అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషా మోహిద్దీన్ పర్యవేక్షించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం జిల్లాలో జరిగే క్యాడెట్ అంతర జిల్లాల పోటీల్లో (14 ఏళ్లలోపు ) హాజరయ్యేందుకు జట్ల ఎంపిక జరిగినట్లు జిల్లా తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ జరిగిందని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.
బాలుర జట్టు భరత్ (33 కేజీలు), మణికంఠ (37 కేజీలు), శివక్రిష్ణ (41 కేజీలు). నదీమ్ ఖాన్ (45 కేజీలు), నరసింహ (49 కేజీలు), సైలాని బాబా(53 కేజీలు), మధు(57 కేజీలు), ప్రవీణ్ (61 కేజీలు), జయేష్ (65 కేజీలు), బాలికల జట్టు రోజా (33 కేజీలు), ప్రశాంతి (37 కేజీలు), హేమా(47 కేజీలు). ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బాస్కెట్ బాల్ కోచ్ జగన్నాథరెడ్డి, ట్రెజరర్ కమ్మన్న, సీనియర్ క్రీడాకారులు రామాంజనేయులు, తులసీరామ్, ఉమామహేశ్వర్, కేశవులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
Published Thu, Aug 18 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement