సెమీస్‌లో బంగ్లాదేశ్‌  | Under 19 Bangladesh Team Won Against South Africa In Quarter Finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బంగ్లాదేశ్‌ 

Published Fri, Jan 31 2020 3:52 AM | Last Updated on Fri, Jan 31 2020 3:52 AM

Under 19 Bangladesh Team Won Against South Africa In Quarter Finals - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ నుంచి ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ 104 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. తాన్‌జిద్‌ హసన్‌ (80; 12 ఫోర్లు), తౌహిద్‌ హృదయ్‌ (51; 2 ఫోర్లు), షాహదత్‌ హుస్సేన్‌ దీపు (74 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రకీబుల్‌ హసన్‌ 9.3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. నేడు జరిగే చివరి క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్‌ ఆడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement