Stadiums
-
స్పందన కరువైంది...
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అంటే సహజంగా క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. టాస్ వేసేసరికే స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌పై అహ్మదాబాద్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా లేదు. మ్యాచ్ ఆరంభమైన చాలాసేపటి వరకు కూడా స్టేడియంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. భారత్ లేని మ్యాచ్‌కు లక్షకు పైగా సామర్థ్యం ఉన్న స్టేడియం ఫ్యాన్స్‌తో హౌస్‌ఫుల్ అవుతుందని కోరుకోవడం అత్యాశే అయినా మరీ నామమాత్రంగా కూడా జనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చివరి వరకు వేర్వేరు కారణాలతో టికెట్లు అమ్మకానికి ఉంచకపోవడం, నగరంలో తీవ్రమైన ఎండ, వారాంతం కాకపోవడం కూడా అందుకు కారణాలు కావచ్చు. 40 వేల టికెట్లను స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు పంచి పెట్టారు. టికెట్లు తీసుకున్న వారంతా వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. నిజానికి ఇలాంటి మెగా ఈవెంట్లు ఆతిథ్య జట్టు మ్యాచ్‌తో ప్రారంభం కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ‘ఫైనలిస్ట్’లతో పోరు ఖరారు చేశారు. మ్యాచ్ సాగినకొద్దీ సాయంత్రానికి స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య పెరగడం కాస్త ఊరట. -
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు ఇవే (ఫొటోలు)
-
FIFA WC: 8 స్టేడియాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే! ఫైనల్, ముగింపు వేడుకలు అక్కడే!
FIFA World Cup Qatar 2022- ALL 8 Stadiums: జగమంత సాకర్ కుటుంబాన్ని ఒక్క చోట కూర్చోబెట్టే టోర్నీ ఫుట్‌బాల్. అరబ్ ఇలాకాలో తొలి సాకర్ సమరం ఇదే కావడంతో ఖతర్ తమ సంప్రదాయాన్ని, సాంస్కృతిక ప్రాభవాన్ని ప్రతిబింబించేలా స్టేడియాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో 974 స్టేడియం ఈ మెగా ఈవెంట్ ముగియగానే కనుమరుగుకానుంది. ఈ నేపథ్యంలో 974తో పాటు మిగిలిన ఏడు స్టేడియాలకు సంబంధించిన విశేషాలు మీకోసం. వేలమంది ఈలల్ని... దిక్కులన్నీ పిక్కటిల్లే గోలల్ని... తట్టుకునేలా స్టేడియాల్ని ముస్తాబు చేసింది ఖతర్. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)ల్లో ఫుల్ చార్జింగ్‌తో స్టేడియాలన్నీ చుట్టేయొచ్చు. ‘కిక్’ ఇచ్చే ఈ ఎనిమిది స్టేడియాలు దగ్గర దగ్గరలోనే ఉండటం మరో విశేషం. అవన్నీ కూడా దోహా చుట్టుపక్కలే. ఇంకా చెప్పాలంటే ఒకే రోజు (24 గంటల వ్యవధిలో) 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా... అన్నింటిని చూసేయొచ్చంటే అతిశయోక్తి కాదు! ఎందుకంటే గంటల తరబడి సాగే క్రికెట్ కాదిది. గంటన్నరలో ముగిసే ఫుట్‌బాల్ కదా! photo courtesy : Twitter అల్ బైత్ స్టేడియం ►నగరం: అల్ ఖోర్ – సీట్ల సామర్థ్యం: 60 వేలు ►మ్యాచ్‌లు: ఆరంభ సమరం, వేడుకలు, ►సెమీఫైనల్ దాకా జరిగే పోటీలు ఇది భిన్నమైన ఆకృతితో నిర్మించిన స్టేడియం. గల్ఫ్ సంచార ప్రజలు ఉపయోగించే గుడారాలే దీనికి ప్రేరణ. స్టేడియం కూడా భారీ టెంట్ (షామియానా)ల సమూహంగా కనిపిస్తుంది. ఖతర్ భూత, వర్తమానాన్ని ఆవిష్కరించేలా... హరిత అభివృద్ధికి ఆధునిక నమూనాలా ... స్టేడియాన్ని నిర్మించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. photo courtesy : Twitter అహ్మద్ బిన్ అలీ స్టేడియం ►నగరం: ఉమ్ అల్ అఫాయ్ – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 29 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఖతర్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ప్రత్యేకించి స్టేడియం ముఖద్వారం ఇసుక తిన్నెల అలల్ని తలపిస్తుంది. చుట్టూరా ఉన్న కట్టడాలు స్థానిక వృక్షజాలం, జంతుజాల అందాల్ని వర్ణించినట్లుగా ఉంటాయి. photo courtesy : Twitter అల్ జనౌబ్ స్టేడియం ►నగరం: అల్ వక్రా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 21 కిలో మీటర్ల దూరంలో దక్షిణ వక్రా నగరంలో దీన్ని నిర్మించారు. ఖతర్ సంప్రదాయ బోట్లను ప్రతిబించించేలా స్టేడియం పైకప్పు నిర్మాణం ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 40 వేల సామర్థ్యమున్న స్టేడియాన్ని తర్వాత్తర్వాత కుదిస్తారు. ఇతర స్పోర్ట్స్ ప్రాజెక్టుల కోసం విరాళంగా ఇస్తారు. photo courtesy : Twitter ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, మూడో స్థానం ప్లే ఆఫ్ చాన్నాళ్ల క్రితమే 1976లో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2005లో పూర్తిగా నవీకరించారు. 2006లో ఈ స్టేడియంలోనే ఆసియా క్రీడలు నిర్వహించారు. ఆ పాత మైదానం నుంచి అధునాతన స్టేడియంగా ఎన్నో సదుపాయాల నెలవుగా దీన్ని విస్తరించారు. అక్వాటిక్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మ్యూజియం ఇలా ఒకటేమిటి అన్ని హంగులకూ ఈ స్టేడియం పెట్టిందిపేరు. photo courtesy : Twitter ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ►నగరం: అల్ రయ్యాన్ ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ దోహాకు అత్యంత చేరువలో 12 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్టేడియం ఉంది. ప్రపంచశ్రేణి యూనివర్సిటీ క్యాంపస్‌ల మధ్యలో దీన్ని నిర్మించారు. డైమండ్ బిళ్లల ఆకారంలో ఉండే ఈ స్టేడియంపై సూర్యరశ్మి ఎక్కడ పడితే అక్కడ (డైమండ్ బిళ్లలపై పడే సూర్యరశ్మి) మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ సిటీలో ఉన్న ఈ స్టేడియంలోని సగం టికెట్లను వర్సిటీ జట్లు, విద్యార్థుల కోసమే రిజర్వ్ చేశారు. photo courtesy : Twitter లుసాయిల్ స్టేడియం ►నగరం: లుసాయిల్ ►సీట్ల సామర్థ్యం: 80 వేలు ►మ్యాచ్‌లు: ఫైనల్‌దాకా సాగే మ్యాచ్‌లన్నిటికీ లుసాయిల్ ప్రధాన స్టేడియం. దోహాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ ఆఖరికి ఫైనల్ మ్యాచ్(డిసెంబరు 18), ముగింపు వేడుకలనూ ఇక్కడే నిర్వహిస్తారు. టోర్నీ దిగ్విజయంగా ముగిసిన అనంతరం దీన్ని కమ్యూనిటీ సెంటర్‌గా మార్చేస్తారట! పాఠశాలలు, షాప్‌లు, కేఫ్, స్పోర్ట్స్, ఆరోగ్య కేంద్రాలను ఇందులో నిర్వహిస్తారు. photo courtesy : Twitter 974 స్టేడియం ►నగరం: దోహా ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరువలో ఉంటుంది ఈ స్టేడియం. గల్ఫ్ కోస్తా ప్రాంతంలోని ఆకాశహర్మ్యాల మధ్య షిప్పింగ్ కంటెయినర్స్‌తో నిర్మించారు. మొత్తం 974 కంటెయినర్లను వినియోగించడంతో పాటు ఖతర్ ఐఎస్డీ (ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డయలింగ్) కోడ్ కూడా 974 కావడంతో ఆ నంబర్‌నే స్టేడియానికి పేరుగా పెట్టారు. ఈ మైదానానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని పూర్తిగా పడగొడితే ఇందులోని మెటిరీయల్ వృథాకాకుండా పునర్వినియోగానికి అంతా పనికొస్తుందట! photo courtesy : Twitter అల్ తుమమ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్‌లు: గ్రూపు దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ అల్ తుమమ స్టేడియం అరబ్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ ఐకాన్. సంప్రదాయ ఖాఫియా నుంచి ప్రేరణతో రూపొందించారు. ఖాఫియా అంటే టోపీ. దాని ఆకారంలోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. డిజైన్, అద్దిన రంగులు, దిద్దిన సొబగులన్నీ ఓ పే...ద్ద టోపీలాగే ఉంటుంది. అరబ్ సాంస్కృతిక చరిత్రకు దర్పణంలా కనిపిస్తుంది. -యెల్లా రమేశ్ చదవండి: Rahul vs Pant: అతడు ‘ఆల్‌రౌండర్’.. తుది జట్టులో తనే ఉండాలి.. బౌలింగ్ ఆప్షన్ దొరుకుతుంది: భారత దిగ్గజం Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతంగా నిలిచిపోయిన ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లకు పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. అయితే, ప్రస్తుతం ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉండటంతో పాటు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం వచ్చే బుధవారం ఈసీబీ అధికారులను కలవనుంది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం టీకాలు వేసుకున్న ప్రేక్షకులకు అనుమతించవచ్చని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు -
ఇప్పుడే చెప్పలేం
న్యూఢిల్లీ: స్టేడియాల్లోకి ప్రేక్షకులను ఎప్పుడు అనుమతిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌కు చెందిన అప్లికేషన్‌ను శుక్రవారం ఆన్లైన్లో ప్రారంభించిన ఆయన కరోనా వ్యాప్తి ఉన్నంత కాలం ఈ విషయంపై స్పష్టతనివ్వలేమని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అంశంపై ఇప్పుడే మాట్లాడలేను. వీలైనంత తొందరగా ప్రేక్షకులతో స్టేడియాలు కళకళలాడాలని నేనూ కోరుకుంటున్నా. దానికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే అందరికీ ప్రధానం. దీనికి స్థానిక అధికార యంత్రాంగాలు ఒప్పుకోవాలి. వారి నిర్ణయానికే మేం కూడా కట్టుబడతాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి వారికే అవగాహన ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2028 ఒలింపిక్స్ నాటికి భారత్ పతకాల జాబితాలో టాప్–10లో ఉండాలన్న లక్ష్యంపై కొందరు విమర్శలు చేస్తున్నారని రిజుజు వెల్లడించారు. ‘టాప్–10లో ఎలా ఉంటామని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు పంచుకోవచ్చు. వారి మాటల్ని నేను పట్టించుకోను. మనం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలి. వరల్డ్ చాంపియన్‌ను తయారు చేసేందుకు కనీసం 8 ఏళ్లు అవసరం. మేం అదే పనిలో ఉన్నాం’ అని అన్నారు. -
స్టేడియాలు తెరుచుకోవచ్చు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరుదాకా పొడిగించిన ‘లాక్డౌన్ 4.0’లో ఆటలకు బాట పడింది. స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే మైదానాలు, స్టేడియాల వద్ద ఏ ఒక్క ప్రేక్షకుణ్ని అనుమతించరాదని ఆ శాఖ వెల్లడించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత క్రీడాకారులకు ఇది కచ్చితంగా పెద్ద ఊరట. తాజా వెసులుబాటుతో ఇకపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రాల్లో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం అవుతాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతిస్తున్నాం. అయితే ఆటగాళ్లకు తప్ప ప్రేక్షకులకు ప్రవేశం లేదు’ అని ఆ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత్‌లోనూ కరోనా రంగప్రవేశంతో మార్చి మూడో వారం నుంచి ఆటలకు, శిబిరాలకు చుక్కెదురైంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల క్రీడాకారుల కసరత్తుకు తీవ్రమైన అంతరాయం కలిగింది. దీనిపై పలువురు ఆటగాళ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ అంశంపై సమీక్షించి ప్రభుత్వానికి తెలియజేయడంతో నాలుగో విడత లాక్డౌన్లో ఎట్టకేలకు వెసులుబాటు దక్కింది. -
‘టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నాం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకానిక్ స్టేడియం లాంటి నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యేలు కోరినట్టు పేర్కొన్నారు. ఎన్సీసీని తెలంగాణ నుంచి విభజించాలని చూస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్సీసీ కెడెట్స్‌తో చేపడతామని వెల్లడించారు. పలు ప్రాంతాలను లీజుకు తీసుకున్న కొన్ని సంస్థలు లీజు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. అటువంటి సంస్థలకు లీజు డబ్బులు చెల్లించడం కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో లీజులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కల్చరల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నరసరావు పేటలోని స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
దుమ్ములేస్తున్న క్రీడామైదానం
ఆదిలాబాద్‌కల్చరల్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాలిపడితే దుమ్ములేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే మూడో క్రీడా పాఠశాలగా ఉన్న జిల్లా కేంద్రంలోని క్రీడాకారులకు మైదానంలో అసౌకర్యాలు దర్శనమిస్తున్నాయి. క్రీడాకారులు రన్నింగ్ చేసిన, వాకింగ్ చేసినా దుమ్ములేస్తోంది. స్టేడియంలోని 800 ట్రాక్, 400 ట్రాక్‌లు నడిస్తేనే దుమ్ములేస్తున్నాయి. దీనికి తోడు కోచ్‌లు క్రీడా షెడ్యూల్డ్ ప్రకారం స్పోర్ట్స్ అకాడమి విద్యార్థులు శిక్షణ నివ్వకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, పెద్దలు, క్రీడాకారులు, మహిళలు, చిన్నారులు, అనారోగ్యం నుంచి విముక్తి పొందేందుకు మరికొందరు మైదానానికి వస్తుంటారు. ఇక్కడి పరిస్థితులతో వచ్చేందుకు పలువురు జంక్కుతున్నారు. కనిపించని ఉద్యోగులు సేవలు... ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, పాఠశాల క్రీడా ఆకాడమిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కావడంతో సమస్యాత్మకంగా మారింది. కోచ్‌లు క్రీడాకారులకు అనువుగా గ్రౌండ్‌మెన్లు మైదానాన్ని తీర్చిదిద్దేలా చూడాలి. క్రీడాకారులకు ఏ ఆటల ఆడిస్తున్నారు. ఆటల మైదానం సంక్రమంగా ఉందా లేదా పరిశీలించి అనుగుణంగా తీర్చిదిద్దేలా చూడాలి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హకీ, పుడ్‌బాల్, క్రికెట్మైదానాలను వాటరింగ్చేసి, వాటిలో గ్రీస్వేసి క్రీడాకారులకు చేదోడువాదోడుగా ఉండాలి. ఆనారోగ్యంగా మైదానం... ప్రస్తుత సమాజంలో చాలా వరకు కాలుష్యం పెరిగి, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీన పడే వారి సంఖ్యలో ఎక్కుగానే ఉంటుంది. క్రీడాకారులపై దుమ్మునుంచి వచ్చే ప్రభావం తీవ్రంగా చూపే ప్రమాదం వుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అస్వస్థతకు గురిచేసి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే మైదానాలు క్రీడాకారులకు శాపంగా మారవద్దని చెబుతున్నారు. మైదానం ఆరోగ్యాన్నిచ్చేలా చూడాలి ప్రభుత్వం మైదానాలలో నడిస్తే ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కానీ, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీనపడేలా ఉండకూడదు. అధికారులు చోరవతీసుకుని వాటరింగ్ చేసి దుమ్ములేకుండా చూడాలి. క్రీడాకారులుకు, ప్రజలకు అనువుగా మైదానాలను తీర్చిదిద్దాలి. –శ్రీనివాస్, కైలాస్‌నగర్ ఆదిలాబాద్ సిబ్బందిని అదనంగా నియమించాలి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసేందుకు క్రీడామైదానంలో సౌకర్యాలు సిబ్బంది కల్పించాలి. అలా పనిచేయని కాంట్రాక్ట్ సోసైటీ పై ఫిర్యాదు చేసి కాంట్రాక్ట్ రద్దు చేసేలా చూడాలి. పనిచేయని సిబ్బందిని తొలగించి పనిచేసే వారికే ప్రాదాన్యత కల్పించాలి. క్రీడాకారుల ఆరోగ్యం విషయంలో దృష్టిసారించాలి. – ప్రవీణ్, రాంనగర్, ఆదిలాబాద్ విచారించి చర్యలు తీసుకుంటాం గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఇకముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా విచారించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం. ప్రత్యక్షంగా పరిశీలించి క్రీడాకారులు సౌకర్యాలు కల్పిస్తాం. కోచ్‌లకు సైతం నిబంధనల కూడిన షెడ్యూల్డ్‌లను అందిస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో, ఆదిలాబాద్ -
అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి రాజప్ప కొత్తపేటలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కొత్తపేట : రాష్ట్రానికి దేశానికి గుర్తింపు తీసుకువచ్చే క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 అండర్–19 బాలురు, బాలికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ ఫౌండర్ అంyŠ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్) ఆధ్వర్యంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆర్ఎస్ అధ్యక్షత వహించగా హోంమంత్రి రాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభలో రాజప్ప మాట్లాడుతూ వర్థమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, పాత స్టేడియంల ఆధునికీకరణకు, కొత్త స్టేడియంల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మరో మంత్రి సుజాత మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తారని దానిలో భాగంగా 1999లో హైదరాబాద్‌లో ఏసియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మరో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత మంత్రి సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ రెడ్డి అనంతకుమారిలు జ్యోతి వెలిగించారు. ఈ సభలో పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, కె.రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ చైర్మన్ కెవీ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, జిల్లా షటిల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు కొడాలి తనూజ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాంఛనంగా పోటీలను రాజప్ప ప్రారంభించారు. క్వాలిఫై విజేతలు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 85 టీమ్‌లు పోటీలకు హాజరుకాగా గురువారం జరిగే పోటీలకు నాకౌట్ విధానంలో ఎంపికలు జరిగాయి. బాలుర సింగిల్స్ విభాగంలో పి.చంద్రాజ్ పట్నాయక్(విశాఖ), బి.గిరీష్‌నాయుడు(తూర్పుగోదావరి), కె.ఎం.రవి(విశాఖ), కె.సాయిచరణ్(గుంటూరు), ఎం.సాయికిరణ్, బి.రోహిత్‌కుమార్, వి.యశ్వంత్(విశాఖ), ఆమన్గౌడ్(తూర్పుగోదావరి) బాలుర డబుల్స్ విభాగంలో పి.ఎస్.ఎన్ సంతోష్, టి.ఎన్.వీ సన్నీ(విశాఖ), చక్రధర్‌రెడ్డి, కె.విక్రాంత్(ప్రకాశం), ఏ. అరుణేష్, బి.గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), డి.నితిన్, కె.హరికృష్ణ(తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు. -
'ఆట' మరచిన ఆంధ్ర!
