deo told
-
నేటి నుంచి డీఎడ్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 బ్యాచ్‌కు సంబంధించి విద్యార్థులు, అంతకుముందు పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా పది కేంద్రాల్లో గురువారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 1,906 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.ఓఆర్జీ వెబ్సైట్ నుంచి డౌ న్లోడ్ చేసుకుని సంబంధిత ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలని సూచించారు. -
చైల్డ్ ఇన్ఫో నమోదుకు 26 వరకు అవకాశం
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదుకు ఈ నెల 26వ తేది వరకు చివరి అవకాశం ఇచ్చినట్టు డీఈవో డి.మధుసూదనరావు గురువారం తెలిపారు. జిల్లాలో 5.40 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పటివరకు 4.40 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యారని, ఇంకా లక్ష మంది విద్యార్థులు నమోదు కావాల్సి ఉందని వారిలో 30 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 70 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. గడువు తేదిలోపు నూరు శాతం అప్లోడ్ చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థుల వివరాలు నమోదు చేయని ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ విద్యా సంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడ బిషప్ గ్రేసీ హైస్కూల్లో నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో అదే వేదికగా కళా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న నిర్వహించాల్సిన ఇంగ్లిష్–1 సమ్మెటివ్ పరీక్షను వాయిదా వేసినట్టు డీఈవో తెలిపారు. -
పేద విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యం
ఏలూరు సిటీ : ‘జిల్లా విద్యారంగాన్ని గాడిలో పెట్టి పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు బేస్మెంట్ తరహా పరీక్షలు పెట్టాం తప్ప సొంత అజెండా కానీ, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనా కాని లేదు’ అని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక డీఈవో కార్యాలయంలోని ఆయన చాంబర్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయటంతోనే గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చేపట్టిన సర్వేలో 6వ తరగతి విద్యార్థులకు సైతం అక్షరాలు, కూడికలు రాని పరిస్థితి ఉందని తేలిందని, దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్య అందించాలని.. విద్యార్థుల కనీస అభ్యసనా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,14,590 మందికి కామన్ పరీక్ష నిర్వహిస్తే వారిలో 72,717 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 36.54 శాతం విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని గుర్తించామన్నారు. మొత్తంగా సీ, డీ గ్రేడుల్లో 58 శాతం మంది విద్యార్థులు ఉన్నారని వీరి కోసమే బేస్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బడిగంటల కార్యక్రమం ద్వారా పాఠశాలల్లోని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి.. పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే, ప్రై వేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని డీఈవో తెలిపారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించి, ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని డీఈవో చెప్పారు. గత పదేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 1.70 లక్షల మంది పిల్లలు ప్రై వేట్ పాఠశాలలకు Ðð ళ్లిపోయారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 10 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 113 వరకూ ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు బలహీనం కాకూడదనే సంకల్పంతోనే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండటంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని డీఈవో మధుసూదనరావు వివరించారు. -
ప్రైవేటు టెన్త్ విధానం రద్దు : డీఈవో
ఆకివీడు : ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి దుక్కిపాటి మధుసూదనరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ సహకారంతో నిర్మించిన భోజన హాలును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి దాతలు నడుంకట్టాలన్నారు. ఎన్ఆర్ఐ దాత కంభంపాటి వెంకట లక్ష్మీ నర్శింహం తన తండ్రి ఇదే పాఠశాలలో చదివి, ఇదే పాఠశాలలో పనిచేశారని, తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుర్తింపు పొందని పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు జిల్లా ఉమ్మడి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 11,836 మంది ఉపాధ్యాయులకు 11,050 మంది సర్వీసులను ఆన్లైన్లో పొందుపరిచామని చెప్పారు. మిగిలిన 785 మంది సర్వీసు రిజిస్టర్లు ఆన్లైన్ చేయించుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి వరకూ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకే పరీక్షా పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. పదో తరగతిలో రెండేళ్లపాటు ఇంటర్నల్ మార్కులు 20 శాతం పబ్లిక్ పరీక్షా మార్కుల్లో కలుపుతామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదో తరగతికి ఐదు శాతం, వచ్చే ఏడాది 9వ తరగతికి 5 శాతం, ఆ పై వచ్చే ఏడాది పదవ తరగతికి పది శాతం ఇంటర్నల్ మార్కులు కలుపుతామని డీఈవో చెప్పారు. అలా మొత్తం 20 శాతం మార్కులు అవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఈవో మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎంఈఓ సత్యానంద్, సీఎంఓ కె.కృష్ణారావు, హెచ్ఎం రాజరాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీటీసీ సభ్యులు బొల్లా వెంకట్రావు, యజమాన్య కమిటీ చైర్మన్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. -

ప్రై వేట్ విద్యార్థులకు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష
ఏలూరు సిటీ : పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రై వేట్ పాఠశాలల్లో విద్యార్థులు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష రాయాల్సి ఉంటుందని డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. 9వ తరగతి ప్రవేÔ¶ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆగస్టు 31 నాటికి 13 ఏళ్లు, 10వ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 14 ఏళ్లు నిండి ఉండాలన్నారు. పరీక్షల ప్రశ్నపత్రం 50 మార్కులకు సీసీఈ విధానంలో ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. –వచ్చేనెల 16న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, వచ్చేనెల 17న ఉదయం హిందీ, మధ్యాహ్నం భౌతికశాస్త్రం, వచ్చేనెల 18న ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం జీవశాస్త్రం, వచ్చేనెల 19న ఉదయం సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు. ఏలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తాడేపల్లిగూడెం, తణుకు జెడ్పీ హైస్కూళ్లు, భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాల, పాలకొల్లు యంయంకేఎన్ మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు దరఖాస్తులను ఈ పరీక్షా కేంద్రాల నుంచి ఉచితంగా పొందవచ్చు. రూ.700ల డీడీని కార్యదర్శి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ, పశ్చిమగోదావరి, ఏలూరు పేరుతో తీసుకుని ఆగస్టు 2వ తేదీలోగా సంబంధిత పరీక్షా కేంద్రాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు అందజేయాలని డీఈవో వివరించారు.