చైల్డ్ ఇన్ఫో నమోదుకు 26 వరకు అవకాశం
Published Fri, Sep 23 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదుకు ఈ నెల 26వ తేది వరకు చివరి అవకాశం ఇచ్చినట్టు డీఈవో డి.మధుసూదనరావు గురువారం తెలిపారు. జిల్లాలో 5.40 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పటివరకు 4.40 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యారని, ఇంకా లక్ష మంది విద్యార్థులు నమోదు కావాల్సి ఉందని వారిలో 30 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 70 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. గడువు తేదిలోపు నూరు శాతం అప్‌లోడ్ చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థుల వివరాలు నమోదు చేయని ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ విద్యా సంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా
ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడ బిషప్ గ్రేసీ హైస్కూల్లో నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో అదే వేదికగా కళా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న నిర్వహించాల్సిన ఇంగ్లిష్–1 సమ్మెటివ్ పరీక్షను వాయిదా వేసినట్టు డీఈవో తెలిపారు.
Advertisement
Advertisement