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో రకరకాల పదవుల్లో 11 మంది ఉన్నారు. ఇందులో జాతీయ సెలక్టర్ కూడా ఒకరు. ఇక ఏసీఏ పరిధిలో అద్భుతమైన స్టేడియాలు, అకాడమీలు ఉన్నాయి. శభాష్... ఆంధ్ర క్రికెట్ ‘వెలిగిపోతోంది’.... ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. పదవులు, స్టేడియాల సంగతి సరే... మరి ఆట సంగతేంటి..? ఒక్కరంటే ఒక్కరన్నా జాతీయ జట్టు దరిదాపుల్లో ఉన్నారా..? లక్షల రూపాయలు పోసి అరువు సీనియర్లను తెచ్చుకున్నా రంజీ జట్టు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా ఎందుకు తయారవుతోంది. పదవులు, స్టేడియాలతోనే హడావిడి * ఏ మాత్రం పెరగని క్రికెట్ ప్రమాణాలు * జాతీయ జట్టుకు ఆడే ఆంధ్రా క్రికెటరే లేడా..? సాక్షి, విజయవాడ స్పోర్స్ట్ : ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా మేం మంచి స్టేడియం కట్టాము. మంచి సౌకర్యాలు కల్పించాం. అయితే నాకేమీ సంతోషంగా లేదు. నా రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు భారత్‌కు ఆడుతుంటేనే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది’... ఇటీవల విజయవాడ సమీపంలోని మూలపాడు వద్ద క్రికెట్ స్టేడియాల ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య ఇది. అంటే ఓ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనం ఆటగాళ్లు తయారు కావడం. కానీ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మాత్రం దీనిని ఇంకా గ్రహించినట్లు లేదు. ప్రతి జిల్లాలో ఓ క్రికెట్ గ్రౌండ్... కొత్తగా టెస్టు హోదా... ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ వసతి, రెసిడెన్షియల్ అకాడమీ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థారుులో స్టేడియాల అభివృద్ధి జరగలేదని ఏసీఏ చెప్పుకుంటోంది. బీసీసీఐ ఇచ్చిన నిధులతో గత కొన్నేళ్లలో ఏసీఏలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి బాగా జరిగిందనడంలో సందేహం లేదు. ఇక పదవుల సంగతి సరేసరి. ఏకంగా 11 మంది ఏసీఏ నుంచి బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలో ఉన్న ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు మార్కెటింగ్, ఐటీ, ఫిక్చర్స్‌కమిటీల్లో కూడా సభ్యులు. ఇక ఏసీఏకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్టర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయన పదవీకాలం పూర్తయింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇన్ని సౌకర్యాలు, ఇంత అధికారం ఉన్న క్రికెట్ సంఘం నుంచి జాతీయ జట్టుకు, కనీసం ‘ఎ’ జట్టుకు ఆడే ఆటగాళ్లు కూడా కనపడటం లేదు. ఐపీఎల్‌లోనూ ఏ జట్టులోనూ తుది జట్టులో ఆంధ్ర క్రికెటర్ ఆనవాళ్లే లేవు. ఈ స్థితిని మార్చడానికి మాత్రం ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఆటను పట్టించుకోవడం మానేశారు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకూ ఆంధ్ర క్రికెట్లో ఆటగాళ్లు బాగానే ఉండేవారు. ఎప్పుడు సౌత్‌జోన్ జట్టు ఎంపిక జరిగినా కనీసం ఇద్దరు, ముగ్గురు ఆడేవారు. ‘ఎ’ జట్టు స్థాయికి కూడా ఆడారు. కానీ ఆ తర్వాత క్రమంగా వైభవం పోయింది. అండర్-19లో రికీ భుయ్ తప్ప మరో ఆటగాడు వెలుగులోకి రాలేదు. ’మా దగ్గర కొందరు పెద్దలకు అభద్రతా భావం ఎక్కువ. ఎవరికీ పేరు రాకూడదని, నేను తప్ప ఇంకెవరూ కనిపించకూడదనే ఆలోచనా ధోరణి కారణంగా ఈ స్థితి ఏర్పడింది’ అని ఏసీఏ సభ్యుడు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏసీఏలో పదవులు అనుభవించేవారిలో మెజారిటీ సభ్యులకు రంజీ జట్టులో ఉండే క్రికెటర్లందరి పేర్లు కూడా తెలియవంటే అతిశయోక్తి కాదు. గత ఎనిమిదేళ్లలో ఒక్క సీజన్లో మాత్రమే ఆంధ్ర రంజీ జట్టు ఎలైట్ గ్రూప్‌కు వెళ్లింది. కానీ ఒక్క ఏడాదిలోనే మళ్లీ ప్లేట్ ‘సి’ గ్రూప్‌కు పడిపోయింది. ‘కై ఫ్, మజుందార్ లాంటి సీనియర్ క్రికెటర్లను 25 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆడించారు. కానీ ప్రయోజనం లేదు. ఫిజియోలు, కోచ్‌లు అందరూ బయటివారే. మన దగ్గర ఉన్న టాలెంట్‌ను గుర్తించడం లేదు. వేణుగోపాలరావును ఆడించకపోవడం దీనికి ఉదాహరణ. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడేవాళ్లంటే మా వాళ్లకు ఇష్టం. తెలుగు రాని వాళ్లు, తెలుగు మాత్రమే తెలిసిన ఆటగాళ్లకు ఏం కమ్యూనికేట్ చేస్తారని కూడా ఆలోచించడం లేదు’ అని మరో సభ్యుడు వాపోయారు. ఏసీఏలో ఎక్కువ మంది సభ్యులకు పదవులు, ఏ అవకాశం దొరికినా మేనేజర్‌గానో, మరో రూపంలో విదేశీ పర్యటన అవకాశాలు... ఇలా ఏదో ఒక తారుులాలు లభిస్తుండటంతో ఎవరూ సంఘంలో జరిగే విషయాలను ప్రశ్నించడం లేదు. నిజానికి ప్రశ్నించే వాళ్లు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏసీఏలో లోపించిందే అది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కాలం రంజీ జట్టు ప్లేట్లోనే ఉంటుంది... నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అరువు ఆటగాళ్లతో సీజన్‌ను అలా గడిపేయడమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం. మనవాళ్లు పనికిరారా..? 2010లో ఎం.ఎస్.కె. ప్రసాద్ ఏసీఏలో క్రికెట్ ఆపరేషన్స డెరైక్టర్‌గా పదవి చేపట్టారు. గత ఏడాది ఆయనకు బీసీసీఐ సెలక్టర్‌గా అవకాశం లభించింది. దాంతో ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. అయితే మనవాళ్లు ఎవరూ పనికి రారంటూ కింజల్ సూరత్వాలా అనే వ్యక్తిని ముంబై నుంచి పిలిపించి ఈ పదవిలో కూర్చోబెట్టారు. నెలకు రూ. 3 లక్షల జీతం తీసుకుంటున్న ఈయన నిజానికి వృత్తి రీత్యా డాక్టర్. యూనివర్శిటీ స్థాయిలో ఆడాడని చెప్పుకుంటారు కానీ ఒక రాష్ట్ర జట్టు ఆపరేషన్స చూసే స్థాయిలో క్రికెట్ పరిజ్ఞానం లేదు. గతంలో జాతీయ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స సైన్స హెడ్‌గా పని చేశారు. ఒక వైపు భాషా సమస్యను అధిగమిస్తూ ఈ ఏడాది కాలంలో ఏం పని చేశారో కూడా ఏసీఏలోనే చాలా మందికి తెలియదు. ‘మా వాళ్లకు ఆటగాళ్లే కాదు... పరిపాలనలోనూ అరువు వాళ్లను తెచ్చుకోవడమే ఇష్టం. ఇక్కడ ఎవరికై నా ఆ పదవి ఇస్తే అవసరమైన సమయంలో మళ్లీ ఎమ్మెస్కేను డెరైక్టర్ చేయలేమని వారి భయం. అందుకే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు సెలక్టర్‌గా ప్రసాద్ పదవీకాలం పూర్తరుుంది. కాబట్టి సూరత్‌వాలాను పంపించి, ప్రసాద్‌ను ఆ స్థానంలో కూర్చోబెడతారు’ అని ఏసీఏలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి చెప్పటం విశేషం. -
మైదానాలను 45 రోజులు వాడుకోవచ్చు..
సాక్షి, ముంబై: శివాజీపార్క్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర మైదానాల్లో ఇక నుంచి 45 రోజులపాటు రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదివరకు ఈ మైదానాలలో సంవత్సరంలో 30 రోజులపాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉండేది. చట్టంలో సవరణలుచేసి అదనంగా 15 రోజులు మైదానాలు వాడుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. దీంతో ప్రభుత్వ, రాజకీయ, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలాంటి నగరంలో సభలు, సమ్మేళనాలు నిర్వహించేందుకు మైదానాలు దొరకడమే కష్టతరంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మైదానాల కొరతవల్ల ముఖ్యంగా రాజకీయ పార్టీలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్ణయంతో శివాజీపార్క్‌లో గతంలో లాగే 30 రోజులు ధార్మిక, సామాజిక కార్యాక్రమాలు, అదనంగా మంజూరైన 15 రోజుల్లో రాజకీయ సభలు నిర్వహించేందుకు అనుమతి లభించనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు క్రీడల శిక్షణకు తగినంత సమయం దొరకదని వారు పేర్కొంటున్నారు.