క్రీడాకారులు రన్నింగ్ చేస్తుండగా దుమ్ములేస్తున్న దృశ్యం
ఆదిలాబాద్‌కల్చరల్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాలిపడితే దుమ్ములేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే మూడో క్రీడా పాఠశాలగా ఉన్న జిల్లా కేంద్రంలోని క్రీడాకారులకు మైదానంలో అసౌకర్యాలు దర్శనమిస్తున్నాయి. క్రీడాకారులు రన్నింగ్ చేసిన, వాకింగ్ చేసినా దుమ్ములేస్తోంది. స్టేడియంలోని 800 ట్రాక్, 400 ట్రాక్‌లు నడిస్తేనే దుమ్ములేస్తున్నాయి. దీనికి తోడు కోచ్‌లు క్రీడా షెడ్యూల్డ్ ప్రకారం స్పోర్ట్స్ అకాడమి విద్యార్థులు శిక్షణ నివ్వకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, పెద్దలు, క్రీడాకారులు, మహిళలు, చిన్నారులు, అనారోగ్యం నుంచి విముక్తి పొందేందుకు మరికొందరు మైదానానికి వస్తుంటారు. ఇక్కడి పరిస్థితులతో వచ్చేందుకు పలువురు జంక్కుతున్నారు.
కనిపించని ఉద్యోగులు సేవలు...
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, పాఠశాల క్రీడా ఆకాడమిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కావడంతో సమస్యాత్మకంగా మారింది. కోచ్‌లు క్రీడాకారులకు అనువుగా గ్రౌండ్‌మెన్‌లు మైదానాన్ని తీర్చిదిద్దేలా చూడాలి. క్రీడాకారులకు ఏ ఆటల ఆడిస్తున్నారు. ఆటల మైదానం సంక్రమంగా ఉందా లేదా పరిశీలించి అనుగుణంగా తీర్చిదిద్దేలా చూడాలి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హకీ, పుడ్‌బాల్, క్రికెట్‌మైదానాలను వాటరింగ్‌చేసి, వాటిలో గ్రీస్‌వేసి క్రీడాకారులకు చేదోడువాదోడుగా ఉండాలి.
ఆనారోగ్యంగా మైదానం...
ప్రస్తుత సమాజంలో చాలా వరకు కాలుష్యం పెరిగి, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీన పడే వారి సంఖ్యలో ఎక్కుగానే ఉంటుంది. క్రీడాకారులపై దుమ్మునుంచి వచ్చే ప్రభావం తీవ్రంగా చూపే ప్రమాదం వుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అస్వస్థతకు గురిచేసి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే మైదానాలు క్రీడాకారులకు శాపంగా మారవద్దని చెబుతున్నారు.
మైదానం ఆరోగ్యాన్నిచ్చేలా చూడాలి
ప్రభుత్వం మైదానాలలో నడిస్తే ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కానీ, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీనపడేలా ఉండకూడదు. అధికారులు చోరవతీసుకుని వాటరింగ్ చేసి దుమ్ములేకుండా చూడాలి. క్రీడాకారులుకు, ప్రజలకు అనువుగా మైదానాలను తీర్చిదిద్దాలి.
–శ్రీనివాస్, కైలాస్‌నగర్ ఆదిలాబాద్
సిబ్బందిని అదనంగా నియమించాలి
ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసేందుకు క్రీడామైదానంలో సౌకర్యాలు సిబ్బంది కల్పించాలి. అలా పనిచేయని కాంట్రాక్ట్ సోసైటీ పై ఫిర్యాదు చేసి కాంట్రాక్ట్ రద్దు చేసేలా చూడాలి. పనిచేయని సిబ్బందిని తొలగించి పనిచేసే వారికే ప్రాదాన్యత కల్పించాలి. క్రీడాకారుల ఆరోగ్యం విషయంలో దృష్టిసారించాలి.
– ప్రవీణ్, రాంనగర్, ఆదిలాబాద్
విచారించి చర్యలు తీసుకుంటాం
గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఇకముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా విచారించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం. ప్రత్యక్షంగా పరిశీలించి క్రీడాకారులు సౌకర్యాలు కల్పిస్తాం. కోచ్‌లకు సైతం నిబంధనల కూడిన షెడ్యూల్డ్‌లను అందిస్తాం.
– వెంకటేశ్వర్లు, డీవైఎస్‌వో, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment