క్రీడాకారిణులకు అభినందన
ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో కె.వి.కోటేశ్వరరావు
గుంటూరు స్పోర్ట్స్: చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో కె.వి.కోటేశ్వరరావు విద్యార్థినులకు సూచించారు. గుంటూరు ప్రభుత్వ జూనియర్ కళాలలో మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా జూనియర్ కళాశాలల విద్యార్థినుల క్రీడా పోటీల శనివారం ముగిశాయి. కళాశాల ప్రాంగంణంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌ఐవో కోటేశ్వరరావు విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించే గుణం విద్యార్థినులకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి క్రీడలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్్స టి.శారద, ఉదయభాస్కర్, ఎం.ఎ హకీమ్, ఎం.సంజీవరెడ్డి, జుబేర్, బి.వి.సుబ్బారెడ్డి, వై పెద్దబ్బాయి, టి.భాగ్యశ్రీ, పూర్ణనందం, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.