హోరాహోరీగా క్రీడా పోటీలు
హోరాహోరీగా క్రీడా పోటీలు
Published Sat, Dec 17 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
సూరేపల్లి (భట్టిప్రోలు): గుంటూరు జిల్లా సెకండరీ స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల డివిజన్ బాలికల ఆటల పోటీలు భట్టిప్రోలు మండలంలోని సూరేపల్లి వీపీ అండ్ జీఎస్‌ఎం హైస్కూల్‌లో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. బాపట్ల డివిజన్ పరిధిలోని నగరం, కాకుమాను, చెరుకుపల్లి, కర్లపాలెం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, పొన్నూరు, బాపట్ల, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని హైస్కూళ్ళకు చెందిన బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. క»బడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెన్నికాయిట్ పోటీలు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ ఎంఈవో గల్లా మధుసూదనకుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.రామకృష్ణ, జోనల్ కార్యదర్శి జీవీఎస్ నాగేశ్వరరావు, మండల స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గార్యాల వెంకటేశ్వరరావు, పాఠశాలల పీఈటీలు పోటీలను పర్యవేక్షించారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విచ్చేశారు. ఆదివారం క్రీడల ముగింపు, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. క్రీడాకారులకు, పీఈటీలకు వేమవరం, సూరేపల్లి గ్రామాలకు చెందిన తాడేపల్లి వెంకటశివ సుబ్రహ్మణ్యం(హోస్టన్ టెక్సాస్–యూఎస్‌ఏ) కుటుంబసభ్యులు భోజన సదుపాయాన్ని, క్రీడాకారులకు షీల్డులు, జ్ఞాపికలను తాడేపల్లి లోహిత్ భార్గవ, అల్పాహారాన్ని వల్లూరి బాబు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement