in eluru
-
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏలూరు విజయవిహార్ సెంటర్ నుంచి ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే సందులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు దోహదం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, ఇచ్చిన ప్రతి రుణానికి యూనిట్ స్థాపన జరిగి తీరాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. బ్యాంకర్లు, జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు ఎంతో దోహదపడతాయన్నారు. తీసుకున్న రుణంతో యూనిట్లు స్థాపించకుండా ఉంటే బ్యాంకర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో పేదవర్గాల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయించడంలో నిరంతరం బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నానని, ఎక్కడా లేనివిధంగా జిల్లాలో పేదల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి అత్యధిక నిధులు కేటాయించేలా చేస్తున్నప్పటికీ చాలాచోట్ల తీసుకున్న రుణాలను పేదవర్గాలు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో బ్యాంకర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్ : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్, బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో తప్పనిసరిగా క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించాలని కలెక్టర్‌కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖా ప్రగతి తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జూన్12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అన్ని పాఠశాలల్లో క్రీడాప్రణాళికలను రూపొందించి పటిష్టవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 29 రిపబ్లిక్ డే సందర్భంగా కచ్చితంగా స్పోర్ట్స్ మీట్స్‌ను నిర్వహించి క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించాలని కలెక్టరు సూచించారు. 600 పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను పాఠశాల టైం టేబుల్లో పొందుపర్చాలని తెలిపారు. జూన్ 12 నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వశిక్షాభియా¯ŒS పీఓ వి.బ్రహ్మానందరెడ్డి, సీఈఓ రూజ్వెల్ట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ ఆర్.గంగాభవాని, ఎస్ఎస్ఏ పీఓ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
తుంపర సేద్యం తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్న దృష్ట్యా ఉద్యాన పంటలకు తుంపర సేద్యం తప్పనిసరి అని, ఎవరైనా డ్రిప్ ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో తుంపర సేద్యంపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరువు జిల్లాలుగా ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా కన్నా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మెట్ట ప్రాంతం వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని షరీఫ్ చెప్పారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే తుంపర సేద్యాన్ని ఉద్యానవన పంటలకు తప్పనిసరి చేయాలని, లేకపోతే నీరులేక పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 45 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి ప్రతి ఎకరాలో డ్రిప్ ఏర్పాటు చేసి తీరాలి్సందేనని, ఈ లక్ష్యాన్ని అధిగవిుంచేందుకు రోజువారీ ప్రగతి నివేదికలను కలెక్టర్ భాస్కర్ సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు అమలు చేస్తున్నారన్నారు. మైక్రో ఇరిగేషన్‌అధికారి రామ్మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన 45 వేల హెక్టార్లలో ఈ ఏడాది కచ్చితంగా బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు సమకరిస్తామని చెప్పారు. ఉద్యాన శాఖ డెప్యూటీ డైరెక్టర్ వైవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ బిందుసేద్యం ద్వారా రైతులు 40 శాతం నుంచి 50 శాతం వరకూ విద్యుత్ ఆదా చేసుకోవచ్చన్నారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్ జీవో సంఘ ఉపాధ్యక్షుడు రమేష్, ఆర్‌యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్ యూఎస్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్‌కుమార్, సర్వశిక్షాభియాన్ సీఎంవో రూజ్వెల్ట్ పాల్గొన్నారు. -
ఒప్పందాలు అమలు చేయాల్సిందే
ఏలూరు (మెట్రో): ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చిన రాతపూర్వక హామీ ప్రకారం 11 ఒప్పందాలను తక్షణమే అమలు చేసి పెట్రోల్, డీజిల్ డీలర్లను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్ల అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పెట్రోల్, డీజిల్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలియం డీలర్లు 365 రోజులు, 24 గంటలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 4న ఆయిల్ కంపెనీలు రాతపూర్వకంగా రాసిచ్చిన నిర్ణయాలను కూడా అమలు చేయకుండా ఒప్పందాలను అగౌరపరిచాయన్నారు. ఈ నిర్ణయాలు అమలు చేసేందుకు మార్చి 9న ఢిల్లీలో సమావేశమై మరో రెండు నెలలు సమయం కావాలని కోరారని, రెండు నెలల సమయం ఇచ్చినా అమలు చేయలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో డీలర్లకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగని రీతిలో ఖర్చులను తగ్గించుకునే విధంగా షిప్ట్ విధానాలను అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. తక్షణమే 11 ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 నుంచి ఉద్యమం ఆయిల్ కంపెనీలు ఒప్పందాలను అమలు చేయకుంటే ఈ నెల 10 నుంచి శాంతియుతంగా ఉద్యమిస్తామని గోపాలకృష్ణ చెప్పారు. కొనుగోళ్లు నిలిపేసి మొదటి విడతగా నిరసన తెలుపుతామన్నారు. అదే విధంగా 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంకులు పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 14 నుంచి ఆదివారం సెలవు దినంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. తక్షణమే ఆయిల్ కంపెనీలు స్పందించి అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ, 11 ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. ఈనెల 10 నుంచి నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు గమిని రాజా, కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు టి.సూర్యనారాయణరెడ్డి, ట్రెజరర్ కె.అంజిబాబు, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, నాయకులు శేఖర్ పాల్గొన్నారు. -
ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్‌కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు. న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వేసవిలో కూడా 24 గంటలూ విద్యుత్ సరఫరా అందించి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపి రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఆయన్ని విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఉత్పత్తికి వినియోగానికి తీవ్ర అంతరం ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాలో 1,169 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వేగవంతంగా అందించి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దడంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా 23/11 కేవీ సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం కింద 6 ఇండోర్ సబ్స్టేషన్లు గత రెండున్నరేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు బి.వీరభద్రరావు, నాయకులు జి.గంగాధర్, ఎన్.అప్పారావు, సీహెచ్ వెంకట్రాజు, నారాయణ, కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సాల్మన్‌రాజు, ఎస్.సురేష్, పి.సుగుణ రావు, వీఆర్ ఆంజనేయులు ఎస్ఈకి పుష్పగుచ్చం అందించారు. -
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష న్ కార్యదర్శి ఎంఎ న్ శ్రీనివాస్‌కుమార్ అన్నారు. ఆదివారం ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియంలో జిల్లా బాస్కెట్‌బాల్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు తాడేపల్లిగూడెం, మార్టేరు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పారు. అసోసియేష న్ కోశాధికారి కె.మురళీకకృష్ణ, గవ్వా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మిస్తాం
ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, ప్యాకేజీలను అమలు చేసి అన్ని విధాలా అదుకుంటామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే 29 ఇళ్ల కాలనీల పనుల ప్రగతి తీరుపై ఐటీడీఏ, గృహ నిర్మాణశాఖాధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త భూసేకరణ ప్యాకేజీ ప్రకారం నిర్ధేశించిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. పాత ప్యాకేజీ ద్వారా అయితే విశాలమైన స్థలం, భవనం, పై అంతస్తు నిర్మించుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే రూ.192 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్, సూపర్ బజార్, ప్రత్యేక పార్కు, చౌక డిపో, ఆరోగ్య కేంద్రం, అంగ న్వాడీ భవనం, పాఠశాలలు, ఇతర సౌకర్యాలు కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో నిర్మించే 11 కాలనీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ షణ్మోహ న్Sను కలెక్టర్ ఆదేశించారు. -
అమ్మ ఒడి ప్రచార రథం ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలకు అందిస్తోన్న పథకాలను గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు అమ్మ ఒడి ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. ఈ మేరకు గురువారం ఏలూరులో జెండా ఊపి ప్రచారరథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందరికీ విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు భవితా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రచార రథం జిల్లాలో జూన్ 30వ తేదీ వరకు గ్రామాల్లో తిరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కళాజాతాల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ సీఎంవో టీటీఎఫ్ రూజ్వెల్ట్, ఏపీవో పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
ఎంసెట్-17ను పటిష్టంగా నిర్వహించాలి
ఏలూరు సిటీ : ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-17 ఆన్లైన్ పరీక్షలను అత్యంత పటిష్టవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలను ఏలూరు పరీక్షా కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కావటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోని ఎంసెట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో తొలిసారి ఆన్లైన్లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లోని భయాన్ని, ఆందోళనను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ ఆన్లైన్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన మోడల్ నీట్ పరీక్షకు 5 డివిజన్లలలో 12 పరీక్షా కేంద్రాల్లో 900 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ మేకా అమరావతి, అధ్యాపకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్.మోహన్ ఉన్నారు. -
‘అమ్మఒడి’ ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో 5 సంవత్సరాల వయసు నిండి బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్ఎస్ గంగాభవాని, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్ల వయసు కలిగిన పిల్ల లు 50 వేల 200 మంది ఉండగా, అంగన్వాడీ కేంద్రాల్లో 27 వేలమంది వరకూ ఉన్నారని తెలిపారు. ఈ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, యూనీఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు, మరుగుదొడ్లు సౌకర్యం వంటివాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 22 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిఈడు పిల ్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామ -
స్త్రీ విద్య కోసం పోరాడిన పూలే
ఏలూరు (మెట్రో) : సమాజంలో సాంఘిక, మూడ నమ్మకాలను ఖండించి స్త్రీల విద్య కోసం పోరాడిన మహావ్యక్తి జ్యోతిరావు పూలే అని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పూలే 191వ జయంతి సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో స్త్రీలు అభివృద్ధి చెందకుంటే ఆ సమాజం అభివృద్ధి చెందదని, మహిళలు విద్యావంతులు కావాలని పూలే ఆకాంక్షించారన్నారు. మహిళల విద్య కోసం ఆ రోజుల్లోనే ఎంతో కృషి చేసిన వ్యక్తి పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ బలహీన వర్గాలకు పూలే ఆశాజ్యోతి అన్నారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. బీసీ నాయకులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన పూలే జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పూలే తన జీవితాన్ని సమాజాభివృద్ధికి దారపోశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా పరిషత్ సీఈవో డి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
వైఫై జోన్‌గా కలెక్టరేట్
ఏలూరు (మెట్రో) : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని వైఫై జోన్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ కనెక్షన్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. జిల్లాలో 12,361 ప్రభుత్వ కార్యాలయాలకు తొలిదశగా ఫైబర్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రూ.149కే ఫైబర్ నెట్ కనెక్షన్‌ను జిల్లాలో 6,274 ఆఫీసులకు, రూ.299 ఫ్యాకేజీ కింద 5,628 కార్యాలయాలకు, రూ.1,499 ప్యాకేజీ కింద 206, రూ.2499లకు ప్యాకేజీ కింద 253 ప్రభుత్వ ఆఫీసులకు అందించనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వేగవంతంగా కలుగుతుందన్నారు. సమావేశంలో ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి, ఐసీడీఎస్ ఆర్జేడీ విద్యావతి, డీఈవో ఆర్ఎస్.గంగాభవాని, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పల్లెల్లో శనివారం నుంచి నెలరోజులు పాటు పర్యటించనున్నట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో పంచాయతీ పన్నుల వసూలు, బయోమెట్రిక్ హాజరు, శానిటేషన్, డంపింగ్ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరగా పల్లెల ప్రగతికి నిరంతరం వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించానని క్షేత్రస్థాయిలో ఏం ప్రగతి జరిగిందో, చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయా? లేదా? అని స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కచ్చితంగా పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ టెలికాన్ఫరె న్స్ నిర్వహిస్తానని ఏప్రిల్ మాసమంతా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు ఉండబోవని చెప్పారు. గ్రామాల్లో నివాసం ఉండని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీల ఉద్యోగం ఆ రోజులో సమాప్తమవుతుందన్నారు. ఏలూరు డివిజన్ పంచాయతీ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మి పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్‌మీట్‌లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్‌ఆర్‌కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు. -
మూడో పంటకు ముందస్తు ప్రణాళిక
ఏలూరు (మెట్రో): జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మూడో పంటకు అవసరమైన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని, మూడో పంట ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ ప్రాధాన్యతా రంగాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో తొలిసారిగా మూడో పంటను ప్రోత్సహిస్తున్నామని రైతుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకు నాలుగు నెలల ముందే సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ పాస్ విధానం ద్వారా మాత్రమే ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు చేయాలని ఏడు నెలలుగా చెబుతున్నా ఇంకా మాన్యువల్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయని కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ పోస్ ద్వారానే ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఉద్యానశాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక పాల్గొన్నారు. ఆర్ అండ్ బీ పనులు వేగిరపర్చాలి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మార్చి 21వ తేదీ నాటికి ఆర్ అండ్ బీ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్ అండ్ బీ పనులపై ఆయన సమీక్షించారు. మార్చి 28 నుంచి మే 30 వరకు డెల్టా ఆధునికీకరణ పనుల నిమిత్తం కాలువల ద్వారా నీటి విడుదల ఆపేస్తామని చెప్పారు. జిల్లాలో ఆర్అండ్బి శాఖ ద్వారా రు.351 కోట్లతో 81 పనులను చేపట్టారని దానిలో రూ.121 కోట్లతో 31 పనులు పూర్తిచేయగా, 27 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పదేపదే సమావేశాలు నిర్వహించినా పనులు మాత్రం జాప్యం చేస్తున్నారన్నారు. ఏలూరు, నరసాపురం, కొవ్వూరు డివిజన్ల ఆర్ అండ్ బీ సిబ్బంది పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లొద్దు జిల్లాలో రాబోయే వారం రోజుల్లో తుపాను సంభవించే అవకాశమున్న దృష్టా్య తీర ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ భాస్కర్ ప్రకటనలో కోరారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, అవసరమైన సమచారాన్ని అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 08812–230050 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలని సూచించారు. విరాళాలకు పన్ను లేదు సైనిక సంక్షేమ నిధికి విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు బుధవారం నగరంలోని సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించారు. విరాళాలు అందించే దాతలు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ బ్రాంచ్ ఖాతా నెంబర్ 33881128795లో జమచేయాలని సూచించారు. -
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమం న్యూటన్ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు. కేడీవీ ప్రసాద్ వర్మ, జెడ్పీహెచ్ఎస్, ఎన్ఆర్పీ అగ్రహారం ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ద్వారా ఆయిల్‌ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్ఎస్, దెందులూరు రైల్ వైబ్రేషన్స్‌తో విద్యుత్ ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్ ద్వారా విద్యుత్‌ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్ క్రిస్టల్స్‌తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్ఎస్, పాలకొల్లు వ్యర్థ జలాల శుద్ధీకరణ వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్ స్కూల్, ఏలూరు కొల్లేరును కాపాడుకుందాం సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు గోల్డెన్ రైస్ గోల్డెన్ రైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్ ఉన్నాయి. ఎస్.భాస్కర్ ప్రభాత్, సెయింట్ అలోషియస్, ఆకివీడు -
భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లతో 1.24 లక్షల బోరుబావులు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర భూగర్భజల శాఖ డైరెక్టర్ కె.వేణుగోపాల్ చెప్పారు. పట్టణంలోని భూగర్భజల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో భూగర్భజలాల వాడకం బాగా పెరిగిందని సమృద్ధిగా ఉండే జిల్లాలో కూడా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం ప్రమాదకర పరిణామమని ఆయన చెప్పారు. గత మే నెలలో 19.08 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు వర్షాలు, పోలవరం కుడి కాలువ తదితర అంశాల వల్ల ప్రస్తుతం 17.01 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. ఆరునెలలతో పోలిస్తే 2 మీటర్లు భూగర్భజలాలు పెరిగినా గత నెలతో పోలిస్తే 0.53 మీటరు నీరు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 1.24 లక్షల బోరు బావులు నిర్మిస్తే అదనంగా 10 లక్షల ఎకరాలకు సేద్యపు నీరు అందుబాటులోకి తీసుకురాగాలని చెప్పారు. జిల్లాలో వినూత్న కార్యక్రమం కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముందు చూపువల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గోదావరి జలాలను భూగర్భంలోకి మళ్లించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వేణుగోపాల్ చెప్పారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలోని జగన్నాథపురంలో రైతుల సహకారంతో భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయోగాత్మకమైన కృషి ఫలిచిందనన్నారు. త్వరలోనే 15 బోర్లు ద్వారా గోదావరి జలాలను భూగర్భంలో భద్రపరుస్తామన్నారు. జగన్నాథపురం గ్రామంలో చిలకలపూడి నరేంద్ర అనే రైతు భూమిలో కోడూరు చెరువు ద్వారా పట్టిసీమ నీటిని మళ్లిచి ఆదర్శ రైతు పర్వతనేని బాబ్జి ఇంజక్షన్ బావికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ బావిని తాము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. భూగర్భ జలశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా ఉపసంచాలకుడు రంగారావు పాల్గొన్నారు. -
జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్‌ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. -
ప్రశాంతంగా పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష
ఏలూరు అర్బ న్‌భీమవరం టౌ న్ : జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో 20, భీమవరంలో 18 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ ఎ న్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు.