ఏలూరులో ఏపీ బాడీబిల్డింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలు | body buliding compition | Sakshi
Sakshi News home page

ఏలూరులో ఏపీ బాడీబిల్డింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలు

Published Tue, Aug 16 2016 11:55 PM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM

body buliding compition

  • రాష్ట్ర కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి
  • రాజమహేంద్రవరం సిటీ : 
    రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు ఈనెల 21న ఏలూరులో రఘులక్ష్మి ఫిట్‌ జోన్, పశ్చిమగోదావరి జిల్లా బాడీబిల్డర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసోసియేషన్‌ కార్యదర్శి అడ్డూరి వెంకటరమణ మూర్తి తెలిపారు. తొమ్మిది వివిధ కేటగిరిల్లో, ఒక వికలాంగ విభాగంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో చాంపియన్‌ ఆఫ్‌ చాంపియన్‌కు రూ.15 వేల నగదు, ట్రోఫీ అందజేయనున్నట్టు తెలిపారు. అన్ని విభాగాల్లో మొదటి మూడు శ్రేణుల్లో విజేతలకు నగదు, ట్రోఫీలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు నవంబరులో కర్ణాటక జిల్లా బెల్గాంలో జరిగే అఖిల భారతస్థాయి సతీష్‌ సుగర్‌ క్లాసిక్స్‌ బాడీబిల్డింగ్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రతినిధులుగా వెళతారని వెంకటరమణ మూర్తి తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ :98495 79603ను సంప్రదించాలన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement