాంస్యపతకాలు సాధించిన రవికి బంగారు పతకం వరించడంతో పలువురి మన్ననలు పొందుతున్నాడు. జిల్లా అథ్లెటిక్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు కె.పద్మనాభం, కార్యదర్శి సీహెచ్‌వీ రమణ, కోశాధికారి టీవీఎస్ రంగారావు, జిల్లా సెలక్ష¯ŒS కమిటీ అధ్యక్షుడు వై.తాతబ్బాయి, అథ్లెటిక్ కోచ్ కె.కొండలరావు, స్కూల్ కరస్పాండెంటు వి.పద్మకృష్ణఫణి, మేనేజర్ వీజీకే గోఖలే, వీఎస్ఎల్ ఝాన్సీ ప్రత్యేకంగా అభినందించారు. -
రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: 62వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు షేక్ ఫరాజ్, మహితారెడ్డి, శ్రేష్టా, అపురూప్, ఆకాష్, హేమ సింధూర ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని శనివారం స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఈసీ సభ్యుడు కోటిలింగా రెడ్డి, టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులలో సోమవారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లాజట్ల ఎంపిక
రాజోలు : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తిసాము) పోటీలకు అండర్–19 క్రీడాకారుల ఎంపిక సోమవారం ముగిసింది. రాజోలులోని యూత్‌క్లబ్ ఆవరణలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీలను సీనియర్ న్యాయవా ది కె.పి.ఆర్.నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, సభ్యులు పుట్టా రామకృష్ణ, సిహెచ్.జి.వి.ఎస్.ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు మంగళ, బుధవారాల్లో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థా యి పోటీల్లో పాల్గొంటారు. బాలికల విభాగంలో అడబాల రాఘవి, కొ క్కిరగడ్డ చాందిని శ్రీ పూర్ణిమ, సయ్యద్ నజ్రీన్, కోన రేనా ఏవాంజిల్, యడ్ల సోనీలయ, తాడి మనోజ్ఞ, కొడవటి రుక్మిణి సాయి దుర్గ, కొక్కిరగడ్డ శరణ్య ఎంపిక కాగా, బాలుర విభాగంలో కోట హేమంత్, మంద అవినాష్, కె.స్వామియోగేంద్ర, మామిడిశెట్టి బాల వెంకట లక్ష్మినరసింహసాయి, వి.మసే¯ŒSరాజు, కొడవటి రాజగోపాల్‌నాయుడు, గురుజుల గణేష్, కోన సామ్యూల్‌రాజు, చెల్లింగి రవీంద్ర ఎంపికయ్యారు. పీఈటీలు కె.నాగరాజు, బళ్ల శ్రీను, ఎం.శ్రీధర్, పి.రామకృష్ణ పర్యవేక్షించారు. -
వాలీబాల్‌లో ‘పశ్చిమ’ సత్తా
దేవరపల్లి: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి తృతీయస్థానం సాధించారు. 62వ స్కూల్ గేమ్స్ అండర్–17 విభాగం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొని ప్రతిభ చూపింది. క్రీడాకారులను హెచ్ఎం పి.కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఫుట్‌బాల్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
గొల్లప్రోలు : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మాధురి విద్యాలయకు చెందిన విద్యార్థి కొశిరెడ్డి గణేశ్వరరావు ప్రతిభ కనబరిచాడు. ఇటీవల నరసరావుపేటలో అండర్ 14 విభాగంలో జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొన్నాడు. ఆటలో ప్రతిభ కనబరచినందుకు ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు మెమెంటో, సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థినిని మాధురి విద్యాలయ కరస్పాండెంట్ కడారి తమ్మయ్యనాయుడు, ప్రిన్సిపాల్ ఎంఎం లూకోస్ అభినందించారు. -
రాష్ర ్టస్థాయి బాస్కెట్‌బాల్‌కు కృత్తివెంటి విద్యార్థులు
రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాల క్రీడాకారులు నలుగురు ఎంపికైనట్టు పాఠశాల పీడీ గెడా శ్రీనివాసు, పీఈటీ సయ్యిద్ మస్తానీ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అండర్ 14 బాలుర విభాగం పోటీల్లో పవ¯ŒSకుమార్ స్వర్ణపతకం సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడన్నారు. అదే విధంగా అండర్ 17 బాలుర విభాగంలో షేక్ సలీం, ఎ. ప్రవీణ్, అండర్ 17 బాలికల విభాగంలో పి. పాప, కౌసల్య జిల్లా జట్టుకు ఎ ంపికయ్యారన్నారు. చిత్తూరులో జరిగే రాష్ర ్టస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పాఠశాల హెచ్ఎం జి. రాంప్రసాద్, రీజినల్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేష¯ŒS అధికారి ప్రమీలాకుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సూర్యమోహన్, బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, రాష్ట్ర అసోసియేష¯ŒS కోశాధికారి గన్నమని చక్రవర్తి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో భాగంగా శనివారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్డీవో జె.రవీందర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహ పరిచారు. స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ, డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపిక
డోన్ టౌన్ : నంద్యాల, డోన్ డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ఇన్స్ఫైర్ అవార్డు సైన్స్ ఎగ్జిబిషన్లో డోన్ మండలం యూ కొత్తపల్లె ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మానస ప్రదర్శించిన రెయిన్వాటర్ హార్వెస్టింగ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈనెల 16,17వ తేదీల్లో బనగానపల్లె ఎగ్జిబిషన్ జరిగింది. మానసను, గైడ్, ఉపాధ్యాయుడు గంగాధర్‌ను డిప్యూటీ ఈఓ వెంకటరామిరెడ్డి అభినందించారు. మంగళవారం పాఠశాలలో జరిగిన అభినందన సభకు పాఠశాల హెచ్ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు గంగాధర్,రమణ,రవికుమార్,లక్ష్మికాంతరెడ్డి హాజరయ్యారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పట్టణంలోని సుగాలీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఆదివారం స్థానిక ఆర్సీఎం పాఠశాలల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ అండర్– 14, అండర్–17 బాలబాలికల ఆటల పోటీల్లో సుగాలీ కాలనీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు వీరు గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. కె.రమ్య (హాకీ), షేక్ ఆయేషా సుంతాన్ (సాఫ్ట్‌బాల్), జి.అంజలిబాయి (హాకీ), ఎస్.ప్రవల్లిక బాయి(సాఫ్ట్‌బాల్), ఎం.గోపీ (సాఫ్ట్‌బాల్), ఒ.ఆశోక్ (సాఫ్ట్‌బాల్), ఎస్.భువనేశ్వరిభాయ్ (హాకీ), ఎం.కోమలి (ఫుట్‌బాల్), ఒ.త్రివేణి (ఫుట్‌బాల్), ఎ.శ్రీనివాస్ (ఫుట్‌బాల్), షేక్ఆరీఫ్ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై), పి.హుస్సేన్ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై) అనే విద్యార్థులు వివిధ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్.వసుంధారాదేవి, పీఈటీలు ఎ.శ్రీనివాసరెడ్డి, ఎం.నరసింహారావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఇద్దరి ఎంపిక
కొత్తపల్లి : స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఇద్దరు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అ«థార్టీ గ్రౌండ్లో నిర్వహించిన స్కూల్లో గ్రేమ్ ఎంపికలో సీహెచ్ నవీన్‌కుమార్, డి.స్వాతిసరస్వతి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు శుక్రవారం కర్నూలులో ప్రారంభమవుతోన్న అండర్–14 హాకీ పోటీల్లో పాల్గొంటారు. వీరిని పీఈటీ బి.సురేష్‌రాజు, పీడీ కె.వెంకటరెడ్డి అభినందించారు. -
ఉత్కంఠ భరితం
‘కోట’లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు క్రీడాకారులను పరిచయం చేసుకున్న డిప్యూటీసీఎం నేటితో ముగియనున్న పోటీలు సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పురుష, మహిళల జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను తిలకించారు. శుక్రవారం కర్నూలు– గుంటూరు మహిళల కబడ్డీ పోటీ ఆసక్తిగా సాగింది. ఇరు జట్లు 38 పాయింట్ల వంతున సాధించడంతో చెరో ఒక పాయింటు కేటాయించారు. పురుషుల విభాగంలో కడప 27 పాయింట్లు సాధించగా, తూర్పు గోదావరి 66 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కర్నూలు– పశ్చిమ గోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో పశ్చిమ 29 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు జట్టు శ్రీకాకుళం జట్టుపై రెండు పాయింట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నంపై ప్రకాశం జట్టు 44 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. నెల్లూరు జట్టు అనంతపురం జుట్టుపై 44 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. చిత్తూరు జట్టుపై విశాఖపట్నం 23 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అనంతపురంపై కృష్ణా జట్టు 34 పాయింట్ల తేడా విజేతగా నిలిచింది. అదే విధంగా మహిళా విభాగంలో నెల్లూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 43 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జట్టు కడప పై 46 పాయింట్ల తేడాతో, ప్రకాశం జట్టు చిత్తూరుపై ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై 24 పాయింట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసుకుంది. నెల్లూరుపై అనంతపురం 31 పాయింట్ల ఆధిక్యంతో, శ్రీకాకుళంపై విజయనగరం 31 పాయింట్ల తేడాతో, గుంటూరుపై విశాఖ పట్నం 27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌ న్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
