రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
Published Fri, Oct 7 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
కల్లూరు : డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ అండర్ 19 బాలబాలికల హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓ మల్లికార్జునతోపాటు జిల్లా వృత్తి విద్యాధికారి సుబ్రమణ్యేశ్వరరావు, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చెన్నయ్య..అండర్ 19 కార్యదర్శి చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా 13 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. క్రీడావందనాన్ని ముఖ్య అతిథులు స్వీకరించారు. అనంతరం క్రీడా పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓ మల్లికార్జున మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. పోటీల పర్యవేక్షలు భాస్కర్‌రెడ్డి, షాజహాన్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి హర్షవర్దన్, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement