రాష్ట్రహ్యాండ్‌బాల్ ట్రోఫి కర్నూలుకే
రాష్ట్రహ్యాండ్‌బాల్ ట్రోఫి కర్నూలుకే
Published Sat, Jul 23 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
కల్లూరు (రూరల్): జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి స»Œ జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో బాలుర విభాగంలో కర్నూలు, బాలికల విభాగంలో కడప జట్లు విజేతలుగా నిలిచారు. ఎస్‌డీఆర్ వరల్డ్ స్కూల్ సౌజన్యంతో జరిగిన పోటీలకు సంబంధించి విజేతలుగా నిలిచిన వారికి శనివారం బీ క్యాంపు క్రీడా మైదానంలో బహుమతులు ప్రదానం చేశారు. నంద్యాల ఎస్‌డీఆర్ వరల్డ్ స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు.
విజేతల వివరాలు..
బాలుర విభాగంలో కర్నూలు విన్నర్స్, ప్రకాశం జట్టు రన్నర్స్, తూర్పు గోదావరి జట్టు తతీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో కడప విన్నర్స్, ప్రకాశం రన్నర్స్, శ్రీకాకుళం జట్టు తతీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి లెనిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement