బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా రహీం ఈ ఘనత సాధించాడు. రహీం 172 ఇన్నింగ్స్‌ల్లో 38.24 సగటున 6003* పరుగులు సాధించాడు. బంగ్లా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీం తర్వాత తమీమ్ ఇక్బాల్ (5134), షకీబ్ అల్ హసన్ (4609), మొమినుల్ హక్ (4269), హబీబుల్ బషార్ (3026) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీం 31 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రహీంతో పాటు మహ్మదుల్ హసన్ జాయ్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
చదవండి: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment