మిర్యాలగూడలో అండర్–19 క్రీడలు
మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి అండర్ 19 బాల బాలికల క్రీడలను జ్యోతి వెలిగించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్‌ఐఓ ప్రకాశ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, ఆర్డీఓ కిషన్‌రావు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు మట్టపల్లి నాగలక్ష్మి, శంకర్‌నాయక్ కౌన్సిలర్‌లు నూకల కవిత వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి సందీప నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి, అనుముల మధుసూదన్‌రెడ్డి, గవ్వా దయాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
రాష్ట్ర స్థాయి అండర్ –19 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకాశ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. దీంతో విద్యార్థులను మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. అదే విధంగా శివానీ స్కూల్ విద్యార్థులు సైతం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించి ఆకట్టుకున్నారు.