మెరిసిన అవేశ్ | India's victory in the bungalow Under-19 tri-series | Sakshi
Sakshi News home page

మెరిసిన అవేశ్

Nov 21 2015 12:35 AM | Updated on Sep 3 2017 12:46 PM

మెరిసిన అవేశ్

మెరిసిన అవేశ్

బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన భారత కుర్రాళ్లు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో బోణీ చేశారు.

 బంగ్లాపై భారత్ గెలుపు  
 అండర్-19 ముక్కోణపు సిరీస్

 కోల్‌కతా: బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన భారత కుర్రాళ్లు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో బోణీ చేశారు. అవేశ్ ఖాన్ (6-3-4-4) సంచలన ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. దీంతో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి శుభారంభం చేసింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన భారత్ 45.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. సుందర్ (34), జీషాన్ అన్సారి (34) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిరాజ్ 3, హలీమ్, షావోన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. షఫీయుల్ (26) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన అవేశ్ ఖాన్... తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్‌కు 5 పాయింట్లు లభించాయి. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో రికీ భుయ్ సేన... అఫ్ఘానిస్తాన్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement