నేటి నుంచి డీఎడ్ పరీక్షలు
Published Wed, Nov 2 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట): డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 బ్యాచ్‌కు సంబంధించి విద్యార్థులు, అంతకుముందు పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా పది కేంద్రాల్లో గురువారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 1,906 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌సీ.ఏపీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్ నుంచి డౌ న్‌లోడ్ చేసుకుని సంబంధిత ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement