రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక | Students selected to State level sports competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

Published Tue, Oct 18 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

సత్తెనపల్లి:  రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు పట్టణంలోని సుగాలీ కాలనీ  జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఆదివారం స్థానిక ఆర్‌సీఎం పాఠశాలల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్‌ అండర్‌– 14, అండర్‌–17 బాలబాలికల ఆటల పోటీల్లో సుగాలీ కాలనీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు వీరు గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు.  కె.రమ్య (హాకీ), షేక్‌ ఆయేషా సుంతాన్‌ (సాఫ్ట్‌బాల్‌), జి.అంజలిబాయి (హాకీ), ఎస్‌.ప్రవల్లిక బాయి(సాఫ్ట్‌బాల్‌), ఎం.గోపీ (సాఫ్ట్‌బాల్‌), ఒ.ఆశోక్‌ (సాఫ్ట్‌బాల్‌), ఎస్‌.భువనేశ్వరిభాయ్‌ (హాకీ), ఎం.కోమలి (ఫుట్‌బాల్‌), ఒ.త్రివేణి (ఫుట్‌బాల్‌), ఎ.శ్రీనివాస్‌ (ఫుట్‌బాల్‌), షేక్‌ఆరీఫ్‌ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై), పి.హుస్సేన్‌ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై) అనే విద్యార్థులు వివిధ పోటీలకు ఎంపికయ్యారు.  విద్యార్థులను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్‌.వసుంధారాదేవి,  పీఈటీలు ఎ.శ్రీనివాసరెడ్డి, ఎం.నరసింహారావు, ఉపాధ్యాయులు అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement