UNDER - 19
-
వరల్డ్‌కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ
బిడ్డ దేశం కోసం ఆడుతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి బిడ్డ ఆటను కళ్లారా చూడాలని స్మార్ట్‌ఫోన్‌ను కూడా కాదని ఇన్వర్టర్ కొన్న ఒక తల్లి కథ తప్పక చదవాల్సిందే. విషయంలోకి వెళితే.. షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఆటతీరుతో అదరగొట్టి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదే టీమ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అర్చనా దేవి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించింది. టోర్నీలో ఆమె మంచి ప్రదర్శననే కనబరిచింది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ ఉత్తర్‌ప్రదేశ్‌లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్‌లో 24 గంటలు కరెంటు ఉండడం అనేది గగనం. కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఉంటుందట. అండర్-19 టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరిందన్న సంగతి సావిత్రి తన కూతురు అర్చన ద్వారా తెలుసుకొని తెగ సంతోషపడింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో బిడ్డ ఆటను కళ్లారా చూడాలని భావించింది. కానీ కరెంటు సమస్య ఉండడంతో మ్యాచ్ చూడడం కాస్త కష్టమే. కూతురు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌పై ఆమెకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే సావిత్రి ఒక ఆలోచన చేసింది. ఊర్లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి తన బిడ్డ అర్చనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని.. ఆ మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నానని.. తలా ఇంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్ కొందామని చెప్పింది. తమ గ్రామానికి చెందిన ఒక ఆడబిడ్డ దేశానికి ఆడుతుందంటే అది మాకు గర్వకారణమే అని భావించిన ఊరివాళ్లు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. ప్రతీ ఇంటి నుంచి వచ్చిన రూపాయితో సావిత్రి మొత్తానికి ఇన్వర్టర్ కొనేసింది. ఇక ఆదివారం ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్‌ను చూడడానికి సావిత్రి అంతా సిద్ధం చేసుకుంది. ''మా ఊళ్లో కరెంటు 24 గంటలు ఉంటుందనే దానిపై నమ్మకం లేదు. మొబైల్ ఫోన్లో మ్యాచ్ చూద్దామన్నా బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నా కూతురు ఆడనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఒక్క క్షణం కూడా మిస్ కాకూడాదని అనుకుంటున్నా. అందుకే ఊరివాళ్లతో మాట్లాడి డబ్బు పోగు చేసి ఇన్వర్టర్ కొనుక్కున్నా. ఇప్పుడు నా కూతురు ఆటను చూడడానికి ఎలాంటి అడ్డంకులు లేవు'' అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొంది. ఇక క్రికెటర్ అర్చనా దేవి తల్లి సావిత్రి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె కల నెరవేరకపోయినా కూతురు రూపంలో దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన సావిత్రి.. అర్చనను మాత్రం కష్టపడి పెంచింది. ''ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పంట పండించడంతో పాటు రెండు ఆవుల నుంచి వచ్చిన పాలను అమ్మి కూతురును పెంచి పెద్ద చేశాను. అయితే అర్చనను చిన్నప్పుడే హాస్టల్‌కు పంపించిన సావిత్రి గంజిలోని మురదాబాద్‌లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదివించింది. కూతురును దూరం పెట్టిందని ఊరి వాళ్లంతా సూటిపోటి మాటలు అనేవారు. నాలాగా నా కూతురు పెరగకూడదనే ఎంత కష్టమైనా తనను చదివించుకున్నాను. ఇప్పుడు తను ఉన్నత స్థాయికి ఎదగడంతో తిట్టినోళ్ల నోటి నుంచే పొగడ్తలు రావడం సంతోషంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ జరగడానికి ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్.. భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్ చోప్రా అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. It's down to two 👀 Who will get their hands on the inaugural ICC Women's #U19T20WorldCup? 🏆 pic.twitter.com/CDh5IGnAaa — T20 World Cup (@T20WorldCup) January 28, 2023 A Gold-standard meeting! 👏👏 Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT — BCCI (@BCCI) January 28, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ -
ఐదోసారి టైటిల్‌పై కన్నేసిన యంగ్ ఇండియా
-
సెమీస్‌లో బంగ్లాదేశ్
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ నుంచి ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ 104 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. తాన్జిద్ హసన్ (80; 12 ఫోర్లు), తౌహిద్ హృదయ్ (51; 2 ఫోర్లు), షాహదత్ హుస్సేన్ దీపు (74 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రకీబుల్ హసన్ 9.3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. నేడు జరిగే చివరి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్ ఆడుతుంది. -
పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు...
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా క్రీడారంగం కుదేలైందా.. జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.. క్రీడలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించే పోటీలను చూస్తుంటే క్రీడారంగం దయనీయ పరిస్థితికి అద్దం పండుతోంది. మొన్ననే రాష్ట్ర పాఠశాలల, కళాశాలల క్రీడాసమాఖ్య తెలంగాణలోని 31 జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే క్రీడలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అండర్ – 14, 17 విభాగంలో కేవలం ఆరు అంశాల్లోనే పోటీలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక్క క్రీడాంశంలో కూడా రాష్ట్ర పోటీల నిర్వహాణ జరుగలేదు. ఇక అండర్–19 విభాగంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలకే దిక్కు లేకుండా పోవడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా క్రీడారంగం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పాఠశాలల, కళాశాలల క్రీడలతోపాటు వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు క్రీడల్లో విజయఢంకా మోగించి కరీంనగర్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక క్రీడలో రాష్ట్ర, జాతీయ పోటీల నిర్వహణ పోటాపోటీగా జరుగడంతో క్రీడాహబ్‌గా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నుంచి క్రీడల నిర్వహణ తగ్గుతోంది. గతేడాది సుమారు 10కిపైగా క్రీడల్లో రాష్ట్ర పోటీలు, ఒక క్రీడలో జాతీయస్థాయి పోటీలు జరిగాయి. ఈయేడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు... స్కూల్ గేమ్స్ పరంగా చూస్తే అండర్ 14, 17 విభాగాల్లో సుమారు ఆరు క్రీడాంశాల్లో రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగానికి వచ్చే సరికే పత్తా లేకుండా పోయింది. నాలుగు జిల్లాల్లో కనీసం ఒక్క క్రీడలో రాష్ట్ర పోటీలు నిర్వహించే బాధ్యతను ఆ సమాఖ్య కార్యదర్శి తీసుకోకపోవడం గమనార్హం. గతేడాది పలు క్రీడల్లో రాష్ట్ర పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన అండర్–19 కార్యదర్శి మధు జాన్సన్ ఈసారి ఒక్క క్రీడలో పోటీలు నిర్వహించలేదు. ముందుకు రాని కార్యదర్శులు... పాఠశాలల, కళాశాలల క్రీడల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కువ క్రీడల్లో పోటీలు నిర్వహించడానికి స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ముందుకు రాలేదు. కరీంనగర్లో రెండు, జగిత్యాలలో రెండు, పెద్దపల్లిలో మూడు రాష్ట్రస్థాయి పోటీలు మాత్రమే జరుగనుండగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఒక్క అంశంలో కూడా క్రీడాపోటీలు నిర్వహించలేదు. స్కూల్ గేమ్స్‌పై కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం.. నిధులు మంజూరు కాక పోవడం.. సొంత ఖర్చులతో పోటీల నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో ఈఏడాది పోటీల నిర్వహణకు పలువురు కార్యదర్శులు ఆసక్తి చూపలేదని సమాచారం. సిరిసిల్ల జిల్లాలో నిల్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ యేడు పాఠశాలల, కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించలేదు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎస్జీఎఫ్ కార్యదర్శి విడుదల చేసిన అండర్ 14, 17, 19 మూడు విభాగాల జాబితాలో ఒక్క క్రీడలో కూడా ఈ ఏడాది పోటీలు నిర్వహించలేదు. మొత్తం 96 క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోటీల నిర్వహాణ మూడు కేటగిరీలలో పోటీలు జరుపాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లాలో ఒక్క కేటగిరిలో కూడా పోటీలు జరుగకపోవడం గమనార్హం. మూడేళ్లుగా విడుదల కాని నిధులు.. నిజానికి మూడేళ్ల నుంచి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహాణకు ఇచ్చే నిధులు విడుదలకాలేదు. దీంతో జిల్లాలో గతంలో పలువురు కార్యదర్శులు నిర్వహించిన పోటీల బడ్జెట్ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈసారి పోటీల నిర్వహాణకు దూరం ఉన్నారు. అండర్ 19 విభాగంలో గతంలో నిర్వహించిన పోటీలకు సుమారు రూ.20 లక్షలు, అండర్ 14, 17 విభాగంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు సుమారు రూ.42 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పోటీల నిర్వహణకు ఇటీవల కొత్తగా నియామకమైన పలువురు కార్యదర్శులు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
నేటి నుంచి అండర్–19 క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీల్లో అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అండర్–19 బాలికల జట్లు తలపడతాయన్నారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలోని బీ క్రీడా మైదానం, విన్సెంట్ క్రీడా మైదానాల్లో నిర్వహిస్తామని తెలిపారు. అనంత క్రీడా గ్రామానికి ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన బాలికల జట్లు చేరుకున్నాయన్నారు. మ్యాచ్‌ల వివరాలు తేది తలపడే జట్లు 15–07–2017 కడప–కర్నూలు 15–07–2017 అనంతపురం–నెల్లూరు 16–07–2017 చిత్తూరు–నెల్లూరు 16–07–2017 అనంతపురం–కర్నూలు 18–07–2017 అనంతపురం–కడప 18–07–2017 చిత్తూరు–కర్నూలు 19–07–2017 నెల్లూరు–కర్నూలు 19–07–2017 కడప–చిత్తూరు 20–07–2017 చిత్తూరు–అనంతపురం 20–07–2017 కడప–నెల్లూరు -
మిర్యాలగూడలో అండర్–19 క్రీడలు
మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి అండర్ 19 బాల బాలికల క్రీడలను జ్యోతి వెలిగించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్ఐఓ ప్రకాశ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, ఆర్డీఓ కిషన్‌రావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు మట్టపల్లి నాగలక్ష్మి, శంకర్‌నాయక్ కౌన్సిలర్లు నూకల కవిత వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి సందీప నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి, అనుముల మధుసూదన్‌రెడ్డి, గవ్వా దయాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి అండర్ –19 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకాశ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. దీంతో విద్యార్థులను మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. అదే విధంగా శివానీ స్కూల్ విద్యార్థులు సైతం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించి ఆకట్టుకున్నారు. -
అండర్–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని
లింగసముద్రం: ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్–19 క్రికెట్ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్ జట్టుకు ఎంపికైనట్లు హెచ్ఎం యు. మాధవరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు. -
మెరిసిన అవేశ్
బంగ్లాపై భారత్ గెలుపు అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన భారత కుర్రాళ్లు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో బోణీ చేశారు. అవేశ్ ఖాన్ (6-3-4-4) సంచలన ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. దీంతో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి శుభారంభం చేసింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన భారత్ 45.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. సుందర్ (34), జీషాన్ అన్సారి (34) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిరాజ్ 3, హలీమ్, షావోన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. షఫీయుల్ (26) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన అవేశ్ ఖాన్... తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్‌కు 5 పాయింట్లు లభించాయి. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో రికీ భుయ్ సేన... అఫ్ఘానిస్తాన్‌తో తలపడుతుంది. -
అండర్-19 ప్రాబబుల్స్‌లో తన్మయ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో బరిలోకి దిగనున్న హైదరాబాద్ అండర్-19 ప్రాబబుల్స్ జాబితాను హెచ్‌సీఏ ప్రకటించింది. తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా సహా ఈ ప్రాబబుల్స్‌లో మొత్తం 48 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఎంపికైన ఆటగాళ్లంతా ఈ నెల 19న ప్రాక్టీసు కోసం కోచ్‌ను సంప్రదించాలి.ప్రాబబుల్స్ జాబితా: తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా, సీవీ మిలింద్, రోషన్ రఘురామ్, సాయిచరణ్ తేజ, శ్రవణ్, జయసూర్య, తరుణ్ యాదవ్, యశ్వంత్ రెడ్డి, నితీశ్ రెడ్డి, ప్రణీత్, లోహిత్, సయ్యద్ మాజుద్దీన్, చంద్రశేఖర్, షాదాబ్ తుంబి, శశాంక్, కృష్ణారెడ్డి, రాహుల్, యుధీశ్, అఫ్జల్ బియబాని, శ్రీధరహాస్ రెడ్డి, అరవింద్, ఫర్హాన్, చైతన్య రెడ్డి, రాహుల్ సింగ్, చైతన్య, మనీశ్, ప్రత్యూష్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, ఆకాశ్ కులకర్ణి, కృష్ణ చైతన్య, విదరత్, నిఖిల్‌దీప్, రాకేశ్, రవితేజ, శశిధర్ రెడ్డి, యశ్‌పురి, క్రిస్టీ విక్టర్, రోహిత్ రెడ్డి, చాంద్ పాషా, వాజిద్, సందీప్ గౌడ్, హైదర్ అలీ, అక్షయ్, చైతన్య, శ్రీచరణ్, సుజయ్.