ఉత్సాహ‘బరి’తం
కోటలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మూడురోజుల పాటు నిర్వహణ ప్రారంభించిన అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ సామర్లకోట : కూత మొదలైంది. ఉత్సాహ‘బరి’త వాతావరణంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో స్థానిక పల్లంబీడ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను గురువారం అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్ అధ్యక్షత వహించగా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సామర్లకోట పట్టణ యువకులు పట్టుదలతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం వల్ల సామర్లకోటకు ప్రాధాన్యమిచ్చామన్నారు. జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు రాజస్థాన్‌లోను, మహిళల కబడ్డీ పోటీలు పాట్నాలోను జరుగుతాయని చెప్పారు. ఆ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు సామర్లకోటలోనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో కబడ్డీలో బంగారు పతకం సాధించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, కమిటీ సభ్యులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు మాత్రమే గెలుపు, ఓటమిలను సులభంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి మాట్లాడుతూ ఆటలను స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో క్రీడలపై మరింత శ్రద్ధచూపాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం. రంగారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, కార్యదర్శి పద్మనాభం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్య దర్శి ఎం.శ్రీనివాస్‌కుమార్, కోశాధికారి ఏవీడీ ప్రసాద్, జాతీయ కబడ్డీ కోచ్ పోతలు సాయి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, పసల సత్యానందరావు, పంచా రామ క్షేత్ర ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, డిప్యూటీ సీఎం తనయుడు నిమ్మకాయల రంగనాగ్, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మఠం సెంటర్ నుంచి పల్లం బీడ్‌లోని కోర్టు వరకు క్రీడాకారులు ర్యాలీగా తరలి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడా జెండాలను బెలూన్లు ఎగుర వేసి క్రీడలకు స్వాగతం పలికారు. అదే విధంగా కోర్టును వారు ప్రారంభించారు. పురుషుల విభాగంలో తూర్పు– కడప జట్ల మధ్య, మహిళల విభాగం నుంచి కర్నూలు– గుంటూరు జట్లతో పోటీలు ప్రారంభమ అయ్యాయి. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఈటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తాం
డీజీపీ నండూరి సాంబశివరావు గుంటూరు ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకు భూమిపూజ చేసిన అనంతరం డీజీపీ ఆ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను ఆధునిక హంగులతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటిలో ప్రాథమిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సిబ్బంది సాంకేతిక నైపుణ్యం పొంది మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలుత పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నిర్మాణ పూజకు హెడ్ కానిస్టేబుల్ కె.పుత్తంరాజు, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ను హడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసరావులతో భూమి పూజచేయించారు. -
క్లస్టర్ ఖోఖో పోటీలు ప్రారంభం
తునిరూరల్ : ఆంధ్ర, తెలంగాణ మధ్య క్లస్టర్ అంతర్ రాష్ట్ర ఖోఖో పోటీలను స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ పరేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ క్రీడలను ఒలింపిక్ ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీలకు మూడు కోర్టులు ఏర్పాటు చేశామని, రాత్రి కూడా పోటీల నిర్వహణకు ఫ్లడ్‌లైట్లు, ఇతర సదుపాయలు కల్పించామన్నారు. స్టోర్స్ అధారిటీ నియమించిన అంపైర్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. నల్గొండ పబ్లిక్ స్కూల్, టీంపని స్టీల్ సిటీ స్కూల్ మధ్య పోటీతో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విజేతలు : టీంపని స్టీల్ సిటీ స్కూల్ (విశాఖ) జట్టుపై నల్గొండ పబ్లిక్ స్కూల్ జట్టు విజయం సాధించింది. చైతన్య సెంట్రల్ స్కూల్ (మహబూబ్‌నగర్)పై బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్ (ఖమ్మం), చైతన్య సెంట్రల్ స్కూల్ (చిత్తూరు)పై వివేకనంద రెసిడెన్సియల్ స్కూల్ (కరీం నగర్), హైదరాబాద్‌కు చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై విజ్ఞాన్ స్కూల్ జట్టు విజయం సాధించింది. విద్యా సంస్థల సహాయ కార్యదర్శి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. -
‘ప్రజానాట్య మండలి’ తరగతులు ప్రారంభం
అమరావతి: ప్రజానాట్యమండలి కళారూపాలలో ప్రజల ఇబ్బందులు, కష్టాలు ప్రతిబింబించాలని పోగ్రసివ్, డెమోక్రటిక్ ఫోరం ఎమ్మేల్సీ ఎమ్‌విఎస్ శర్మ అన్నారు. శనివారం స్థానిక శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ ఆడిటోరియంలో మూడు రోజులపాటు నిర్వహించే ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణాతరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజానాట్యమండలి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ కళారూపాలు రూపొందించాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రజానాట్యమండలి ప్రతినిధి రమణలతో పాటు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి సుమారు వందమందిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఆటలపోటీలకు వేళంగి విద్యార్థులు
వేళంగి(కరప): రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారు. జిల్లా స్కూలుగేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో అండర్–19 విభాగంలో క్రికెట్, అథ్లెటిక్స్ అంశాలలో జరిగిన ఎంపికలో తమ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్ 1500 మీటర్ల రన్నింగ్ పోటీలకు కె.శ్రీనివాస్ (ద్వితీయ ఎంపీసీ), టి.తేజ, ఎం.ప్రశాంతకుమార్(ప్రథమ ఎంపీసీ)లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారని కళాశాల పీడీ జే.రఘురాం తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కిర్లంపూడి : అక్టోబర్ 1 నుంచి 3 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి 50వ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టును గురువారం సాయంత్రం కిర్లంపూడిలో ఎంపిక చేశారు. స్థానిక యంగ్మెన్స్ స్పోర్ట్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక కార్యక్రమంలో కిర్లంపూడికి చెందిన కేఎల్ పాపారావు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టులో పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వై.సతీష్, పి.వెంకటేశ్వరరావు, ఆర్.గంగాధర్‌రావు, కొవ్వాడ గ్రామానికి చెందిన ఎం.కృష్ణ, తాళ్లరేవుకు చెందిన బి.సతీష్, ఏవీ శేఖర్, ఇంద్రపాలెంకు చెందిన టీకే పవన్, దివిలికి చెందిన హరీష్, నాగబాబు, ఏపీ త్రయంకు కె.సాయిరాం, విరవాడకు చెందిన ఎం.వెంకటరమణ, దివిలికి చెందిన ఆర్.శివ ఇతర సభ్యులు. జట్టుకు కోచ్‌గా బి.ఆదినారాయణ, ప్రగతి పీడీ జి.అప్పారావు వ్యవహరించనున్నారు. వారం రోజులుగా కిర్లంపూడిలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఉద్ధేశించి జగపతినగరం సర్పంచి పెంటకోట నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు నలమాటి జానకిరాయమ్మ, కార్యదర్శి కె.పట్టాభిరామ్, కోశాధికారి కె.శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చదలవాడ బాబి తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన బాక్సర్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచారని ఏపీ స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో సత్తాచాటారన్నారు. ఓ స్వర్ణ పతకంతో పాటు ఏడు కాంస్య పతకాలను సాధించారని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు డిప్యూటీ డీవీఈఓ సుభాకర్, పీడీలు పోతులయ్య, రామకష్ణ, కోచ్‌లు శ్రీనాథ్, పెద్దక్క, క్రీడాకారులను అభినందించారు. బంగారు పతకం సాధించిన సోమిన్ మహమ్మద్ ఢిల్లీలో జరిగే నేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు బాలుర విభాగం సోమిన్ మహమ్మద్ – బంగారు పతకం రజతం ఇబ్రహీమ్, బాబా యూనిస్, శ్రీధర్‌బాబు, అంజనీ నందనరెడ్డి బాలికల విభాగం రజతం సంఘవి, తులసీ, పల్లవి -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : అక్టోబర్ 4, 5వ తేదీల్లో మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీల కోసం నల్లగొండ జిల్లా జట్లను బుధవారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్ 19 యూజీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గవ్వ దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు హాజరు కాగా పోటీలు నిర్వహించినట్లు ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో పీడీ సోమనర్సయ్య, నాగిరెడ్డి, సాంబశివుడు, పీఈటీలు పాల్గొన్నారు. ఖోఖో బాలుర జట్టు : పి.మధు, టి.సాయికుమార్, జె.ప్రశాత్, డి.నర్సింహ, డి.వెంకటేశ్వర్లు, వి.శ్రీకాంత్, ఇ.సురేష్, కె.ప్రవీణ్, పి.శ్రీకాంత్, ఎం.సంతోష్, సిహెచ్ గణేష్, ఎల్.శ్యామ్, డి.మల్లేష్, కే.దినేష్. ఖోఖో బాలికల జట్టు : వి.హేమలత, ఆర్.నవనీత, మమత, సుకన్య, కవిత, భువనేశ్వరి, దివ్యా, మనీషా, శ్యామల, పావని, సౌజన్య, రేణుక, సుషన, కౌసల్య, స్వర్ణలత ఎంపికయ్యారు. సాఫ్ట్‌బాల్ బాలుర : కె.శివ, కె.మహేష్, కె.నరేష్, ఏ.రాజేష్‌కుమార్, జి.భానుప్రసాద్, ఎస్కే.అక్బర్, జి.వెంకటేష్, పి.జలేంధర్, బి.దినేష్, సోమూ, నవీన్, బి.సిద్ధులు, డి.రాజ్, టి.నరేష్, కె.ప్రదీప్. సాఫ్ట్‌బాల్ బాలికలు : రేవతి, ప్రవళిక, ప్రశాతి, సాయివర్షణి, రేణుక, స్వాతి, శ్రావతి, శశివర్షణి, వెన్నల, ఆర్షియాజబీన్, శిరీషా, భర్గవి, అనిత, మనీషా, భార్గవి, సిద్ధూ. బేస్‌బాల్ బాలుర : ఎ.శ్రీకాంత్, కె.రమేష్, బి.రామ్, పి.ఈశ్వర్, ఎన్.నవీన్, వి.నిఖిత్కుమార్, జి.రాఖేష్, బి.సంతోష్, టి.మహేష్, జి. సురేష్, జి.హరిప్రసాద్, పి.జీవన్, అనంతాచారి, నవీన్ ఎంపికయ్యారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
నిజాంపట్నం: జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయురాలు కె.వనజాక్షి తెలిపారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపల్లె ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలలో ప్రజ్ఞం జెడ్పీహైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం ప్రజ్ఞం జెడ్పీహైస్కూల్లో విద్యార్థులకు అభినందనసభ నిర్వహించారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన ఎస్కే గఫార్, కర్రా దిలీప్, టి అఖిల్, బి.తేజ, పి.మౌనికాబాబి ఈ నెల 25,26,27 తేదీలలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్బంగా పీఈటీ కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు(బుజ్జి)ని, విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు అభినందించారు. -
నేటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
సిద్ధమైన కొత్తపేట ఇండోర్ షటిల్ స్టేడియం కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలురు, బాలికల చాంపియన్ షిప్ 2016 పోటీలకు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి శనివారం వరకూ నాలుగు రోజుల పాటు ఈ పోటీల నిర్వహణకు కొత్తపేట కాస్మొపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్)–జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. పోటీల వివరాలను మంగళవారం సీఆర్ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి విలేకర్లకు వివరించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో రావులపాలెం సీఆర్సీ–కొత్తపేట సీఆర్ఎస్ సంయుక్తంగా రెండు ఇండోర్ స్టేడియంలలో జాతీయ షటిల్ పోటీలు నిర్వహిస్తామని ఆర్ఎస్ తెలిపారు. తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి సింగిల్– 2, డబుల్ 1 చొప్పున బాలురు, బాలికలు టీమ్‌లు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఆరు చొప్పున పాల్గొంటాయని, తొలిరోజు క్వాలిఫై టీములు ఆడతాయన్నారు. మలి రోజు నుంచి 20 మ్యాచ్‌లు, ఆఖరి రోజు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. విజేతలు త్వరలో జరిగే సౌత్ జోన్, నేషనల్స్‌కు వెళతారని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కె. మహేష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లమూడి సైదులు, పీఈటీ కస్తూరి రవీందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17,18వ తేదీల్లో ముకుందాపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ అండర్–17 విభాగంలో పెద్దదేవులపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి మహేష్ తమ చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి జట్టును ఒంటి చేతితో గెలిపించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన విద్యార్థి మహేష్‌ను ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
జూడో విజేత అనంతపురం
– రెండు స్థానంలో కర్నూలు, మూడో స్థానంలో చిత్తూరు నందికొట్కూరు: రాష్ట్ర స్థాయి సబ్ జూడో పోటీల్లో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో మూడు రోజులుగా ఉత్కంఠగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగిశాయి. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలో దాదాపు 288 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పలు విభాగాల్లో నిర్వహించిన బాలురు, బాలికల పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటి విజేతగా నిలిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు రెండో స్థానంలో, చిత్తూరు జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి బీహార్ రాష్ట్రం పాట్నాలో జాతీయ స్థాయి సబ్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ నాంశెట్టి చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 20వ తేదీ నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కట్టమంచి జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు అచ్చన్న, టీడీపీ యూత్ డివిజన్ నాయకులు రవికుమార్‌రెడ్డి, జవ్వాజి సుంకన్నగౌడు సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.రవికుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్‌పోలో విజేత కృష్ణా
– రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్న కర్నూలు బనగానపల్లె రూరల్: రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ స్థానంతో కర్నూలు జిల్లా జట్టు సరిపెట్టుకుంది. స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం పాఠశాల క్రీడామైదానంలో ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి వచ్చిన సబ్ జూనియర్స్, జూనియర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో జూనియర్ విభాగంలో కృష్ణా జిల్లా జట్టు 2–1 గోల్స్‌తో కర్నూలు జట్టుపై విజయం సాధించి బంగారు పతకం సాధించింది. అలాగే రన్నర్స్ స్థానంతో కర్నూలు జట్టు రజత పతకం సాధించినట్లు క్రీడాల నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్‌రెడ్డి తెలిపారు. బహుమతుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ..గెలుపొందిన విజేతలకు ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. వీరు త్వరలో కేరళలో జరిగే జాతీయ స్థాయి సైకిల్ పోలో చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడ ప్రతిభకనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, క్రీడారంగం ఎడిటర్ శివ పరమేశ్‡, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, స్కూల్ డైరెక్టర్ రవితేజా రెడ్డి,హెచ్ఎం కమల్‌తేజా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ సురేందర్, ఒలింపిక్ సంఘం అబ్జర్వర్ విజయకుమార్ తదితర క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
24 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్లో ఈ నెల 24 నుంచి 27 వరకూ పంతం పద్మనాభం మెమోరియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన 17వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నారు. పంతం పద్మనాభం స్మారక నాటక పరిషత్ వేదికపై ఈ పోటీలు జరుగుతాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి. 24వ తేదీన శుభారంభ సభతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం కళాంజలి (హైదరాబాద్) ఆధ్వర్యాన కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జగమే మాయ’ నాటకం ప్రదర్శిస్తారు. 25వ తేదీన మహేశ్వరి ప్రసాద్ యంగ్ థియేటర్ ఆధ్వర్యాన ఆర్.వాసుదేవరావు దర్శకత్వంలో ‘అశ్శరభ శరభ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం ఒంగోలు భానూదయ ఆధ్వర్యాన వెంకట్ కందుల దర్శకత్వంలో ‘జగమంతా కుటుంబం’ నాటకం ప్రదర్శిస్తారు. 26వ తేదీన మారుతీ క్రియేషన్స్ (హైదరాబాద్) ఆధ్వర్యాన సుబ్బరాయవర్మ దర్శకత్వంలో ‘మిస్టరీ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం కేవీ మెమోరియల్ ఆర్ట్స్ (విశాఖపట్నం) ఆధ్వర్యాన పి.శివప్రసాద్ దర్శకత్వంలో ‘మీ వెంటే మేం ఉంటాం’ నాటకం ప్రదర్శిస్తారు. 27వ తేదీన అమరావతి ఆర్ట్స్ (గుంటూరు) ఆధ్వర్యాన కావూరి సత్యనారాయణ దర్శకత్వంలో ‘జీవితార్థం’ నాటకం ప్రదర్శిస్తారు. తరువాత శ్రీఅరవింద్ ఆర్ట్స్(తాడేపల్లి) ఆధ్వర్యాన ‘రంకె’ నాటిక ప్రదర్శిస్తారు. ఈ నాటిక 2015 నంది నాటకోత్సవంలో అవార్డు పొందినదని నిర్వాహకులు తెలిపారు. -
ఎయిర్ రైఫిల్ మీట్‌కు ఎంపిక
నరసరావుపేట : టైనీటాట్స్ గ్లోబల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆవుల అనంతజయదేవ్, యనమదల అమృత రాష్ట్ర స్థాయి మీట్‌కు ఎంపికైనట్లు ఆ పాఠశాల డైరక్టర్ పాతూరి శ్రీనివాసరావు చెప్పారు. సత్తెనపల్లిరోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించిన ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన ఆవుల అనంతజయదేవ్ (అండర్–17) ప్రథమస్థానం, బాలికల అండర్–17 విభాగంలో అమృత ద్వితీయ స్థానం పొందారని తెలిపారు. వీరిద్దరూ జిల్లా స్థాయికి ఎంపికయ్యారన్నారు. నెలాఖరులో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి మీట్‌కు వీరిద్దరూ హాజరవుతారని పేర్కొన్నారు. విజేతలను డైరక్టర్లు పాతూరి కోటేశ్వరమ్మ, కొండలరావు, ఎం.యలవర్తి శ్రీనివాసరావు, పీఇటీ వర్ల స్వరాజ్యబాబు అభినందించారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఇద్దరి ఎంపిక
మామిడికుదురు : అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు మామిడికుదురు నవయువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ బొంతు మధుకుమార్ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన సెలక్షన్స్‌లో వీరి ఎంపిక జరిగిందన్నారు. 54–57 కిలోల విభాగంలో పి.జ్యోతి, 51–54 కిలోల విభాగంలో కె.సాయిపవన్ ఎంపికయ్యారని చెప్పారు. జ్యోతి పి.గన్నవరం సిద్ధార్థ జూనియర్ కళాశాలలో, సాయిపవన్ పేరూరు శ్రీవంశీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ విద్యార్థులకు బాక్సింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని మధుకుమార్ చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.తాతబ్బాయి, కోచ్ మధుకుమార్, తదితరులు అభినందించారు. -
21 నుంచి కొత్తపేటలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహణ 13 జిల్లాల నుంచీ పాల్గొననున్న 78 జట్లు కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ –19 బాలురు,బాలికల చాంపియన్ షిప్ –2016 టోర్నమెంట్‌కు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ టోర్నీ నిర్వహణకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్) ఫౌండర్, చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం స్టేడియంలో టోర్నీ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా చైతన్యం పెరిగేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ టోర్నీని కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ క్రీడా పోటీలకు ఒకప్పుడు పేరొందిన కొత్తపేటకు ఆ వైభవం మరలా తెచ్చేందుకు ఈ పోటీలు నాంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏ క్రీడా కోర్టుకూ లేని ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు కొత్తపేట సీఆర్ఎస్, రావులపాలెం సీఆర్సీల సమన్వయంతో వసతి,ఇతర సౌకర్యాలు కలగచేస్తున్నట్టు తెలిపారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచీ బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో ఒకటి చొప్పున ఆరేసి జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఇంతవరకూ నిర్వహించిన టోర్నీలతో పోలిస్తే ఇది మెగా ఈవెంట్ అంటూ ఎమ్మెల్సీ ఆర్ఎస్ను అభినందించారు. జిల్లా అసోసియేషన్ సలహాదారు కె.శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్, సీఆర్ఎస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీరామకృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల భూరిబాబు, సెక్రటరీ జీపీ నాయుడు, జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను, కోశాధికారి ఎస్.శివయ్య, సభ్యులు ఎస్.సందీప్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కడియం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్‌్టబాల్ పోటీల్లో వరంగల్‌కు మూడో స్థానం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళలు సాఫ్‌్టబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. విజేతలకు టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి ట్రోఫీలు అందజేశారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర 62వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో నిర్వహించిన అండర్ –19 పోటీలు సోమవారంతో ముగిశాయి. కబడ్డీ, షూటింగ్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్‌లలో బాల బాలికలకు పోటీలు నిర్వహించగా ఎక్కువ విభాగాలలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ఐఓ ప్రకాశ్‌బాబు, క్రీడల నిర్వహణ కన్వీనర్ గవ్వా దయాకర్‌రెడ్డి, కో కన్వీనర్ అనుముల మధుసూదన్‌రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లయ్య, క్రీడల పర్యవేక్షకులు, పీడీ, పీఈటీలు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్రత్నం, శ్రీనివాస్‌రెడ్డి, కొండల్, కౌన్సిలర్లు ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి, రేపాల పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. విజేతలు వీరే – కబడ్డీ బాలుర విభాగంలో నల్లగొండ ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, మెదక్ తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో నల్లగొండ ప్రధమ, వరంగల్ ద్వితీయ, మహబూబ్‌నగర్ తృతీయ స్థానంలో నిలిచాయి. – షూటింగ్‌బాల్ బాలుర విభాగంలో రంగారెడ్డి ప్రథమ, నిజామాబాద్ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో నల్లగొండ ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, ఆదిలాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. – బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయాయి. దీంతో బాలుర విభాగంలో నల్లగొండ, నిజామాబాద్ జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటించారు. రంగారెడ్డి జట్లు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్, వరంగల్ జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటించగా, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయి జట్ల ఎంపిక మిర్యాలగూడలో జరిగిన అండర్ –19 క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిన రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. కబడ్డీ, షూటింగ్‌బాల్, బాల్బాడ్మింటన్లలో బాల బాలికలను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. ఎంపికైన జట్ల వివరాలు – కబడ్డీ బాలుర విభాగంలో ఆరీఫ్, కె. నరేష్, శివకుమార్ (మహబూబ్‌నగర్), ఎం. మనోజ్, వి.పరమేష్, పి. వెంకన్న, వి.సైదులు, ఎస్కె అమీక్ (నల్లగొండ), డి.అఖిల్, ఎం. సాయినాథ్(రంగారెడ్డి), కె. షుషాంక్ (నిజామాబాద్), ఎం.లూక్యారామ్, కె.తరుణ్(మెదక్), డి.వెంకటేశ్ (వరంగల్), పి. రాజేందర్ గౌడ్(హైదరాబాద్)లు ఎంపికయ్యారు. అదే విధంగా బాలికల విభాగంలో ఎస్కె. నౌషిక్, పి. మౌనిక, జి. అరుణ, సీహెచ్. సుశ్మిత (నల్లగొండ), జి. సరిత, జి. కల్పన, ఎం. ఉమ (వరంగల్), ఎస్.సరస్వతి, శిరీష (వహబూబ్నగర్) ఎం. బుల్లిబాయి (మెదక్), ఎన్. మౌనిక (కరీంనగర్), పి. సౌందర్య (హైదరాబాద్), కె. నిఖిత (నిజామాబాద్), సీహెచ్. హారిక (రంగారెడ్డి)లు ఎంపికయ్యారు. – బాల్ బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో ఆర్. అనిల్‌కుమార్, పి.సాయికుమార్, సీహెచ్. మహేష్ (నిజామాబాద్), ఎం. శ్రీను, బి. భానుప్రసాద్, బి. వంశీకృష్ణ (నల్లగొండ), ఎ. ప్రవీణ్‌కుమార్ (రంగారెడ్డి), సీహెచ్. మహేందర్ (మెదక్)లు ఎంపిక కాగా స్టాండింగ్ బై బి.నవీన్ (నల్లగొండ), ఎం. తిరుపతి (ఆదిలాబాద్), మల్లిఖార్జున్ (మహబూబ్‌నగర్)లు ఉన్నారు. బాలికల విభాగంలో ఎం. లిఖిత, ఎం. అలేఖ్య, పి. ప్రత్యూష (నిజామాబాద్), ఎన్. సాయిశ్రీ, బి. కల్పన (నల్లగొండ), ఎం. సంధ్యావాణి (మహబూబ్‌నగర్) లు కాగా స్టాండింగ్ బైగా బి. శ్రీజ (కరీంనగర్), కె. శ్రీకావ్య (రంగారెడ్డి), ఇ. అనూష (వరంగల్)లు ఉన్నారు. – షూటింగ్‌బాల్ బాలుర విభాగంలో టి. వినయ్పవన్, ఎన్. శ్రీకాంత్, వై. సురేష్ (రంగారెడ్డి), జి. వాసు, డి. భరత్ (నిజామాబాద్), బి. సురేష్‌రెడ్డి, జి. సుమన్, ఎం. సైదులు (నల్లగొండ), ఎ. వినయ్‌కుమార్ (హైదరాబాద్), ఎం. రాజు (మెదక్), స్టాండ్ బై కె. శివ (మహబూబ్‌నగర్), కె. వినోద్‌కుమార్ (మెదక్), జె. శ్రీకాంత్ (నల్లగొండ), ఎస్కె. రీయాజ్ (ఆదిలాబాద్)లు ఎన్నికయ్యారు. బాలికల విభాగంలో ఆర్. వనిత, పి. మానస, ఎస్కే. కౌసర్ (నల్లగొండ), జి. అఖిల (రంగారెడ్డి), కె. శాంతిప్రియ (ఆదిలాబాద్), బి. వినీత (నిజామాబాద్), కె. శిరీష, ఎస్. మౌనిక (మహబూబ్‌నగర్), ఎస్. మమత (ఆదిలాబాద్), టి. హిప్సిబా (మెదక్), స్టాండ్ బై టి. శిల్ప (నల్లగొండ), ఆర్. గాయత్రి (రంగారెడ్డి)లు ఎన్నికయ్యారు. -
జిల్లా క్రీడాకారుల హవా
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్–13 బాలుర డబుల్స్ పోటీల్లో అభినవ్ సాయిరాం (వరంగల్), కె.లోకేష్‌రెడ్డి(హైదరాబాద్), అండర్–15 డబుల్స్ విభాగంలో బి.రితిన్(వరంగల్), టి.పవన్‌కృష్ణ(ఖమ్మం) టైటిల్స్ చేజిక్కించుకున్నారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
చిన్నకాపర్తి(చిట్యాల): మండలంలోని చిన్నకాపర్తి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కుకుడాల గోవర్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో అండర్–14 విభాగంలో ఆవుల అర్చన, రూపని సమత, అండర్–17 విభాగంలో తూముకుంట్ల పూజ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థినులను గ్రామ సర్పంచ్ వలిగొండ లింగమ్మ, ఉపసర్పంచ్ రుద్రారపు శ్రీను, ఎంపీటీసీ రుద్రారపు భిక్షపతి, ఎస్ఎంసీ చైర్మన్ పాలకూరి వెంకటేశం, ఉపాధ్యాయులు ఆభినందించారు. -
ఓవరాల్ చాంపియన్ లేపాక్షి
లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అకడమిక్ 2016 పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్ హాజరయ్యారు. రంగనాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 పాఠశాలలు పాల్గొనగా 19 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు విజేతలై 33 33 బహుమతులను దక్కించుకున్నారు. ఇందులో లేపాక్షి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరు బహుమతులను సాధించి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. బహుమతులు అందుకున్న పాఠశాలల వివరాలు టెక్కలి (ఒకటి), అంపోలు (3), నెలమర్ల (2), సింహాచలం (2), కాకినాడ (1), నరసాపురం (1), మార్కాపురం (1), దొరవారిసత్రం (1), సత్యవేడు (1), సదుం (1), ఉదయమాణిక్యం (2), కలికిరి (1), పీలేరు (1), టేకులోడు (2), లేపాక్షి (6), పేరూరు (1), నందలూరు (2), అరేకల్ (1), నెరవాడ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను సత్కరించారు. -
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి
కొత్తపేట : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి, ఎన్సీసీ ఆర్మీ కేడెట్ యెల్లమిల్లి చార్లెస్ కుమార్ జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు జి.సూర్యప్రకాశరావు గురువారం తెలిపారు. ఈ నెల 6న కాకినాడలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలకు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యాన ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఎనిమిదో తరగతి విద్యార్థి చార్లెస్‌కుమార్ అండర్–14 రైఫిల్ షూటింగ్లో విజయం సాధించాడు. తద్వారా ఈ నెలాఖరున కడపలో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు. తొలి అడుగులోనే విజయబావుటా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలకు సుమారు 30 ఏళ్లకు పూర్వమే ఎన్సీసీ యూనిట్ ఉండేది. అప్పట్లో ఎందరో ఎన్సీసీ విద్యార్థులు వివిధ ఉద్యోగాలు పొందారు. తరువాతి కాలంలో వివిధ కారణాలవల్ల పాఠశాలలో ఎ¯Œæసీసీ యూనిట్‌ను రద్దు చేశారు. కాగా, ఎన్íసీసీ ఆర్మీ చీఫ్ ఆఫీసర్ అయిన గణిత ఉపాధ్యాయుడు ఉప్పలపాటి మాచిరాజు కృషి మేరకు ఈ విద్యా సంవత్సరం ఎన్సీసీ యూనిట్ మంజూరైంది. 25 మంది విద్యార్థులను యూనిట్లో జాయిన్ చేసుకుని శిక్షణ ప్రారంభించారు. మొట్టమొదటగా జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లగా చార్లెస్‌కుమార్ విజయం సాధించి, తొలి అడుగులోనే విజయ బావుటా ఎగురవేశాడు. ఈ సందర్భంగా కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయం సాధిస్థానని విశ్వాçÜం వ్యక్తం చేశాడు. అతడిని డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని, ఎంఈఓ వై.సత్తిరాజు, ఎ¯Œæసీసీ 18వ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ మొనీష్గౌర్, హెచ్ఎం సూర్యప్రకాశరావు, పీడీ బి.అప్పాజీ, పీఈటీ జ్యోతి అభినందించారు. -
రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార
కోల్‌సిటీ : గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన ప్రముఖ కవి రాకుమార రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. ౖయెటింక్లయిన్ కాలనీలోని సింగరేణి పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ‘సయ్యద్ సైదా సాహెబ్’ స్మారక కవితల పోటీలకు ఆయన పంపిన ‘మనసు’ అనే కవిత బహుమతికి ఎంపికైనట్లు నిర్వాహకుడు జానీబాషా మంగళవారం ప్రకటించినట్లు రాకుమార తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లు
9 నుంచి 11 వరకు వివిధ జిల్లాల్లో పోటీలు కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో జరుగనున్న 62వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 14, 17 బాల, బాలికల నెట్‌బాల్, పుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల జాబితాను జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పుర్మ తిరుపతి రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 9 నుంచి 11 వరకు అండర్ 14 బాల, బాలికల పుట్‌బాల్, అండర్ 17 బాలబాలికల నెట్‌బాల్, మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్ 14 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు తమ ఆన్లైన్ ఎంట్రీ 4 కాపీలను ఈ నెల 8 లోగా ఎస్జీఎఫ్ కార్యదర్శికి అందజేయాలన్నారు. నెట్‌బాల్.. అండర్ 14 బాలురు... రాజు, అకాశ్, వంశీ రెడ్డి, విశ్వనాథ్, గణేష్, మణి సాయి విశృత్, వర్షిత్ రావు, సాయి తేజ రెడ్డి, అజయ్, యశ్వంత్, రాకేష్ నాయక్, ఫృధ్వీ. అండర్ 14 బాలికలు... వినీలా రెడ్డి, అశ్విత, సాత్విక రెడ్డి, నర్మదా, అరుంధతి, నిహారిక, పూజా మౌర్య, వర్ష, రోషిణి, సమంత, శ్రీ వెన్నెల సత్య జాహ్నవి, వైష్ణవి. అండర్ 17 బాలురు... ప్రదీప్, అనుదీప్ గౌడ్, విప్లవ్, సతీష్, అజయ్ కుమార్, సాయి తేజ, కళ్యాణ్ రావు, రమ్యదేవ్, ఆదిత్య వినయ్, ప్రశాంత్, నవీన్. అండర్ 17 బాలికలు... ప్రసన్న, రమ్య, శ్రీయ, కీర్తన, సుమ, ప్రణీత, శ్రీజ, రమ్య శ్రీ, శ్రీజ, సమత, శ్రీజ, అభిగ్న. పుట్‌బాల్.. అండర్ 14 బాలురు... ప్రణయ్, శ్రీనాథ్, ఇజాన్, హర్షిత్, సాయిచంద్, అభిరాం, యశ్వంత్, ఇమ్రాన్, శరత్చంద్ర, వినీత్, ఉమేహాన్, విష్ణు ప్రసన్న, కార్తీక్, శ్రావణ్ కుమార్, ధనుష్ రెడ్డి, సందీప్‌కుమార్, స్నేహిత్, హరిప్రసాద్ రెడ్డి. అండర్ 14 బాలికలు... మన్విత, సాయి ప్రియ, శ్రీజ, హర్షిణి, ప్రత్యూష, స్వర్ణ తనూజ, స్నేహా, స్రవంతి, శివ శరణ్య, అశ్విత, కావ్య, నాత్మిక, కావ్య.డి, శృతి, అనిత, రేణుక, అర్చన, సహన. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా యోగా జట్టు
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా యోగా జట్టు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొననుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఆదివారం వారికి అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా యోగా జట్టు క్రీడాకారులను అభినందించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి తుమ్మా శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, వెంకట్, సురేష్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర జట్టుకు జిల్లా క్రికెటర్లు ఎంపిక
ఏలూరు రూరల్ : జిల్లాకు చెందిన క్రికెటర్లు వి.ఉజ్వల్(ఏలూరు), యూఏవీ వర్మ(భీమవరం) అండర్–19 ఆంధ్ర జట్టుకు ఎంపికైనట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఇటీవల విజయవాడ మూలపాడులో నిర్వహించిన అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. ఈ టోర్నీలో పాస్ట్ బౌలర్ ఉజ్వల్ 56 వికెట్లు తీసి 260 పరుగులు చేయగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ యూఏవీ వర్మ 32 వికెట్లు తీసి 200 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. -
కరాటేలో జిల్లాకు పతకాల పంట
భోగాపురం (పెదవేగి రూరల్) : రాష్ట్రస్థాయి కరాటే సుమన్ కప్ –2016 చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాల పంట పండించారు. గత నెల 28న విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ పోటీలు నిర్వహించగా అన్ని విభాగాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. స్థానిక విజ్ఞాన్ గ్లోబల్ జెన్ విద్యార్థులు ఏడు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి బుధవారం విలేకరులకు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జి.వాసుదేవ్, జి.అఖిల్ రాఘవ, కేఎ¯Œæవీవీ హనుమ, ఎ.చాణక్య వివిధ విభాగాలలో 3 బంగారు, 2 రజత, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలు సాధించినట్టు చెప్పారు. ఈ పోటీలలో 10 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొనగా పశ్చిమగోదావరి నుంచి 80 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. విద్యార్థులను, శిక్షకులు ఇబ్రహిమ్ బేగ్, లక్ష్మణరావులను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి, మేనేజర్ బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. భాష్యం విద్యార్థుల ప్రతిభ కొవ్వూరు : కొవ్వూరు భాష్యం పాఠశాల విద్యార్థులు కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఎం.రసూల్‌ఖాన్ తొమ్మిదేళ్ల విభాగంలో బంగారు పతకం, 14 ఏళ్ల విభాగం కటాలో ఎన్ఎల్ హేమంత్ వెండి పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్ జె.సూర్యనారాయణ చెప్పారు. విద్యార్థులను ఆయనతో పాటు జోనల్ ఇన్చార్జ్ జీఎన్ సత్యనారాయణ, లిటిల్ చాంప్స్ ప్రిన్సిపాల్ కె.మల్లేశ్వరి, కరాటే ఇన్స్ట్రక్టర్ మీసాల రాధ తదితరులు అభినందించారు. సత్తాచాటిన ‘ఐడియల్’ విద్యార్థులు జిన్నూరు (పోడూరు) : రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జిన్నూరు ఐడియల్ స్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. అండర్–12 బాలికల కటా విభాగంలో ఎన్.వైష్ణవి బంగారు, కాంస్య పతకాలు, ఎం.రాజవంశీ 2 వెండి పతకాలు, పి.పవన్‌కార్తీక్, కేఎస్ఎస్ పవన్, వారణాశి వెంకట సూర్య చంద్రమౌళి కాంస్య పతకాలు, డి.దుర్గారామ్‌చరణ్ ప్రశంసాపత్రాన్ని సాధించినట్టు స్కూల్ కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు చెప్పారు. కరాటే శిక్షకులు ధనాని సూర్యప్రకాష్, సీహెచ్.లక్ష్మీనారాయణ, ఎన్.అప్పలస్వామితో పాటు విద్యార్థులను పలువురు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కొండమల్లేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్రా గోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అండర్–14 విభాగంలో ఈనెల 27న నల్లగొండలో జరిగిన ఫుట్‌బాల్ క్రీడల్లో అయిదుగురు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 7,8,9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు పెద్దన్న, బక్కయ్య, లోక్యానాయక్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు కదిరి విద్యార్థులు
కదిరి టౌన్ : రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు కదిరి విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే మాస్టర్ అక్బర్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోజురై కరాటే రిమెయి ఇండియా పోటీలకు కదిరిలో నారాయణ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థుల్లో కథాస్ విభాగంలో భావన, అఫీఫా, యాసీర్, కీర్తి, భవిష్య, అరవింద్, తషీఫ్, శ్రీహిత బీరానా, దశదిత్యలు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే విద్యను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాస్టర్, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పద్మజారెడ్డి, రాఘేవంద్ర, చితంబర్‌రెడ్డి, సర్ఫరాజ్, జక్రియా, విష్ణువర్ధన్‌రెడ్డి అభినందించారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన
నడిగూడెం: మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎం.మాధవి, సీహెచ్.శిరీష, సీహెచ్.సాద్విక ఈ నెల 28న నల్గొండలో అండర్–19 విభాగంలో చదరంగం పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ క్రీడాకారులను అభినందించారు. వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు హైద్రాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్స్‌పాల్ ఎస్.గులాం ఎస్ధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్స్‌పాల్ డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవిత, పీఈటీలు సునిత, భవిత తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్ బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు: త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కార్యదర్శి వివరించారు. జిల్లా జట్టును ప్రకటించారు. పోటీలను డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, అసోసియేషన్ అధ్యక్షుడు పీఆర్ఎం లెనిన్తో పాటు పలువురు పీఈటీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు సభ్యులు వీరే.. ఎన్వీవీ కుమార్, పి.ఉదయ్‌కుమార్, కె.శ్రీకుమార్, జి.వెంకటేష్, ఆర్.రాంబాబు, ఆర్ఎంఆర్ కుమార్, ఎం.వినోద్, ఎం.శివకృష్ణ, ఈ.సాయి, ఈ.పవన్, డి.సుధీర్, టి.గణేష్, బి.సాయికుమార్, వి.చంటి, సీహెచ్ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా కె.శ్రీను, జి.ప్రవీణ్, కె.సాయికుమార్‌ను ఎంపిక చేశార -
హేండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్ : త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కార్యదర్శి వివరించారు. జిల్లా జట్టును ప్రకటించారు. పోటీలను డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, అసోసియేషన్ అధ్యక్షుడు పీఆర్ఎం లెనిన్తో పాటు పలువురు పీఈటీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు సభ్యులు వీరే.. ఎన్వీవీ కుమార్, పి.ఉదయ్‌కుమార్, కె.శ్రీకుమార్, జి.వెంకటేష్, ఆర్.రాంబాబు, ఆర్ఎంఆర్ కుమార్, ఎం.వినోద్, ఎం.శివకృష్ణ, ఈ.సాయి, ఈ.పవన్, డి.సుధీర్, టి.గణేష్, బి.సాయికుమార్, వి.చంటి, సీహెచ్ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా కె.శ్రీను, జి.ప్రవీణ్, కె.సాయికుమార్‌ను ఎంపిక చేశార -
రాష్ట్రస్థాయి టీటీ పోటీలకు ఉష
తుని : స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థిని ఎస్.ఉష రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి శుక్రవారం తెలిపారు. ఇటీవల విశాఖపట్నం లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో ఎంవీపీ కాలనీ లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉష ద్వితీయస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు. ఆమెను విద్యా సంస్థల అధినేత సీహెచ్వివీకే నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ పరేష్కుమార్దాస్ అభినందించారు. -
27 నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు, (పెనుమంట్ర) : క్రీడా గ్రామంగా పేరొందిన మార్టేరులో స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషా మోహిద్దీన్ పర్యవేక్షించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం జిల్లాలో జరిగే క్యాడెట్ అంతర జిల్లాల పోటీల్లో (14 ఏళ్లలోపు ) హాజరయ్యేందుకు జట్ల ఎంపిక జరిగినట్లు జిల్లా తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ జరిగిందని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. బాలుర జట్టు భరత్ (33 కేజీలు), మణికంఠ (37 కేజీలు), శివక్రిష్ణ (41 కేజీలు). నదీమ్ ఖాన్ (45 కేజీలు), నరసింహ (49 కేజీలు), సైలాని బాబా(53 కేజీలు), మధు(57 కేజీలు), ప్రవీణ్ (61 కేజీలు), జయేష్ (65 కేజీలు), బాలికల జట్టు రోజా (33 కేజీలు), ప్రశాంతి (37 కేజీలు), హేమా(47 కేజీలు). ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బాస్కెట్ బాల్ కోచ్ జగన్నాథరెడ్డి, ట్రెజరర్ కమ్మన్న, సీనియర్ క్రీడాకారులు రామాంజనేయులు, తులసీరామ్, ఉమామహేశ్వర్, కేశవులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: విజయనగరంలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు భాష్యం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బోడేపూడి మహేష్ చంద్ర ఎంపికైనట్లు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న రేపల్లెలోని ఏవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలో క్యాడెట్ కేటగిరిలో మహేష్ చంద్ర బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మహేష్ చంద్రను, కోచ్ ఎస్కే రషీద్, జోనల్ ఇన్చార్జ్ తలశిల శివ, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కిషోర్ అభినందించారు. -
ఏలూరులో ఏపీ బాడీబిల్డింగ్ రాష్ట్రస్థాయి పోటీలు
రాష్ట్ర కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి రాజమహేంద్రవరం సిటీ : రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు ఈనెల 21న ఏలూరులో రఘులక్ష్మి ఫిట్ జోన్, పశ్చిమగోదావరి జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకటరమణ మూర్తి తెలిపారు. తొమ్మిది వివిధ కేటగిరిల్లో, ఒక వికలాంగ విభాగంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ టోర్నమెంట్లో చాంపియన్ ఆఫ్ చాంపియన్‌కు రూ.15 వేల నగదు, ట్రోఫీ అందజేయనున్నట్టు తెలిపారు. అన్ని విభాగాల్లో మొదటి మూడు శ్రేణుల్లో విజేతలకు నగదు, ట్రోఫీలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు నవంబరులో కర్ణాటక జిల్లా బెల్గాంలో జరిగే అఖిల భారతస్థాయి సతీష్ సుగర్ క్లాసిక్స్ బాడీబిల్డింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతినిధులుగా వెళతారని వెంకటరమణ మూర్తి తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ :98495 79603ను సంప్రదించాలన్నారు. -
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్ : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపూలే మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్ మాచర్ల రజిత, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బుర్ర హరికుమార్ హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణ గౌడ్, మూల శ్రీనివాస్‌గౌడ్, పల్లె నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్ : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం స్థానిక జ్యోతి బాపూలే మైదానంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బ్యాటింగ్ చేసి కరీంనగర్–సుల్తానాబాద్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు సర్వాయిపాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 32 జట్లు హాజరయ్యాయని, మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్ సింగ్, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లేశంగౌడ్, పల్లె నారాయణగౌడ్, పర్శురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దేవరపల్లి: టెన్నికాయిట్ పోటీల్లో మండలంలోని పల్లంట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఈ.చరిత, ఎం. నవ్య, ఎ.సత్యవతి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో చరిత, ఎం.నవ్య ద్వితీయ, ఎ.సత్యవతి తృతీయ స్థానాలు సాధించినట్టు పీఈటీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ విభాగంలో ఆర్.వెంకటేశ్వరరావు ప్రథమ స్థానం సాధించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయనగరంలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. దేవరపల్లి శ్రీసాయి లిటిల్ హార్ట్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని జి.హేమమాధురి అండర్–14 విభాగంలో సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యిందని పీఈటీ ఎం.మురళీ తెలిపారు. -
చెస్ విజేతలు మౌనిక, స్నేహిల్
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా చెస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం స్థానిక చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అండర్–19 జిల్లా స్థాయి పోటీలలో బాలుర విభాగంలో కె.స్నేహిల్, బాలికల విభాగంలో బి.మౌనిక అక్షయ విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయి బాలబాలికల పోటీలలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో కె.తనిష్క్ రెండవ, డి.హేమంత్ మూడవ, జి.హరిసూర్య భరద్వాజ్ నాల్గవ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో సి.హెచ్ వైష్ణవి రెండవ, సి.హెచ్.నీహారిక మూడవ, జి.రుత్విక నాల్గవ స్థానాలు సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా హాజరైన చెస్ అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్రరాజు విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈనెల 12 నుంచి 14 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ‘విక్టరీ’ విద్యార్థులు
అమలాపురం : జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన అండర్–19 చదరంగం పోటీల్లో భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి, చెస్‌లో తమ వద్ద శిక్షణ పొందిన చైతన్యసాయిరాం చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నాడని విక్టరీ అకాడమీ ప్రిన్సిపాల్ టి.వి.సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైతన్యసాయిరాం రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైనట్టు వివరించారు. రాజమహేంద్రవరం అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శనివారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా, అందులో తమ అకాడమీకి చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. తమ అకాడమీ విద్యార్థుల్లో చైతన్యతోపాటు రవీంద్రభారతి పాఠశాల విద్యార్థి ఎస్.సాయిహృషికేష్ రెండవస్థానం, నాథ్ విద్యానికేతన్ విద్యార్థి గోకరకొండ అజయ్ మూడవస్థానం సాధించారన్నారు. వీరంతా వచ్చేనెల 12న విజయనగరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. -
రైఫిల్ షూటింగ్లో ‘పశ్చిమ’కు పతకం
గుంటూరు స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి 7వ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జె.బేబీ మానస విజేతగా నిలిచింది. బ్రాడీపేటలోని ఇండియన్ అకాడమి షూటింగ్ స్పోర్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మానస ప్రతిభ చూపి పతకం గెలుచుకుంది. పోటీలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తిలకించారు. రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాలీత్ విజేతలకు పతకాలు అందించారు. -
సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
తెనాలిరూరల్: తెనాలిని బ్యాడ్మింటన్ హబ్‌గా మార్చేందుకు ఉన్న అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. చెంచుపేట అమరావతి ప్లాట్స్‌లోని ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నేపథ్యంలో ఆర్డీవో జి.నరసింహులు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్ వంటి వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పున్నయ్యచౌదరి మాట్లాడుతూ తెనాలి స్టేడియంలో ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీలు నిర్వహించేదుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలు రెండు విభాగాలుగా ఉంటాయని పేర్కొన్నారు. వాటిలో అండర్–13, అండర్15 పోటీల్లో బాలబాలికలు పాల్గొనవచ్చన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గుర్తింపు పొందినవారు అర్హులుగా చెప్పారు. శాప్ ఓఎస్టీ రామకృష్ణ మాట్లాడుతూ స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ గుంటూరు కార్యదర్శి సంపత్‌కుమార్, గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు, కమిషనర్ కె.శకుంతల, జెడ్పీటీసీ ఎ.జయలక్ష్మి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నామినేటెడ్ ఆశలు
అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి... మంత్రివర్గ విస్తరణ ముగిసింది... ఇక నామినేటెడ్ పదవుల జాతర మొదలవనుంది. అడపాదడపా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పూర్తిస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టిసారించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఆ పదవులపై కన్నేశారు. సమయం ఆసన్నం కావడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పద్నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాలు చేశామని, పార్టీ జెండాను మోశామని ఇప్పుడు అధికారం అనుభవించే అవకాశం వచ్చిందని, తమకు పదవులు ఇవ్వాల్సిందేనని నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. -కరీంనగర్ సిటీ కరీంనగర్ సిటీ: జిల్లా నుంచి పలువురు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులపై గురిపెట్టారు. పార్టీలో సీనియర్ నాయకులు, రాష్ట్ర స్థాయి పలుకుబడి కలిగిన నేతలు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్లు సొంతం చేసుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం స్థాయిలో పరపతి కలిగిన నాయకులకు ఇప్పటికే పలు చైర్మన్ పదవులు ఖరారైనట్లు సమాచారం. ప్రతిమ సంస్థల అధినేత బోయినిపల్లి శ్రీనివాస్‌రావుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన నియామకం లాంఛనమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్‌కు సన్నిహితుడు కావడం, హైదరాబాద్ నార్సంగిలోని శ్రీనివాస్‌రావు ఇంటిలోనే కేసీఆర్ మంత్రి వర్గ కూర్పు చేయడంతో ఆయన ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌కు సోదరుడైన శ్రీనివాస్‌రావుకు ఆ పదవి ఖాయమైనట్లేనని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రామకృష్ణారావు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని అభ్యర్థిస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా, వివాదరహితుడుగా ఉన్న జీవీ శాప్ చైర్మన్ ఆశిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు సన్నిహితుడైన కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు ఆశీస్సులు ఉండడం, మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోవడం జీవీకి కలిసొచ్చే అంశంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ శాప్ దక్కని పరిస్థితిలో ఆ స్థాయిలో మరో పదవి ఇస్తారని ఆ వర్గాలు అంటున్నాయి. పెద్దపల్లికి చెందిన టీఆర్ఎస్వీ, ఓయూ జేఏసీ నేత రాకేష్‌కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఖరారైనట్లు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు నడిపించడంలో రాకేష్ కీలక భూమిక పోషించారు. ఉద్యమం నాటినుంచి కూడా కేసీఆర్‌కు విధేయుడుగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాకేష్ సహచరులంతా ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉండడంతో ఆయనకు కూడా అంతే స్థాయి గల ప్రాధాన్యత పోస్టు ఇవ్వడానికి కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పన్యాల భూపతిరెడ్డికి కూడా కార్పొరేషన్ స్థాయి పదవి లభిస్తుందనే ప్రచారం ఉంది. పార్టీలో సీనియర్‌గా ఉన్న భూపతిరెడ్డి కుటుంబంతో కేసీఆర్‌కు సంవత్సరాల అనుబంధం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. రామగుండం నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కోరుకంటి చందర్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుడు రేసులో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇటీవల రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన చందర్ ఆ తరువాత టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎం.జితేందర్‌రావు, కఠారి చంద్రశేఖర్‌రావు, చిక్కాల రామారావు, నాయకులు ఓరుగంటి ఆనంద్, ఓరుగంటి రమణారావు, నల్ల మనోహర్‌రెడ్డి, నందెల్లి మహిపాల్ తదితరులు కార్పొరేషన్ పదవులపై కన్నేశారు. మంత్రులు, కేసీఆర్ సన్నిహితులతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా స్థాయిలో... జిల్లా స్థాయలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆర్టీఏ సభ్యుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్, ప్రణాళిక సంఘం సభ్యులు, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, ఓదెల మల్లికార్జునస్వామి దేవాలయాలతో పాటు చిన్న స్థాయి దేవాలయాల పాలకమండళ్లు కనీసం వంద వరకు ఉన్నాయి. జిల్లాలో 26 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, ముస్తాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, మేడిపల్లి, కథలాపూర్, జగిత్యాల, మల్యాల, గంగాధర, చొప్పదండి, ధర్మారం, ధర్మపురి, గొల్లపల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, కాటారం, మానకొండూరులతో పాటు ఇటీవల కొత్తగా ఏర్పడిన బెజ్జంకి, కోహెడ, ఇల్లంతకుంట తదితర ఏంఎసీలకు పాలకవర్గాలు నియమించాల్సి ఉంది. అయితే ఇటీవల కొంతమంది చైర్మన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో పాత చైర్మన్లే కొనసాగుతున్నారు. ఇవి న్యాయప్రక్రియ పూర్తయ్యాక నియమించే అవకాశం ఉంది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావుకు జిల్లాలో ముఖ్యమైన వేములవాడ దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఒక్కో ఏఎంసీ, దేవాలయ చైర్మన్లకు కనీసం మూడు నుంచి ఐదుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేయడం స్థానిక ఎమ్మెల్యేలకు సైతం తలనొప్పిగా మారింది. నేతల చుట్టూ ప్రదక్షిణలు నామినేటెడ్ పదవుల పందేరంలో జిల్లాలోని చోటామోటా నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలంతా రాజధాని హైదరాబాద్‌లోనే మకాం వేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాము పార్టీకి చేసిన సేవలు, పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతలను వివరిస్తూ అభ్యర్థిస్తున్నారు. పోలీసు కేసులెన్నో చూడండి... తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులు నామినేటెడ్ రేసులో ముందున్నారు. టీఆర్ఎస్లో ఉంటూ పోరాడిన వారు కొంతమందైతే, విద్యార్థి జేఏసీ, రాజకీయ జేఏసీల్లో కీలక పాత్ర పోషించిన నేతలు తమ ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ పదవులు అభ్యర్థిస్తున్నారు. ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నామని, జైలుకు సైతం వెళ్లామని, కుటుంబాలను వదిలిపెట్టి ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమించామని గుర్తు చేస్తున్నారు. తమపై పదుల సంఖ్యలో పోలీసు కేసులు ఇప్పటికీ ఉన్నాయని, కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, అవకాశం వచ్చినపుడు కనీసం నామినేటెడ్ పదవైనా ఇవ్వరా అంటూ వేడుకుంటున్నారు. ఉద్యమ సమయంలో కేసులెన్నో చూశాకే పదవులు ఇవ్వాలంటూ మెళిక పెడుతున్నారు. ఎమ్మెల్యేలకూ పదవులు..? మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్, ఇతరత్రా పదవులు కట్టబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని ఒకరిద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ క్యాబినెట్ హోదా కల్పించడం తెలిసిందే. పార్లమెంటరీ సెక్రెటరీ, క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ చైర్మన్ల రేసులో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు, కరీంనగర్, మంథని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సంజయ్‌కు వైద్య విధాన పరిషత్ చైర్మన్? రాయికల్ : జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ చైర్మన్ పదవి దక్కే అవకాశముంది. జగిత్యాలలో పార్టీ బలోపేతం, సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభపక్ష ఉపనేత జీవన్‌రెడ్డిని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను ఎదుర్కొనేందుకు సంజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత మంగళవారం సంజయ్‌కు ఫోన్ చేసి సంప్రదింపులు చేసినట్లు తెలిసింది.