ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు
ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు
Published Mon, Sep 12 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర 62వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో నిర్వహించిన అండర్ –19 పోటీలు సోమవారంతో ముగిశాయి. కబడ్డీ, షూటింగ్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్‌లలో బాల బాలికలకు పోటీలు నిర్వహించగా ఎక్కువ విభాగాలలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌ఐఓ ప్రకాశ్‌బాబు, క్రీడల నిర్వహణ కన్వీనర్ గవ్వా దయాకర్‌రెడ్డి, కో కన్వీనర్ అనుముల మధుసూదన్‌రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లయ్య, క్రీడల పర్యవేక్షకులు, పీడీ, పీఈటీలు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్‌రత్నం, శ్రీనివాస్‌రెడ్డి, కొండల్, కౌన్సిలర్లు ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి, రేపాల పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
విజేతలు వీరే
– కబడ్డీ బాలుర విభాగంలో నల్లగొండ ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, మెదక్ తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో నల్లగొండ ప్రధమ, వరంగల్ ద్వితీయ, మహబూబ్‌నగర్ తృతీయ స్థానంలో నిలిచాయి.
– షూటింగ్‌బాల్ బాలుర విభాగంలో రంగారెడ్డి ప్రథమ, నిజామాబాద్ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో నల్లగొండ ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, ఆదిలాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి.
– బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయాయి. దీంతో బాలుర విభాగంలో నల్లగొండ, నిజామాబాద్ జట్లను జాయింట్ విన్నర్‌లుగా ప్రకటించారు. రంగారెడ్డి జట్లు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్, వరంగల్ జట్లను జాయింట్ విన్నర్‌లుగా ప్రకటించగా, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచింది.
రాష్ట్ర స్థాయి జట్ల ఎంపిక
మిర్యాలగూడలో జరిగిన అండర్ –19 క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిన రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. కబడ్డీ, షూటింగ్‌బాల్, బాల్‌బాడ్మింటన్‌లలో బాల బాలికలను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.
ఎంపికైన జట్ల వివరాలు
– కబడ్డీ బాలుర విభాగంలో ఆరీఫ్, కె. నరేష్, శివకుమార్ (మహబూబ్‌నగర్), ఎం. మనోజ్, వి.పరమేష్, పి. వెంకన్న, వి.సైదులు, ఎస్‌కె అమీక్ (నల్లగొండ), డి.అఖిల్, ఎం. సాయినాథ్(రంగారెడ్డి), కె. షుషాంక్ (నిజామాబాద్), ఎం.లూక్యారామ్, కె.తరుణ్(మెదక్), డి.వెంకటేశ్ (వరంగల్), పి. రాజేందర్ గౌడ్(హైదరాబాద్)లు ఎంపికయ్యారు. అదే విధంగా బాలికల విభాగంలో ఎస్‌కె. నౌషిక్, పి. మౌనిక, జి. అరుణ, సీహెచ్. సుశ్మిత (నల్లగొండ), జి. సరిత, జి. కల్పన, ఎం. ఉమ (వరంగల్), ఎస్.సరస్వతి, శిరీష (వహబూబ్‌నగర్) ఎం. బుల్లిబాయి (మెదక్), ఎన్. మౌనిక (కరీంనగర్), పి. సౌందర్య (హైదరాబాద్), కె. నిఖిత (నిజామాబాద్), సీహెచ్. హారిక (రంగారెడ్డి)లు ఎంపికయ్యారు.
– బాల్ బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో ఆర్. అనిల్‌కుమార్, పి.సాయికుమార్, సీహెచ్. మహేష్ (నిజామాబాద్), ఎం. శ్రీను, బి. భానుప్రసాద్, బి. వంశీకృష్ణ (నల్లగొండ), ఎ. ప్రవీణ్‌కుమార్ (రంగారెడ్డి), సీహెచ్. మహేందర్ (మెదక్)లు ఎంపిక కాగా స్టాండింగ్ బై బి.నవీన్ (నల్లగొండ), ఎం. తిరుపతి (ఆదిలాబాద్), మల్లిఖార్జున్ (మహబూబ్‌నగర్)లు ఉన్నారు. బాలికల విభాగంలో ఎం. లిఖిత, ఎం. అలేఖ్య, పి. ప్రత్యూష (నిజామాబాద్), ఎన్. సాయిశ్రీ, బి. కల్పన (నల్లగొండ), ఎం. సంధ్యావాణి (మహబూబ్‌నగర్) లు కాగా స్టాండింగ్ బైగా బి. శ్రీజ (కరీంనగర్), కె. శ్రీకావ్య (రంగారెడ్డి), ఇ. అనూష (వరంగల్)లు ఉన్నారు.
– షూటింగ్‌బాల్ బాలుర విభాగంలో టి. వినయ్‌పవన్, ఎన్. శ్రీకాంత్, వై. సురేష్ (రంగారెడ్డి), జి. వాసు, డి. భరత్ (నిజామాబాద్), బి. సురేష్‌రెడ్డి, జి. సుమన్, ఎం. సైదులు (నల్లగొండ), ఎ. వినయ్‌కుమార్ (హైదరాబాద్), ఎం. రాజు (మెదక్), స్టాండ్ బై కె. శివ (మహబూబ్‌నగర్), కె. వినోద్‌కుమార్ (మెదక్), జె. శ్రీకాంత్ (నల్లగొండ), ఎస్‌కె. రీయాజ్ (ఆదిలాబాద్)లు ఎన్నికయ్యారు. బాలికల విభాగంలో ఆర్. వనిత, పి. మానస, ఎస్‌కే. కౌసర్ (నల్లగొండ), జి. అఖిల (రంగారెడ్డి), కె. శాంతిప్రియ (ఆదిలాబాద్), బి. వినీత (నిజామాబాద్), కె. శిరీష, ఎస్. మౌనిక (మహబూబ్‌నగర్), ఎస్. మమత (ఆదిలాబాద్), టి. హిప్సిబా (మెదక్), స్టాండ్ బై టి. శిల్ప (నల్లగొండ), ఆర్. గాయత్రి (రంగారెడ్డి)లు ఎన్నికయ్యారు.
Advertisement