రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ విజేత కర్నూలు
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ విజేత కర్నూలు
Published Sat, Dec 17 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
– బాలికల విభాగంలో నెల్లూరు జయకేతనం
కర్నూలు (టౌన్): రాష్ట్ర స్థాయి అండర్ –17 హ్యాండ్‌బాల్ బాలుర పోటీల్లో కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. నగరంలోని స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. 10–17 గోల్స్‌తో కర్నూలు విజేతగా నిలిచింది. రెండో స్థానం ప్రకాశం జిల్లా, మూడో స్థానం పశ్చిమ గోదావరి జిల్లా కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జట్టు ఫైనల్స్‌లో తలపడ్డాయి. 4–3 గోల్స్‌తో నెల్లూరు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో ప్రకాశం, మూడో స్థానంలో కడప నిలిచింది. ముఖ్య అతి«థిగా హాజరైన ఆర్‌సి రెడ్డి కళశాల కరస్పాండెంట్ విజేతలకు ట్రోఫీలు , మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎన్నికైన క్రీడాకారులు బెంగళూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుందరమ్మ , జిల్లా స్కూల్‌గేమ్స్ ఇన్‌చార్జి లక్ష్మీనరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, ఎస్‌జీఎఫ్ రాష్ట్ర అబ్జ్‌ర్వర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement