అమ్మ ఒడి ప్రచార రథం ప్రారంభం
అమ్మ ఒడి ప్రచార రథం ప్రారంభం
Published Thu, Apr 20 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలకు అందిస్తోన్న పథకాలను గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు అమ్మ ఒడి ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. ఈ మేరకు గురువారం ఏలూరులో జెండా ఊపి ప్రచారరథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందరికీ విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు భవితా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రచార రథం జిల్లాలో జూన్ 30వ తేదీ వరకు గ్రామాల్లో తిరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కళాజాతాల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ సీఎంవో టీటీఎఫ్ రూజ్‌వెల్ట్, ఏపీవో పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు.
Advertisement