క్రీడల్
- పీఈటీలు లేరు.. మైదానాలు కానరావు
- టోర్నమెంట్ల స్థానంలో సెలక్షన్లు
- చర్యలు తీసుకోని విద్యాశాఖ
పాపన్నపేట: మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం, శారీరక ఆరోగ్యానికి క్రీడలు అవసరం. అరుుతే నేటి విద్యావిధానంలో క్రీడలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదనేది విద్యావేత్తల అభిప్రాయం. విద్యార్థి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి కేంద్రీకరించగలుగుతాడని పలు పరిశోధనలు కూడా రుజువు చేశారుు. క్రీడలు దేహధారుడ్యానికే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, స్వీయనియంత్రణ, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అలవడుతుందని క్రీడానిపుణుల విశ్లేషణ. క్రీడలు లేకపోతే విద్యార్థి దశ నుంచే మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది.
పాపన్నపేట మండలంలో 10 ఉన్నత పాఠశాలలు, 9 ప్రాథమిక ఉన్నత, 42 ప్రాథమిక పాఠశాలలున్నారుు. అరుుతే పొడిచన్‌పల్లి ఉన్నత పాఠశాల, గాంధారిపల్లి, నాగ్సన్‌పల్లి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు (పిఈటీలు) లేరు. ఇక కొత్తపల్లి పాఠశాలలో మైదాన సౌకర్యం ఉన్నా పిఈటీ లేడు. అలాగే యూసఫ్‌పేట, చీకోడ్‌లింగాయపల్లి, కేజీవీబీ పాఠశాలల్లో పిఈటీలు ఉన్నా ఆటలు ఆడేందుకు చాలినంత మైదానం లేదు. కొడుపాక పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌తో నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలల తీరు ఇలాఉంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. అలాగే 90 శాతం మైదానాలు లేవు. నిధుల లేమితో క్రీడా సామగ్రిని కొనుగోలు చేయడంలేదని తెలుస్తోంది. ఆర్‌ఎంఎస్‌ఏ కింద వచ్చిన రూ.50 వేలల్లో సుమారు 5 నుంచి 7 వేల వరకు క్రీడల కోసం కేటారుుస్తున్నట్లు పిఈటీలు తెలిపారు. ఈ కేటారుుంపులు ఆగస్టు 15, జనవరి 26 జెండా పండుగలకే సరిపోతాయని చెబుతున్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతికి ఆటల పీరియడ్‌లు ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆటను విస్మరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టోర్నమెంట్ల నిర్వహణపై శీతకన్ను
గతంలో ఏటా మండల, తాలుకా స్థారుు టోర్నమెంట్లు నిర్వహించేవారు. ఇటీవల కాలంలో అవి కనుమరుగయ్యారుు. కేవలం పైకా పేరిట క్రీడాకారుల ఎంపికలు జరుగుతున్నారుు. క్రీడాకారుల నైపుణ్యాలపై అంచనా సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఆశించిన స్థారుులో క్రీడాకారులు తయారు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.
క్రీడలకు ప్రాధాన్యంఇవ్వడంలేదు
క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం క్రీడలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అన్ని పాఠశాలల్లో క్రీడలకు పీరియడ్ కేటారుుంచాలి.అలాగే క్రీడా సామగ్రిని అందుబాటు ఉంచాలి.
- శ్రీకాంత్, టీటీఆర్‌ఎస్, నర్సాపూర్