ఎయిర్ రైఫిల్ మీట్‌కు ఎంపిక
నరసరావుపేట : టైనీటాట్స్ గ్లోబల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆవుల అనంతజయదేవ్, యనమదల అమృత రాష్ట్ర స్థాయి మీట్‌కు ఎంపికైనట్లు ఆ పాఠశాల డైరక్టర్ పాతూరి శ్రీనివాసరావు చెప్పారు. సత్తెనపల్లిరోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించిన ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన ఆవుల అనంతజయదేవ్ (అండర్–17) ప్రథమస్థానం, బాలికల అండర్–17 విభాగంలో అమృత ద్వితీయ స్థానం పొందారని తెలిపారు. వీరిద్దరూ జిల్లా స్థాయికి ఎంపికయ్యారన్నారు. నెలాఖరులో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి మీట్‌కు వీరిద్దరూ హాజరవుతారని పేర్కొన్నారు. విజేతలను డైరక్టర్లు పాతూరి కోటేశ్వరమ్మ, కొండలరావు, ఎం.యలవర్తి శ్రీనివాసరావు, పీఇటీ వర్ల స్వరాజ్యబాబు అభినందించారు.