సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కైల్ వెర్రిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ గడ్డపై టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ రెండో రోజు సందర్భంగా వెర్రిన్ ఈ ఘనతను సాధించాడు. బంగ్లా గడ్డపై గతంలో ఏ దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెస్ట్‌ల్లో సెంచరీ చేయలేదు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెర్రిన్ 144 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితికి చేరింది.
మ్యాచ్ విషయానికొస్తే.. వెర్రిన్ సూపర్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులకు ఆలౌటైంది.
202 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది.
బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (1), మొమినుల్ హక్ (0), నజ్ముల్ హసన్ షాంటో (23) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (38), ముష్ఫికర్ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment