thursday
-
Thursday Myths: గురువారం ఆ రంగు శుభసూచికం, అదృష్టం వరిస్తుందట!
హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. గురువారం ఆ రంగు శుభసూచికం గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట. గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట. గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట. గురువారం నాడు చేయకూడని పనులు ♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. ♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. ♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. ♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. ♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్, కశ్చితమైన ఆధారాలు లేవు. -
అదర్ సైడ్.. నేను సైతం...
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్. ‘ఇప్పుడు నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్‌తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే. దిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ కార్యాలయంలో యామీ గౌతమ్ అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది మజిలీస్. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది.. యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం. ‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్ వినేటప్పుడు... ‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్’ సినిమాలో క్రైమ్ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. -
కలిసొచ్చిన గురువారం!
సాక్షి, అమరావతి: కొత్తగా ప్రారంభించే ఏ పనైనా ఫలప్రదం కావాలంటే వారం, వర్జ్యం చూసుకుని మొదలెట్టాలని పెద్దలు చెబుతారు. ఈ సెంటిమెంట్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనుకోకుండా కలిసొస్తోంది. ఎలాగంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లతోపాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఇలా అన్నీ యాధృచ్ఛికంగా గురువారమే వచ్చాయి. ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఓట్ల లెక్కింపు.. మే 30న ప్రమాణ స్వీకారం.. ఈ మూడు రోజులు గురువారమే రావడం గమనార్హం. దీంతో జగన్మోహన్రెడ్డికి గురువారం కలిసొచ్చిందంటూ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారం, వర్జ్యం గురించి తెలిసిన వారు గురువారం గురించి గొప్పగా చెబుతున్నారు. అన్నీ విశేషాలే.. - ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్సార్సీపీ సాధించిన ఎమ్మెల్యేల స్థానాలు 151ని ఎటు నుంచి చూసినా (వెనుక నుంచి ముందుకు 151, ముందు నుంచి 151 అంకెలు వస్తాయి) ఒకేలా రావడం విశేషం. - రాష్ట్ర చరిత్రలోనే ఒకే రాజకీయ పార్టీగా ఒంటరిగా పోటీచేసి ఏకంగా 86 శాతం (అత్యధిక) ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ సాధించడం మరో రికార్డు. - 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 156 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ 151 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ.. వేరొకరిని సీఎం చేయగా సరిగ్గా పదేళ్ల తరువాత ప్రజలే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. - మరో విశేషం ఏమిటంటే.. 2004 ఎన్నికల్లో వైఎస్ సీఎం కాగా.. చంద్రబాబుకు కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఈసారి జగన్మోహన్రెడ్డి అధికారం చేపడుతుండగా.. చంద్రబాబు పార్టీకి 2004లో వచ్చిన దానికంటే సగమే అంటే 23 ఎమ్మెల్యేలే దక్కాయి. - 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. తాజా ఎన్నికల్లో అంతే సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి దక్కాయి. - కాగా, అడ్డగోలుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు అంతేమంది ఎమ్మెల్యే, ఎంపీలనిచ్చి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని సెటైర్లు పేలుస్తున్నారు. -
24 గంటలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని 24 లక్షల మంది ఓటర్ల మనోగతంతో పాటు దాదాపు నెలన్నరగా తమ రాజకీయ భవితవ్యం ఏమిటని ఎదురుచూస్తున్న వివిధ పార్టీల నేతల ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో అసలు ప్రక్రియ 8.30 గంటలకు మొదలవుతుంది. ప్రతి రౌండులో పది టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫలితం రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల చొప్పున లెక్కింపు నిర్వహిస్తామన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందన్నారు. పోలింగు ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్– సీఆర్సీ) ఓటింగు యంత్రాల లెక్కింపు మాత్రం చివర్లో చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారమే ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు. మెజార్టీ మరీ ఎక్కువగా ఉంటే వీటి లెక్కింపు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఏయే సిబ్బందికి ఏ టేబుల్ వద్ద విధులు కేటాయిస్తారనే విషయం మాత్రం కౌంటింగ్ రోజు అంటే 23వ తేదీ ఉదయం 5 గంటలకు తేలుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఇలా... ఓట్ల లెక్కింపు ప్రక్రియ 23వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ అరగంటలో ఆ ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా 8.30 గంటలకు ఓటింగు యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండుకు సంబంధించిన ఫలితాన్ని ఏజెంట్లకు చూపించి.. వారి ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్వో ప్రకటిస్తారు. ఒక్కో రౌండు ఓట్ల లెక్కింపునకు 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది. జిల్లాలో తక్కువ పోలింగు బూత్‌లు ఉన్న శ్రీశైలం నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. ఇక అధిక బూత్‌లు ఉన్న పాణ్యం నియోజకవర్గ ఫలితం చివర్లో వెలువడనుంది. ఈ ఫలితాలను మాత్రం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదేసి చొప్పున వీవీ ప్యాట్లను తీసి.. లెక్కించిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అధికారికంగా తుది ఫలితం వెలువరించేందుకు సాయంత్రం ఆరు గంటలు కావొచ్చు. 3 వేల మంది సిబ్బంది జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నంద్యాల రోడ్డులోని రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 491, కౌంటింగ్ సూపర్వైజర్లుగా 770 మందిని నియమించారు. వీరితో పాటు ఓట్ల లెక్కింపు సిబ్బంది, సహాయ సిబ్బంది అంతా కలిపి మూడు వేల మంది వరకూ కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. పోలీసు భద్రత విషయానికి వస్తే మూడంచెలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం నుంచి కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. భద్రతాపరంగా వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది 1,200 మంది వరకూ ఉంటారన్నారు. -
కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల నీరందిస్తాం
జానంపేట (పెదవేగి రూరల్) : పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల నీరు సరఫరా చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. గురువారం పెదవేగి మండలం జానంపేట ఆక్విడెక్ట్ వద్ద పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి పరవళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాలో ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా 2015లో 80 టీఎంసీలు, 2016లో 60 టీఎంసీల నీరిచ్చి కృష్టాడెల్టాలోని పంటలను రక్షించామని చెప్పారు. పట్టిసీమ పూర్తైన రెండేళ్లలోనే రూ.8 వేల కోట్ల విలువైన పంటను రైతులు సాగు చేశారని, ఎకరానికి 45 నుంచి 50 బస్తాల పంట దిగుబడి సాధించారని చెప్పారు. పట్టిసీమ నుంచి ప్రస్తుతం విడుదల చేసిన 3,500 క్యూసెక్యుల నీరు కృష్ణాజిల్లాలో ప్రవేశించిందన్నారు. ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలు రావడంతో కృష్ణాడెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సార్వాసాగుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. -
బాలుడి మృతదేహం లభ్యం
గోపాలపురం: గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామంలో పోలవరం కుడి కాలువలో కాలుజారి పడి గల్లంతైన కౌలూరి చరణ్ (11) మృతదేహాన్ని గురువారం గ్రామస్తులు వెలికితీశారు. చరణ్ తన అన్న కల్యాణ్, స్నేహితుడు హేమంత్‌తో కలిసి బుధవారం బహిర్భూమికి వచ్చి ప్రమాదవశాత్తు కాలుజారిపడిన సంగతి తెలిసిందే. పోలవరం కాలువ వద్ద 200 మీటర్ల లోతులో బాలుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించి బయటకు తీసుకువచ్చారు. బాలుడి తల్లి లక్ష్మి, అన్న కల్యాణ్, చెల్లెలు కావ్య మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. భర్త చనిపోయిన ఆరు నెలలకే కొడుకును కూడా కోల్పోవడం లక్ష్మికి తీరని శోకాన్ని మిగిల్చింది. బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎమ్మార్పీఎస్ పోలవరం కుడి కాలువలో నీరు వదులుతున్నట్టు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేదని, నెల రోజులుగా కాలువలో పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు తానేటి స్టీఫెన్, సిర్రా కృష్ణ మాదిగ అన్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు బహిర్భూమికి వెళ్లడంతో చరణ్ మృత్యవాత పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చరణ్ మృతిచెందాడని, బాలుడి కుటుంబసభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై యు.లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మహా స్థూపానికి మహాయజ్ఞం
ఆకివీడు: సాయికోటి నామ లిఖిత మహాయజ్ఞం గురువారం స్థానిక సాయినగర్‌లోని సాయి మందిరంలో వైభవంగా సాగింది. వంద అడుగుల ఎత్తుగల సాయికోటి మహాసూ్థపం దశమి వార్షికోత్సవం సందర్భంగా సాయికోటి నామలిఖిత మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయికోటి పుస్తకాల్ని నిక్షిప్తం చేశారు. వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవిత్రాత్మ స్వరూప సాయి గురు కొపల్లె సూర్యనారాయణ మాట్లాడుతూ సాయిబాబా గురువే కాదు దైవం అన్నారు. ఎంతో మందికి నిజరూపంగా సాయి మహిమల్ని అందించారని చెప్పారు. సుప్రభాత సేవ, నాలుగు హారతులను సాయికి అందజేశారు. ఆలయం వద్ద శాంతి పూజలు, పవిత్రోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ జరిగింది. అఖండ అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం
రాట్నాలకుంట (పెదవేగి రూరల్) : పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,53,459 ఆదాయం లభించింది. గురువారం లెక్కించిన హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఏలూరు డివిజన్ తనిఖీదారి అనురాధ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. రూ.6,93,445 నోట్లు, రూ.60, 014 చిల్లర కాయిన్లు లభించినట్టు సిబ్బంది చెప్పారు. దేవస్థానం చైర్మ¯ŒS రాయల విజయ భాస్కరరావు, ఈవో ఎన్.సతీష్‌కుమార్ పర్యవేక్షించారు. -
పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో తప్పనిసరిగా క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించాలని కలెక్టర్‌కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖా ప్రగతి తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జూన్12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అన్ని పాఠశాలల్లో క్రీడాప్రణాళికలను రూపొందించి పటిష్టవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 29 రిపబ్లిక్ డే సందర్భంగా కచ్చితంగా స్పోర్ట్స్ మీట్స్‌ను నిర్వహించి క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించాలని కలెక్టరు సూచించారు. 600 పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను పాఠశాల టైం టేబుల్లో పొందుపర్చాలని తెలిపారు. జూన్ 12 నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వశిక్షాభియా¯ŒS పీఓ వి.బ్రహ్మానందరెడ్డి, సీఈఓ రూజ్వెల్ట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ ఆర్.గంగాభవాని, ఎస్ఎస్ఏ పీఓ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
తుంపర సేద్యం తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్న దృష్ట్యా ఉద్యాన పంటలకు తుంపర సేద్యం తప్పనిసరి అని, ఎవరైనా డ్రిప్ ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో తుంపర సేద్యంపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరువు జిల్లాలుగా ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా కన్నా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మెట్ట ప్రాంతం వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని షరీఫ్ చెప్పారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే తుంపర సేద్యాన్ని ఉద్యానవన పంటలకు తప్పనిసరి చేయాలని, లేకపోతే నీరులేక పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 45 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి ప్రతి ఎకరాలో డ్రిప్ ఏర్పాటు చేసి తీరాలి్సందేనని, ఈ లక్ష్యాన్ని అధిగవిుంచేందుకు రోజువారీ ప్రగతి నివేదికలను కలెక్టర్ భాస్కర్ సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు అమలు చేస్తున్నారన్నారు. మైక్రో ఇరిగేషన్‌అధికారి రామ్మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన 45 వేల హెక్టార్లలో ఈ ఏడాది కచ్చితంగా బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు సమకరిస్తామని చెప్పారు. ఉద్యాన శాఖ డెప్యూటీ డైరెక్టర్ వైవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ బిందుసేద్యం ద్వారా రైతులు 40 శాతం నుంచి 50 శాతం వరకూ విద్యుత్ ఆదా చేసుకోవచ్చన్నారు. -
నయనానందకరం.. శ్రీ చక్రవార్యుత్సవం
దేవరపల్లి : ద్వారకా తిరుమల శ్రీ వారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత తొళక్కం వాహనంపై విష్ణుమూర్తి అలంకరణలో శ్రీవారి తిరువీధి సేవ క్షేత్ర పురవీధుల్లో వైభవంగా జరిగింది. తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని నిలిపి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య క్షేత్ర పురవీధుల్లో శ్రీ వారు ఊరేగారు. ఆలయ ఆవరణలో శ్రీ చక్ర వార్యుత్సవాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా జరిపారు. శ్రీచక్రవార్యుత్సవం ఇలా.. ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్ర పెరుమాళ్లను ఒకే వేదికపై కొలువయ్యారు. పూజలు జరిపి సుగంథ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీ చందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్థంతో శ్రీ చక్ర స్వామిని అభిషేకించారు. పాలు, పెరుగు, నీరు, తేనె, కొబ్బరి నీళ్లతో ఆలయ అర్చకులు శ్రీచక్రస్వామి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయనాంచారులతో శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, అలంకరించి హారతులను సమర్పించారు. అభిషేక జలాన్ని భక్తులు తమ శిరస్సులపై చల్లుకున్నారు. రాత్రి అశ్వవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ భక్తులకు నేత్ర పర్వమైంది. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. l ఉదయం 9 గంటల నుంచి – అన్నమాచార్య కీర్తనల ఆలాపన l ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం l ఉదయం 10 గంటల నుంచి – హరికథ l సాయంత్రం 6.30 గంటల నుంచి – భక్తిరంజని l రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగం నవనీత కృష్ణుడిగా చినవెంకన్న ద్వారకా తిరుమల క్షేత్ర వాసి చిన వెంకన్న గురువారం నవనీత కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శ్రీ వారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వెన్నను దొంగిలించే నవనీత కృష్ణుడిగా చిన వెంకన్న దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వమైంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. -
ప్రతి పాఠశాలకూ వంట షెడ్లు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేపట్టే 1,559 సివిల్ పనులకు రూ.85.96 కోట్లతో అంచనాలు తయారు చేయాలని విద్యాశాఖాధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు ప్రగతిని కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. రూ.19 కోట్లతో 900 పాఠశాలల్లో వంటషెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, దీంతో ప్రతి పాఠశాలకూ వంట షెడ్లు సమకూరుతాయని కలెక్టర్ చెప్పారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించే నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్స్ సిద్ధం చేయాలని, తాగునీటి సౌకర్యం 100 శాతం పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఎక్కువ పర్సంటేజీలు, ర్యాంకులు రావడం ముఖ్యం కాదని, పిల్లల్లో నీతి నిజాయితీ, కష్టపడి చదివి అత్యధిక మార్కులు సాధించాలన్నదే ముఖ్యమన్నారు. సమావేశంలో డీఈవో ఆర్.గంగాభవాని, సర్వశిక్షా అభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి, డెప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. ఆప్కో ద్వారా కుట్టింపు వద్దు : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల యూనిఫారం ఆప్కో ద్వారా కుట్టించే పద్ధతి వద్దని, క్లాత్ సమకూరిస్తే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో యూనిఫాం కుట్టించుకోవడానికి అవసరమైన క్లాత్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్‌ను కలెక్టర్ కోరారు. -
హానర్ 8 లైట్ లాంచింగ్..రేపే
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 8 లైట్'ను భారత మార్కెట్ లో రేపే (11 మే) విడుదల చేయనుంది. ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలపై పలు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా మూడు రోజుల్లో బిగ్ సర్ప్రైజ్ అంటూ హానర్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ హింట్ తో హానర్ 8 లైట్‌ను గురువారం లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అయితే ఫీచర్లు, ధర, లాంచింగ్ పై కచ్చితమైన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 8 లైట్ ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లో వినియోగదారులకు లభ్యం కానుందని తెలుస్తోంది. అలాగే బ్లూ,గోల్డ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్‌లో ఈ డివైస్‌ను అందుబాటులోకి తేనుంది. ఓన్లీ మొబైల్స్.కాం అందించిన సమాచారం ప్రకారం దీని ధర రూ. 17,999గా నిర్ణయించినట్టు సమాచారం. The big surprise unveils in just 3 days and we can barely curb the excitement! Stay tuned as it’s going to a great one. #LiveLite pic.twitter.com/3e6XsP1L7d — Honor India (@HiHonorIndia) May 9, 2017 -
100 పడకల ఆసుపత్రికి నిధుల్లేవ్
చింతలపూడి : చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో రూ.78.15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భననాలను మాజీ మంత్రి పీతల సుజాతతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాగితాలపైనే 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందన్నారు. తమ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని సమాధానం చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం చింతలపూడి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎనస్తీషియన్, పిడియాట్రిక్ వైద్యులను నియమించాలని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సుజాత మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ తో పాటు, గైనకాలజిస్ట్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ ఎస్.వరలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ టి.కుటుంబరావు పాల్గొన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు కామవరపుకోట : అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కామవరపుకోటలో రూ.68.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీటీసీ సభ్యుడు జి.సుధీర్‌బాబు, మండల పరిషత్ అధ్యక్షురాలు మద్దిపోటి సుబ్బలక్ష్మి, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘డీఎన్నార్’ డిగ్రీ ఫలితాలు విడుదల
భీమవరం : భీమవరం డీఎన్నార్ డిగ్రీ కళాశాలలో పరీక్షా ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గాదిరాజు సత్యనారాయణరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి, నేటి టెక్నాలజీకి అనుగుణంగా తమ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ డిగ్రీ పరీక్షా ఫలితాల్లో బీఏ గ్రూపులో 83 శాతం, బీఎస్సీలో 64 శాతం, బీకాం (జనరల్) 94 శాతం, బీకాం (ఒకేషనల్) 90 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బీఎస్సీలో Ðð జయశ్రీ 91.96 శాతం మార్కులతో ప్రథమస్థానంలో నిలవగా పి.సత్యనాగ శ్రావణి 91.88 శాతంతో ద్వితీయ, వి.నాగప్రసన్న 90.48 శాతం మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించారు. విద్యార్థులకు పరీక్షా పత్రాల రీవాల్యేషన్, ప్రత్యక్ష పరిశీలనకు మే 5వ తేదీ వరకూ అవకాశం ఉందన్నారు. అలాగే మే 8 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు రామకృష్ణంరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎంవీ రఘుపతిరాజు, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అల్లూరి సురేంద్ర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీవీ రామరాజు పాల్గొన్నారు. -
నేడు సీఎం చంద్రబాబు పోతవరం రాక
నల్లజర్ల : స్మార్ట్ విలేజ్‌గా ఎంపికై అభివృద్ధి పనులు పూర్తి చేసిన పోతవరం గ్రామాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైనట్టు కలెక్టర్ భాస్కర్ గురువారం నల్లజర్లలో వెల్లడించారు. జిల్లా అధికారులు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు తదితర ప్రజాప్రతినిధులతో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఎం హెలికాఫ్టర్‌లో పోతవరం చేరుకుంటారు. హెలీప్యాడ్ పక్కనే బలహీనవర్గాల కోసం 6 ఎకరాల భూమిలో జీప్లస్ త్రీ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య నూతన భవనాలు ప్రారంభిస్తారు. అనంతరం పాత్రుని చెరువు అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడే పీహెచ్సీ, నీరు-చెట్టు పైలాన్లను ఆవిష్కరిస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. తదుపరి హైస్కూల్ అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ ప్రారంభించి అక్కడే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. నల్లజర్ల హైస్కూల్లో 15 వేల మందితో నీరు-చెట్టు జలసంరక్షణపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నల్లజర్లలో నల్ల-ఎర్ర చెరువు వద్ద పార్క్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఏకేఆర్జీ కళాశాల పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి రాజధానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎంపీపీ జమ్ముల సతీష్, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, పోతవరం, నల్లజర్ల సర్పంచ్‌లు పసుమర్తి రతీష్, యలమాటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అమ్మ ఒడి ప్రచార రథం ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలకు అందిస్తోన్న పథకాలను గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు అమ్మ ఒడి ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. ఈ మేరకు గురువారం ఏలూరులో జెండా ఊపి ప్రచారరథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందరికీ విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు భవితా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రచార రథం జిల్లాలో జూన్ 30వ తేదీ వరకు గ్రామాల్లో తిరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కళాజాతాల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ సీఎంవో టీటీఎఫ్ రూజ్వెల్ట్, ఏపీవో పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
ఎంసెట్-17ను పటిష్టంగా నిర్వహించాలి
ఏలూరు సిటీ : ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-17 ఆన్లైన్ పరీక్షలను అత్యంత పటిష్టవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలను ఏలూరు పరీక్షా కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కావటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోని ఎంసెట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో తొలిసారి ఆన్లైన్లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లోని భయాన్ని, ఆందోళనను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ ఆన్లైన్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన మోడల్ నీట్ పరీక్షకు 5 డివిజన్లలలో 12 పరీక్షా కేంద్రాల్లో 900 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ మేకా అమరావతి, అధ్యాపకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్.మోహన్ ఉన్నారు. -
మూడు తాటాకిళ్లు దగ్ధం
భీమలాపురం (ఆచంట) : గ్రామంలో గురువారం గుడాల నాగమణి, గుడాల సుబ్బారావు, గుడాల చిన సత్యనారాయణకు చెందిన మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు చెప్పారు. నాగమణి ఇంట్లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. నాగమణి కొద్ది కాలం క్రితం తన ఇంటిని కొబ్బరి కాయల వ్యాపారి సత్యనారాయణకు అద్దెకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయనకు చెందిన సుమారు రెండు లక్షల విలువైన కొబ్బరి కాయలు దగ్ధమయ్యాయి. పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను సర్పంచ్ చింతపర్తి సత్యనారాయణ, ఆర్ఐ సన్నిబాబు, వీఆర్వో నరసింహరావు పరామర్శించారు. -
లారీల సమ్మె సడలింపు
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో లారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై లారీ యజమానుల సంఘ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో గురువారం రాత్రి నుంచి లారీలు రోడ్లపైకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలపై ఇంకా పరిష్కారం లభించలేదు. దీంతో పక్క రాష్ట్రాలకు లారీలను నడిపే అవకాశాలు లేకుండా పోయింది. ఈ మేరకు రాష్ట్రంలో లారీలు తిరగవచ్చనే సమాచారాన్ని రాష్ట్ర అసోసియేషన్‌కార్యదర్శి జిల్లాలోని అసోసియేషన్ బాధ్యులకు గురువారం సాయంత్రం సమాచారం పంపించారు. దీంతో రహదార్లపైకి లారీలు రావడానికి మార్గం సుగమమైంది. శుక్రవారం నుంచి గురువారం వరకు జిల్లాలో లారీలు తిరగనందువల్ల సుమారు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపు 5 వేల లారీలు ఉండగా వారం రోజులుగా నిలిచిపోయాయి. వేలాది కుటుంబాలు ఆదాయం లేక విలవిల్లాడాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిశ్రమపై నిరవధిక సమ్మె తీవ్ర ప్రభావం చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం దొరికిందని గూడెం లారీ అసోసియేషన్‌నాయకుడు గురుజు సూరిబాబు అన్నారు. -
ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష
నింగి.. నేల..గాలి.. నీరు.. నిప్పు.. వీటినే పంచభూతాలంటారు. ఇవే మానవాళికి జననంతోపాటు జీవనాన్నీ ఇస్తాయంటారు. వీటిలో ఒకటైన గాలి కాలుష్య రక్కసి బారిన పడింది. ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ తప్పు ప్రకృతిది కాదు. స్వార్థం కోసం.. సంపాదన కోసం కార్పొరేట్ శక్తులు పంచభూతాలను నాశనం చేస్తుంటే.. పట్టించుకోవాలి్సన, ప్రజల ప్రాణాలను పరిరక్షించాలి్సన ప్రభుత్వాలు బాధ్యత మరిచిపోతే.. ఎంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయో మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ ఉదంతం రుజువు చేసింది. అక్కడి రొయ్యల శుద్ధి పరిశ్రమలోని ట్యాంకులో నిల్వ చేసిన వ్యర్థాల నుంచి వెలువడిన విష వాయువులు ఐదుగురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. 30 టన్నుల సామర్థ్యం గల చిన్నపాటి పరిశ్రమ నుంచి వెలువడిన కాలుష్యమే ఇంతమందిని బలిగొంటే.. తుందుర్రులో ఇంతకు వంద రెట్ల సామర్థ్యంతో అదే యాజమాన్యం నిర్మిస్తున్న ఆక్వా పార్క్ పూర్తయితే ఎంతటి విపత్తు ముంచుకొస్తుందోననే ఆందోళన డెల్టాలో నెలకొంది. నరసాపురం : జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. తుపానులు, వరదలు, పడవ ప్రమాదాలు వంటి వైపరీత్యాలతో అక్కడ ఎప్పుడూ అలజడి నెలకొని ఉంటుంది. ఎంతటి కష్టమొచ్చినా లెక్కచేయని మొండిధైర్యం తీరగ్రామాల వారిది. గురువారం మొగల్తూరులో చోటుచేసుకున్న విషాద ఘటన వారిని భయాందోనకు గురి చేసింది. నల్లంవారి తోటలో ఆక్వా ప్లాంట్ సిమెంట్ ట్యాంకు నుంచి వెలువడిన విషవాయువు ఎంతో భవిష్యత్ ఉన్న ముగ్గురు యువకుల్ని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) మృత్యువాత పడ్డారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు దినసరి కూలీలుగా వీరంతా సిద్ధమయ్యారు. ఉదయం 8గంటల సమయంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియక మొగల్తూరు కట్టుకాలువ ప్రాంతానికి చెందిన తోట శ్రీని వాస్, నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) దిగారు. వాళ్లిద్దరూ కూడా బయటకు రాలేదు. చివరకు మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్, మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ట్యాంకులో దిగిన వారు కనీసం తమకు ఆపద వచ్చిందనే విషయాన్ని సైతం బయటకు చెప్పుకునే వీలుకూడా లేకుండాపోయింది. ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేనంత భయాన్ని నింపింది. కాలుష్య భూతానికి ఐదుగురు మరణించారని తెలియగానే తీరగ్రామాల ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్న రొయ్యల ఫ్యాక్టరీతో ఇంత ప్రమాదం వచ్చిందని తెలిసి అవాక్కయ్యారు. అంతా ఒక్కటై ఆందోళన చేపట్టారు. మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌ను వెంటనే తొలగించాలని, తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. ‘ఇంత చిన్న ఫ్యాక్టరీ వల్లే ఇంతటి విపత్తు తలెత్తింది. తుందుర్రు లాంటి పెద్ద ఫ్యాక్టరీ వినియోగంలోకి తెస్తే వందలాది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శల పేరుతో వచ్చిన అధికార పార్టీ నేతలను నిలదీశారు. బాధ, ఆవేదన నడుమ శాపనార్థాలు పెట్టారు. ‘ఎంత ఘోరం జరిగిందో చూశారా. ఇకనైనా కళ్లు తెరిచి తుందుర్రు ఫ్యాక్టరీ మూయించండి’ మహాప్రభో అని వేడుకున్నారు. ఇదిలావుంటే.. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు అక్కడి నుంచి ఉడాయించారు. ప్లాంట్‌లో మిగిలిన ఉన్న ఉద్యోగులను పోలీసులు బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యా యి. బాధితులను పలకరించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులను వెళ్లిపొమ్మంటూ నినాదాలు చేశారు. తీరగ్రామాల్లో భయం భయం ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేని భయాన్ని నింపింది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అక్కడి ప్రజలు కాలుష్య భూతానికి ఐదుగురు మరణించారని తెలియగానే అక్కడి ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నా.. కాలుష్య కారకమైన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఏడాదిన్నరగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి సహా సమీప 40 గ్రామాల ప్రజలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం వారిని జైళ్లపాలు చేసింది. లాఠీలతో కొట్టించింది. చంటిబిడ్డలను సైతం ఇళ్లల్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంది. ఇదే సందర్భంలో నల్లంవారి తోటలోని ఆక్వా ప్లాంట్ కాలుష్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని మూసివేయాలంటూ అక్కడి ప్రజలు సైతం గతంలో ఆందోళన చేశారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామని, కాలుష్యాన్ని గొంతేరు డ్రెయిన్ లోకి వదలబోమని నమ్మించింది. అయితే, సిమెంట్ తొట్టె కట్టి.. దానికి రేకులు బిగించి కాలుష్యకారక వ్యర్థాలను, రసాయనాలు కలిసిన జలాలను అందులోకి వదులుతోంది. 15 రోజులకు ఒకసారి తిరిగి నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపేస్తూ జనాన్ని మోసగిస్తోంది. కలెక్టర్‌ను నిలదీసిన జనం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కరభూషణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు, మృతుల బంధువులు కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను ఎవరు తెచ్చి ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఐదుగురి ప్రాణాలు పోయాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటామనడం దారుణమంటూ విరుచుకుపడ్డారు. కాలుష్యంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే అధికారులంతా ఏం చేశారని, ముందే స్పందించి ఉంటే ఐదుగురి ప్రాణాలు దక్కేవంటూ అధికారులు, ప్రజాప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. శవాలను తరలిస్తున్న అంబులెన్స్ లకు అడ్డుగా పడుకున్నారు. వ్యాన్లను వెళ్లకుండా దారిలో కొబ్బరి దుంగలతో మంటలు పెట్టారు. విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అడ్డంగా పడేశారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు అక్కడివారిని చెదరగొట్టారు. ‘మేమంతా బాధలో ఉండి.. న్యాయం అడుగుతుంటే మమ్మల్నే కొడతారా’ అంటూ జనం పోలీసులపై తిరగబడ్డారు. ఆక్వా ప్లాంట్ సీజ్ ఇదిలా ఉండగా నల్లంవారి తోటలోనే ఆనంద ఆక్వా ప్లాంట్‌ను సీజ్ చేసినట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత నరసాపురంలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న యువకుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. అన్నయ్యపాత్రుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎస్పీ భాస్కరభూషణ్ మాట్లాడుతూ 304 ఏ సెక్షన్‌కింద ప్లాంట్ యజమానులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు. ప్లాంట్ నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షించే ఆ సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై కూడా చర్యలుంటాయని అన్నారు. -
మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ
ఏలూరు అర్బన్ : మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తులు సమర్పించడంతో పాటు వెరిఫికేషన్‌కు కూడా గురువారం ఆఖరిరోజు కావడంతో మద్యం వ్యాపారులు భారీగా తరలివచ్చారు. దాంతో స్థానిక అశోక్‌నగర్ ప్రాంతం సందడిగా మారి జాతరను తలపించింది. రద్దీని ముందుగానే అంచనా వేసిన డెప్యూటీ కమిషనర్ దరఖాస్తుల స్వీకారానికి వచ్చిన వ్యాపారులకు ఎంట్రీ పాస్‌లు ఇవ్వడం ద్వారా హడావుడి పడకుండా వ్యాపారులు తమకు ముందుగా నిర్ణయించిన సమయానికి డీసీ కార్యాలయానికి వచ్చి తమకు కేటాయించిన స్టాళ్లలో దరఖాస్తులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, భీమవరం యూనిట్ల పరిధిలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 474 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సాయంకాలం 6.30 వరకూ తమకు 8,485 దరఖాస్తులు అందాయన్నారు. ఈ దరఖాస్తుల ద్వారా తమ శాఖకు రూ.39 కోట్లకు పైబడి ఆదాయం సమకూరిందన్నారు. రాత్రి 8 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించి వెరిఫికేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం శుక్రవారం స్థానిక మినీ బైపాస్ రోడ్దులోని శ్రీ కన్వెన్షన్ హాలులో మద్యం దుకాణాలకు సంబంధించి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు. -
చైన్‌స్నాచర్ల చేతివాటం
రాజంపేట టౌన్: బలిజపల్లె గంగమ్మ జాతరకు గురువారం భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారు పూలరథంలో ఊరేగుతూ వచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. ఆ సమయంలో దాదాపు ఐదుగురి మహిళల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. అర్బన్ సీఐ అశోక్‌కుమార్, సీఐ జాతరకు రెండు రోజుల ముందే జాతరలో బంగారు నగలు ధరించిన వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే అనేక మంది బంగారు నగలు ఎక్కువగా ధరించి రావడం, భక్తులు తాకిడి అ«ధికంగా ఉండటం దీనికితోడు భక్తులు బంగారు నగల పట్ల అప్రమత్తంగా లేక పోవడంతో చైన్‌స్నాచర్ల పని సులువైంది. ఇదిలావుంటే పిక్ప్యాకెటర్లు కూడా తమ చేతివాటాన్ని చూపి అనేక మంది పర్సులను దొంగలించినట్లు సమాచారం. -
దొంగ దొరికాడు
జంగారెడ్డిగూడెం: చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన ఇంగోలి రమేష్ పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో అతనిపై కేసులు ఉన్నాయి. ఇటీవల స్థానిక గరుడపక్షినగర్లోని ఓ ఇంట్లో వెండి వస్తువులు, హోం థియేటర్‌కు సంబంధించిన పరికరాలు చోరీ చేశారు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం స్థానిక వారపు సంత సమీపంలో రమేష్‌ను అరెస్ట్ చేసి 250 గ్రాముల వెండి వస్తువులు, హోం థియేటర్ పరికరాలు రికవరీ చేశారు. అతడిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. -
పట్టపగలే దారుణ హత్య
ఏలూరు రూరల్, ఏలూరు అర్బన్: ఏలూరు మండలం గుడివాకలంక మాజీ సర్పంచ్ జయమంగళ భద్రగిరిస్వామి హత్యకు గురయ్యారు. ఏలూరు మండల పరిషత్ ప్రాంగణంలో పదుల సంఖ్యలో ప్రజల సమక్షంలోనే అపరిచిత వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో పీఆర్ఏఈతో మాట్లాడి బయటకు వస్తుండగా భద్రగిరిస్వామిని ఓ వ్యక్తి పలకరించాడు. ‘మీతో మాట్లాడాలి రండి’ అంటూ భుజంపై చేయి వేసి పక్కకు తీసుకెళ్లాడు. సుమారు పది అడుగుల దూరం వెళ్లగానే కత్తి తీసి భద్రగిరిస్వామి మెడ, గొంతు భాగంలో పొడిచాడు. అగంతకుడు నుంచి విడిపించుకోవడానికి భద్రగిరిస్వామి ప్రయత్నించగా మరికొన్ని కత్తిపోట్లు పొడిచాడు. వీరిద్దరి పెనుగులాట చూసిన గుడివాకలంక గ్రామానికి చెందిన జయమంగళ నాగరాజు అనే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అగంతకుడు మోటార్‌సైకిల్‌పై పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో నేలపై కొట్టుకుంటున్న భద్రగిరిస్వామిని అక్కడే ఉన్న కొల్లేరు పెద్దలు, నాయకులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించి పోస్టుమార్టంకు తరలించారు. భద్రగిరిస్వామి భార్య వెంకటరమణ ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ఆస్పత్రి ప్రాంగణం వద్ద మృతుని బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఉలిక్కిపడ్డ కొల్లేరు గ్రామాలు భద్రగిరిస్వామి హత్యతో కొల్లేరు గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లంకగ్రామాల ప్రజలు పెద్దెత్తున ఆస్పత్రికి వచ్చారు. ఏఎస్పీ వలిసల రత్న, డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ ఉడతా బంగార్రాజు, ఎన్.రాజశేఖర్ మృతుని కుటుంబభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ కొల్లేరు గ్రామాల ప్రజలు కొద్దిసేపు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద ఆందోళన చేశారు. వ్యక్తిగత కక్షా.. చెరువు తగాదానా..! హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కక్ష లేదా చేపల చెరువు వివాదాలు హత్యకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఓ ప్రమాదంలో భద్రగిరిస్వామి నిందితుడుగా ఉన్నారు. అప్పట్లో వివాహానికి వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి భద్రగిరిస్వామి వ్యాన్‌లో వస్తూ కొక్కిరాయిలంక వంతెన వద్ద వాడపల్లి భాస్కరరాజు అనే వ్యక్తిని ఢీకొట్టారు. ఈ ప్రమాదం తర్వాత భద్రగిరిస్వామి అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరిద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే తర్వాత భాస్కరరాజు కుమారులతో భద్రగిరిస్వామి రాజీయత్నాలు చేసినట్టు తెలిసింది. దీనిలో భాగంగా పెద్ద మొత్తంలో నష్టపరిహారం సైతం చెల్లించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దీనిని భాస్కరరాజు కుటుంబం నిరాకరించినట్టు తెలిసింది. కొద్దికాలం తర్వాత భద్రగిరిస్వామిని సైతం పోలీసులు ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. వీటితో పాటు ఇటీవల కాలంలో పలు చేపల చెరువుల తగాదాలకు భద్రగిరిస్వామి పెద్దరికం వహించినట్టు భోగట్టా. -
క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి (క్షీరారామం) ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మూడు నెలలకు రూ.7,93,807 నగదు, మూడు విదేశీ నోట్లు లభించాయని అధికారులు తెలిపారు. ఆచంట రామేశ్వరస్వామి దేవస్థానం ఈవో కృష్ణంరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, కె.శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఏలూరు సిటీ : పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక ధృక్పథాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు రాసే సమయంలో వార్తకు సంబంధించిన విషయంపై పూర్తి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత్రికేయులు వృత్తి ప్రమాణాలు, విలువలు పాటించాలని కోరారు. మాతృభాషతో పాటు ఆంగ్లంపై కూడా కొంత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రెస్ అకాడమీ హైదరాబాద్‌లో కొనసాగుతుందని త్వరలో అమరావతి రాజధానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిర్భయంగా వార్తలు రాయాలని, ఏది రాయకూడదో విలేకరులు తెలుసుకోవాలన్నారు. డెవలప్మెంట్ జర్నలిజంపై ఆయన మాట్లాడుతూ డెవలప్మెంట్ జర్నలిజం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూపిస్తూ వార్తలను రాయడం ఒక్కటే కాదని అలాంటివార్తలతో పాటు ప్రత్యేకమైన లక్ష్యంతో వార్తలు రాసి ప్రజోపయోగమైన అభివృద్ధి తీసుకురావాలన్నారు. 13 జిల్లాల్లో పాత్రికేయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి డి.శ్రీనివాసులు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం ఉన్నారు. ప్రెస్ ఆకాడమీ చైర్మన్ కలిసిన ఏపీజేఎఫ్ నాయకులు ఏపీ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ వి.వాసుదేవ దీక్షితులను స్థానిక జెడ్పీ అతిథిగృహంలో ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.సీతారామరాజు ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో ప్రెస్ అకాడమీకి సకల సౌకర్యాలతో భవనాన్ని సిద్ధం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని దీక్షితులు చెప్పారు. ఈ సందర్భంగా దీక్షితులను సంఘ జిల్లా అధ్యక్షుడు సీతారామరాజు సత్కరించారు. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ ఏలూరు శాఖ అధ్యక్షుడు వి.మధుసూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎస్.సంజయ్‌కుమార్, కోశాధికారి ఉర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
శిలావిగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
తాళ్లపూడి : ప్రక్కిలంకలో బయటపడిన శిలా విగ్రహాన్ని పురావస్తుశాఖకు చెందిన అధికారులు గురువారం పరిశీలించారు. కాకినాడ పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వెంకట రత్నం, రాజమహేంద్రవరం మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ ఎస్.వెంకటరావు విగ్రహాన్ని పరిశీలించి కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ 100 ఏళ్లుగా పూజలు చేస్తున్న మావుళ్ల విగ్రహం 15, 16వ దశాబ్దానికి చెందినదన్నారు. పులి ఉందని దుర్గమ్మగా పూర్వికులు పూజలు చేసి ఉంటారన్నారు. విగ్రహాన్ని ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠ చేయనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. వచ్చే నెలలో జాతర చేయనున్నారు. అధికారుల వెంట బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ముళ్ల మల్లిబాబు, ఉప సర్పంచ్ సుంకర గంగరాజు, యాళ్ల బాబురావు తదితరులు ఉన్నారు. -
ముత్యాలమ్మ హుండీ ఆదాయం రూ.10.84 లక్షలు
మొగల్తూరు: మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 67 రోజులకు రూ.10,84,641 నగదు, 11 గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారం, 129 గ్రాముల వెండి, ఐదు విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, చైర్మన్ దాసరి అమ్మాజీ బాబి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఉత్పత్తులతోనే మేక్ ఇన్ ఇండియా
తణుకు టౌన్: నాణ్యమైన వస్తు ఉత్పత్తుల ద్వారానే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాగా అవుతుందని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్ ఆర్.సుదర్శనరావు అన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మేక్ ఇన్ ఇండియా ఉపాధి అవకాశాలు–సవాళ్లు’ అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సులో రెండో రోజు గురువారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సరళీకరణ విధానాలతో ఉత్పాదక రంగం అభివృద్ధి చెందడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన అన్నారు. ఇందుకు వ్యవసాయ రంగంలో వాటా కూడా పెరగాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక రంగంలో ప్రోత్సాహం లభించినా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడే మేక్ ఇండియా సవాళ్లను ఎదుర్కొనగలమని చెప్పారు. ఎస్డీ కళాశాల డైరెక్టర్ జె.చంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనిదే మేక్ ఇన్ ఇండియా సాధ్యం కాదన్నారు. విదేశీ పెట్టుబడులతో సందేహస్పదమే.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ చీఫ్ ఎడిటర్ పీవీ రమణ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో 1947 నుంచి 2016 వరకూ ఎంత వృద్ధి సాధించామని పరిగణనలోకి తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులతో మేడ్ ఇన్ ఇండియా సాధిస్తామనేది సందేహస్పదమేనన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కన్వీనర్ కె.రాధాపుష్పావతి, కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, బి.నాగపద్మావతి, రాజులపూడి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లిన రాజేంద్రప్రసాద్, ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, యూనివర్సిటీలకు చెందిన రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు -
కుంభకోణాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని కామవరపకోట కేంద్రంగా అధికార పార్టీ నేతలు మొక్కలు పాతకుండానే, వేసినట్టు చూపి రూ. 3 కోట్ల వరకు అక్రమానికి పాల్పడిన వైనంపై గత నెలలో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ మరోమారు స్పందించారు. ఇటీవల ఉద్యానవన శాఖలో జరిగిన కుంభకోణంపై కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ భాస్కర్ స్పందిస్తూ ప్రభుత్వ నిధులు స్వాహా చేసినా, కుంభకోణాలకు పాల్పడినా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని ఆయన స్పష్టం చేశారు. కుంభకోణాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఉద్యానవన శాఖకు రూ.32 కోట్లు నిధులు కేటాయిస్తే రూ.13 కోట్లు నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టారని, చేసిన ఖర్చుల్లో కూడా పంటలు లేకపోయినా, ఉన్నట్లు రికార్డులు చూపించి కామవరపుకోట మండలంలో ఉద్యానవనశాఖ అధికారులు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని దోషులు ఏ స్థాయిలో ఉన్నా జైలుకు పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులకు చెందాల్సిన సబ్సిడీ సొమ్మును దళారుల చేతుల్లోకి మళ్లిస్తే సహించబోమని కలెక్టర్ చెప్పారు. ప్రతివారం పలు శాఖల ప్రగతి తీరును సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 32 కోట్లు బడ్జెట్ కేటాయించగా గురువారం నాటికి రూ. 13 కోట్లు ఖర్చు చేయలేమంటూ నిధులను ఎందుకు మురగబెట్టారని కలెక్టర్ ప్రశ్నించారు. నిధులు మురుగుపోకుండా ఉద్యానవనశాఖ కమిషనర్‌తో కలెక్టర్ ఫోన్లో చర్చించి రాబోయే 20 రోజుల్లో కనీసం రూ. 4 కోట్లు నిధుల వినియోగం జరిగేలా తగిన అనుమతులు ఇచ్చామన్నారు. 500 ఎకరాల్లో మల్బరీ తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించగా 370 ఎకరాలు మాత్రమే పూర్తి చేసి చేతులెత్తేసిన సెరీకల్చర్ డీడీని సెలవుపై వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సకాలంలో అందించడానికి ప్రయత్నించి రైతుల అభిమానాన్ని పొందాలే తప్ప ఏ రైతు లంచం ఇస్తాడు ? ఆ సొమ్ము తీసుకుంటామా? అనే ఆలోచన వదిలిపెట్టి నిజమైన పేద రైతులకు లబ్ది చేకూర్చాలని ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ ఎంహెచ్. షరీఫ్ పాల్గొన్నారు. -
మంటలు రేపిన ప్రమాదం
తాడేపల్లిగూడెం రూరల్ : ఐషర్ వ్యాన్‌ను మారుతీ ఆల్టో కారు ఢీకొన్న ఘటన గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం నవాబ్‌పాలెం కొత్త వంతెనపై జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు దగ్ధమవగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీ 05, 7381 నంబర్ మారుతీ కారు రాజమహేంద్రవరం నుంచి చెన్నై వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఇంధన ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా రెండు వాహనాల నుంచి మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన వ్యాన్ డ్రైవర్ దిగిపోగా, కారులో ఉన్న ఇద్దరూ పొగ కారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ కారు అద్దాలు పగులకొట్టి డోరు తీసి వారిని కాపాడారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఒక మహిళ, కారు యజమాని ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కారుకు మంటలు వ్యాపించి వాహనం దగ్ధమైంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. -
అభయమిచ్చిన ఆదిలక్ష్మి
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మావుళ్లమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ 53వ వార్షికోత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. ఈ దృష్ట్యా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అభయమిచ్చే ఆదిలక్ష్మి రూపంలో ఒదిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొక్కులు తీర్చుకుని తరించారు. -
నిరుద్యోగం, అవినీతి పెనుసవాళ్లు
ఏలూరు సిటీ : ప్రపంచంలోనే భారతదేశానిది ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మన దేశానికి నిరుద్యోగం, అవినీతి పెను సవాళ్లని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్యఎం.ముత్యాలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సీఆర్ఆర్ కళాశాల డిగ్రీ, పీజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సులో ముఖ్యఅతిథిగా వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ విద్యాబోధనలో గురువు పాత్ర కీలకమైందని, నేటి సమాజంలో యువత సరైన మార్గంలో పయనించాలంటే గురువులే మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన సీఆర్ఆర్ విద్యాసంస్థల పాలక మండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సదస్సుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రధాన వక్త మధ్యప్రదేశ్ ఇండోర్ ఓరియంటల్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో ఉత్పాదక రంగానికి ప్రాధాన్యం పెరగాలని సూచించారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.వెంకయ్య, కెనడా దేశం ఒట్టావా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఏవీఎస్ రావు, నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటువంటి జాతీయస్థాయి సదస్సులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సదస్సులో సీఆర్ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ ఎన్వీకే దుర్గారావు, డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ యూఎస్ రామప్రసాద్, ప్రిన్సిపాల్ ఎన్.వీర్రాజు చౌదరి, కరస్పాండెంట్లు వి.రఘుకుమార్, కె.వి.లక్షీ్మనారాయణ, చలసాని విశ్వనా«థరావు, పీజీ డైరెక్టర్ సి.అరుణకుమారి, సదస్సు కన్వీనర్ ఆర్.రఘు, కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి ఏ.విజయకుమార్, అధ్యాపకులు వై.సౌజన్య, జి.వి.జగపతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు -
షేల్ గ్యాస్ ఉత్పత్తి వద్దు
వీరవాసరం : ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసే షేల్ గ్యాస్ ఉత్పత్తి వద్దని మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ కోరారు. వీరవాసరం మండలం అండలూరులో ఓఎన్జీసీ షేల్‌గ్యాస్ వెలికితీసే ప్రాంతాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షేల్ గ్యాస్ చమురు ఉత్పత్తికి హైడ్రో ఫ్రాకింగ్ అనే ప్రక్రియను వాడతారని ఈ ప్రక్రియలో లక్షల కొద్దీ లీటర్ల నీటితో పాటు 700కు పైగా రసాయనాలు కలిపి భూములోకి పంప్చేస్తారన్నారు. వ్యర్థాలతో పాటు బయటకు వచ్చిన నీటిలో అనేక హానికారక రసాయనాలు ఉంటాయని, ఇది జీవనానికి పెను ప్రమాదమని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధన వరులైన సౌరశక్తి, పవనశక్తి వాటిపై దృష్టి పెట్టకుండా ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయన్నారు. షేల్ గ్యాస్ ఉత్పత్తి వల్ల వచ్చే లాభం కంటే ఈ నష్టాలే ఎక్కువని ఫ్రాన్స్ , బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు ఈ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించాయన్నారు. షేల్ గ్యాస్ ఉత్పత్తిలో వెలువడే మీథేన్వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే అనేక రెట్లు ప్రమాదకరమైందని, దీనివల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గర్భస్రావాలు, పుట్టుకలో లోపాలు, క్యాన్సర్ వ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉందని అన్నారు. పర్యావరణ చట్టాలను కాదని షేల్ గ్యాస్ ఉత్పత్తికి పాల్పడ్డటం సరైన చర్య కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అండలూరు, కోలనపల్లి ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తున్న షేల్ గ్యాస్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖకు వినతిపత్రం అందించాలని ఆయన తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు బొల్లెంపల్లి శ్రీనివాస చౌదరి, మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఎ.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తానేటి ఆనందరావు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.135 కోట్లతో రాష్ట్రంలో లింకు రోడ్లు
చింతలపూడి : రాష్ట్రంలో రూ.135 కోట్లతో లింకు రోడ్డు పనులు చేపడుతున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. చింతలపూడిలో నిర్మాణంలో ఉన్న రైతుబజార్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లింకురోడ్లకు ఖర్చు చేస్తున్న నిధుల్లో రూ.69 కోట్లు మార్కెటింగ్ శాఖకు చెందినవి కాగా, రూ.66 కోట్లు ఉపాధిహామీ నిధుల నుంచి ఖర్చుచేస్తున్నామన్నారు. ఫారం టు హోమ్ అనే కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాలకు రైతులు నేరుగా తమ పంటలను ఎగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో మార్కెట్ కమిటీకి లక్ష రూపాయల చొప్పున కేటాయించి, ఏడాదికి 5 చొప్పన పశువైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 రైతుబజార్లు ఉన్నాయని, మరో 20 రైతుబజార్లు 3 నెలల్లోగా పూర్తవుతాయని అదనంగా మరో 10 రైతు బజార్లను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. చింతలపూడి రైతు బజారు నిర్మాణం 10 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. ఆయన వెంట చిన్నంశెట్టి సీతారామయ్య, మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు ఉన్నారు. -
లారీ ఢీ కొని యువకుడి మృతి
కానూరు (పెరవలి) : అతివేగంగా వచ్చిన లారీ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు పట్టణానికి చెందిన బిరుదుకోట సత్యనారాయణ (30) పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళుతున్నారు. కానూరు సమీపంలోకి వచ్చే సరికి పెరవలి వైపు నుంచి నిడదవోలు వైపు వెళుతున్న క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌పై నుంచి సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థాని కులు 108కి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి క్షతగాత్రుడిని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రిలో వైద్యం అందించే లోపే సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయాడు. సత్యనారాయణ అవివాహితుడు. అతడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్ ఢీకొని ... ఏలూరు అర్బన్ : స్థానిక పాత బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన షేక్ చినమెహబూబ్ అలియాస్ చినబాబు (30) నౌబత్ ఖానా వాద్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనులపై గురువారం ఏలూరు వచ్చిన అతడు పనులు ముగించుకుని పాత బస్టాండ్ సమీపంలో జీఎన్టీ రోడ్డును దాటే క్రమంలో గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్ వేగంగా ఢీ కొట్టింది. బస్ చినబాబు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. టూటౌన్ ఎస్సై అల్లు దుర్గారావు స్థానికులను విచారించారు. మృతుడి ఆచూకీ సేకరించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. -
మూడు గ్రామాల్లో వరుస చోరీలు
యలమంచిలిలంక (యలమంచిలి) : యలమంచిలిలంక, శిరగాలపల్లి, మేడపాడు గ్రామాలలో గురువారం రాత్రి వరుస చోరీలు జరిగాయి. యలమంచిలిలంకలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి విగ్రహానికి ఉన్న వెండి కన్ను, బొట్టును దుండగులు పెకిలించారు. వాటిని తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు. గుడిలోని సుమారు రూ.4 వేల విలువైన పంచలోహ పాత్రతోపాటు, రూ.2 వేలు చిల్లర పట్టుకుపోయారు. శిరగాలపల్లిలోని షిర్డీ సాయిబాబా మందిరంలోనూ డిబ్బీ పట్టుకుపోయారు. డిబ్బీలోని డబ్బులు తీసుకుని దానిని పక్కనే ఉన్న వరిచేలో పడవేశారు. శిరగాలపల్లిలోని ఓ కొబ్బరికాయల కొట్టులో బీరువా తాళాలు పగులగొట్టారు. బీరువాలో నగదు లేకపోవడంతో వెళ్లిపోయారు. పక్కనే ఉన్న బెల్టు షాపులో మద్యం సీసాలను పట్టుకుపోయారు. మేడపాడులో ఒక కోళ్ల దుకాణంలోని గల్లా పెట్టెను పగులకొట్టి దానిలో ఉన్న చిల్లర తీసుకెళ్లారు. ఇవన్నీ ఒకే దొంగలముఠా చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు గ్రామాల్లో వరుసగా చోరీలు జరగడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఎస్సై పాలవలస అప్పారావు ఘటనా స్థలాలను పరిశీలించారు. -
నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
జంగారెడ్డిగూడెం : కానిస్టేబుల్‌నని చెబుతూ బంగారు వస్తువులు లాక్కుపోయే ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎం.కేశవరావు కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన దంగేటి నాగదుర్గారావు కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలో ఉంటున్నాడు. అతను డిసెంబర్ 7న, ఈనెల 16న గోకుల తిరుమల పారిజాతగిరికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కానిస్టేబుల్‌నని చెప్పి బంగారు వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలని సూచించాడు. అతని సూచన మేరకు వస్తువులు చేతితో పట్టుకున్న విద్యార్థుల నుంచి వాటిని లాక్కుని పరారయ్యాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. దుర్గారావు వద్ద నుంచి చెవిదిద్దుల జత స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతను ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టిన బంగారు ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాపీ పనిచేస్తూ జీవించే దుర్గారావుకు ఇద్దరు భార్యలు. రెండు కుటుంబాలను పోషించలేకే అతను చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్సై కేశవరావు తెలిపారు. ∙ -
ఆకట్టుకున్న సీతారామరాజు నాటికం
భీమవరం (ప్రకాశం చౌక్) : స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు భక్తులను అకట్టుకుంటున్నాయి. గురువారం ఆలయం వద్ద సూర్యోదయ ఆర్ట్స్ భీమవరం వారు ప్రదర్శించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చారిత్రాత్మక నాటిక భక్తులను విశేషంగా అలరించింది. అలాగే నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ ఎం.అర్జునరావు హైదరాబాద్ వారు ప్రదర్శించిన సీతారామ కల్యాణం భక్తి నాటకం అకట్టుకుంది. -
పోలియోపై యుద్ధం కొనసాగిద్దాం
ఏలూరు అర్బన్: ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. గురువారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో డీఎంహెచ్‌వో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాన్ని పోలియోరహితంగా ప్రకటించినా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు విడతల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా జనవరిలో మూడు రోజులు ఏప్రిల్ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమం జయప్రదం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 3,99,000 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు అన్నిస్థాయిల అధికారులు, సిబ్బంది కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ డి.మోహనరావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మిస్బా హని, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్. కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. -
‘భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ
పాలకొల్లు సెంట్రల్ : మీరు ఆరోగ్యంగా ఉంటారు.. ప్రతి రోజూ వాకింగ్ చేయండి అంటే చాలామంది బద్ధకిస్తున్నారు. అటువంటిది భారతీయ ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేస్తూ పాదయాత్ర చేయడం అభినందనీయమని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ డా.బాబ్జి అన్నారు. గురువారం స్థానిక ముచ్చర్ల శ్రీరామ్ అతిథిగృహంలో రచయిత, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ ’భూభ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ దేశం విశిష్టతను తెలియపర్చడానికి ప్రపంచంలో 14 దేశాల్లో 35 వేల కిలోమీటర్లు నడవడం సామాన్య విషయం కాదన్నారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ అన్నీ తెలుçసు అనుకునేకన్నా అనుభవించడం ద్వారా నిజమైన వాస్తవాలను తెలుసుకోగలమన్నారు. పాదయాత్రలో అనేక విషయాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందరికీ పరిచయం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ సహస్రావధాని, డాక్టర్ రెడ్డప్ప ధవేజీ, వారణాసి శ్రీనివాసరావు, పీర్‌సాహెబ్, వంగా నరసింహరావు, వీకే సత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. -
హోరాహోరీగా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయి అండర్–17 బాలికల, బాలుర వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అంతర్జాతీయ న్యాయ నిర్ణేత టీవీ అరుణాచలం, పరిశీలకుడు ధర్మేష్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు. ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, క్రీడా నిర్వాహక కార్యదర్శి ఎ.సాయి పాల్గొన్నారు. -
కాలువలో లారీ బోల్తా
పెరవలి(నిడదవోలు) : నిడదవోలు –నరసాపురం కాలువలో గురువారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పెరవలి నుంచి పంగిడి వెళ్తున్న లారీ తెల్లవారుజామున మంచు ప్రభావంతో అదపు తప్పటంతో లారీ వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కాలువలో బోల్తాకొట్టింది. లారీ ఢీకొట్టిన చెట్టు కూడా విరిగి కాలువలో పడింది. లారీ డ్రైవర్ సత్యనారాయణ, క్లీనర్ ఇస్మాయిల్ అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆటోను ఢీకొట్టిన లారీ - 8మందికి గాయాలు దేవరపల్లి(గోపాలపురం) : దేవరపల్లి మండం గౌరీపట్నం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వాసు తెలిపారు. -
ఇద్దరు మోటార్‌సైకిల్ దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం : స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రెండు రోజులు వరుసగా రెండు మోటార్ సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యడ్లపల్లి శ్రీను అనే వ్యక్తి ఈనెల 9న స్థానికి ఎస్బీఐ బయట మోటార్ సైకిల్ ఉంచి బ్యాంకులోకి వెళ్లి వచ్చేసరికి అతని మోటార్‌సైకిల్ చోరీకి గురైంది. అలాగే 10న బేతపూడి జాన్ చౌదరి మోటార్‌సైకిల్ కూడా ఇలాగే చోరీకి గురైంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లను చోరీ చేసిన పట్టణానికి చెందిన అల్లాడి వీరన్న, తెల్లపల్లి ప్రసాద్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నిందితులు తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన మరో మోటార్‌సైకిల్ కూడా దొంగిలించినట్టు అంగీకరించారని ఎస్సై తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. -
నేడు పాల దిగుబడి పోటీలు
పెనుమంట్ర (ఆచంట) : సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెనుమంట్ర మండలంలోని వెలగలేరులో గురువారం రాష్ట్రస్థాయి ఒంగోలు ఆవుల పాల దిగుబడి పోటీలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండుపూటలా న్యాయ నిర్ణేతల సమక్షంలో పాలు పితకాలి. ఈ సందర్భంగా గెలుపొందిన ఆవులకు కాసు, అరకాసు, పావుకాసు బంగారం చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేయనున్నారు. పాల దిగుబడి పోటీలతో పాటు పళ్ల అందాల పోటీల్లో గెలుపొందిన పశువులకు నగదు బహుమతులు అందజేయనున్నట్టు పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ గుడిమెట్ల సోమిరెడ్డి తెలిపారు. -
జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాము, ఎం.రంగారావు ఆధ్వర్యం వహించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లు ఈ నెల 11 నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. బాలికల జట్టు కె.జ్యోతి ప్రవల్లిక, ఎం.నాగ(తాళ్లూరు), బి.శ్రావని, యు.జాన్సీలక్ష్మి(పెదపాడు), ఎస్.రూపికారాణి, జి.రమ్య(వేగేశ్వరపురం), కె.దివ్య(ఏలూరుపాడు), యు.మౌనిక(ఇరగవరం), ఎస్.మేరి(ఏలూరు), పి.మధు(అగ్రహారం), బి.రేవతి, ఎ.జ్యోతి(ఏలూరు) బాలుర జట్టు జి.సురేంద్ర, జె.బాలకృష్ణ(తాళ్లూరు), ఆర్.మౌళి, బి.సత్యనారాయణ(కోనేటివాడ), ఆర్.రాజేష్(ఉండ్రాజవరం), వి.చంటి (పెదవేగి), ఎం.పవన్‌కుమార్(చింతలపూడి), ఎం.నాగరాజు(పెదపాడు), డి.జగపతిబాబు(తాడేరు), ఎం.గణేష్ (తాడేపల్లిగూడెం), ఎం.వంశీ(విజయరాయి), డి.విల్సన్ (భీమవరం)తో పాటు డి.సాల్వరాజు(గణపవరం), టి. ఆంజనేయప్రసాద్(భీమవరం), కె.నిఖిల్ సతీష్(జగన్నాథపురం), కె.శివరాజుకుమార్(అల్లంపురం), యు.వెంకటేష్(పెదవేగి) ఎంపికయ్యారు. -
ఘరానా దొంగ అరెస్ట్
కడప అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగ షేక్ నిజాముద్దీన్ అలియాస్ నిజాంను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నాలుగు కేసుల్లో అరెస్టయి ఈ ఏడాది మే 7న జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి కడప టుటౌన్ పరిధిలో 15 చోరీలు, చిన్నచౌకు పరిధిలో ఒక దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో ఒక కేసులో చోరీకి పాల్పడ్డాడు. కాగా కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తమ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన వివరాలను, రికవరీ చేసిన సొత్తు గురించి వెల్లడించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ కడప కేంద్రకారాగారం నుంచి విడుదలైన తర్వాత నిజాముద్దీన్ జులై మొదటి వారంలో చిలకల బావి వద్ద టీవీఎస్‌ను చోరి చేశాడు. అప్పటి నుంచి ఆ వాహనంలో తిరుగుతూనే కడప దండోరా కాలనీ, బిస్మిల్లా నగర్ తదితర చోట్ల ఇళ్లల్లో చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారు వస్తువులను తిరుపతిలో కొత్తవారికి అమ్ముకుని, కొన్ని వస్తువులను తన దగ్గరే పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈనెల 28న కడప మాచుపల్లె రోడ్డులో హిందూ శ్మశానవాటికకు ఎదురుగా నిందితుడు టీవీఎస్ ఎక్సెల్లో వెళుతుండగా వాహనాల తనిఖీ చేస్తుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి నుంచి మూడు చోరీల్లోని 185 బంగారు ఆభరణాలను, 250 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కృషి చేసిన టూటౌన్ ఎస్ఐలు జి. అమరనాథ్‌రెడ్డి, రుష్యేంద్రబాబు తదితరులను డీఎస్పీ అభినందించారు. -
జిల్లాలో నగదు రహిత మందుల షాపులు
ఏలూరు అర్బన్ : జిల్లావాసులకు నగదు రహితంగా అన్ని ఔషధాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ (ఏడీసీ) వి.విజయశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు నగదు లేని కారణంగా రోగులు మందుల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈ పోస్, ఎం పోస్ మెషిన్ లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అటాచ్డ్, చైన్ మందుల దుకాణాల్లో నగదు రహిత విధానంలో ఔషధాలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మందుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కోసం మందుల షాపుల యజమానులతో సంబంధిత బ్యాంకుల్లో స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తు చేయించినట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 55 సాధారణ, రిటైల్ దుకాణాల్లో మెషిన్ లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మందులు నగదు రహితంగా సులభంగా అందించేందుకు యుఎస్ఎస్డీ, యూపీఐ, ఈ పోస్ అనే మూడు విధానాలను దుకాణాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీని వల్ల మందులు అవసరమైన వారు బ్యాంకు ఖాతా కలిగి సాధారణ మొబైల్ ఫోన్ ఉంటే నగదు లేకుండానే అవసరమైన అన్ని మందులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ మేరకు అన్ని దుకాణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనువుగా ప్ల కార్డులు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకున్నామని ఏడీసీ తెలిపారు. -
త్వరలో 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ
జంగారెడ్డిగూడెం: జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా సుమారు 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సివిల్‌సప్లయిస్ డీఎం ఎంగణపతిరావు, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌డీలర్ల సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. త్వరలో రేషన్‌కార్డులు లేని వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కాగా ఈ నెల 23 శుక్రవారం జంగారెడ్డిగూడెంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, స్త్రీశిశు సంక్షేమ గనుల శాఖమంత్రి పీతల సుజాత చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న కుటుంబాల కన్నా గ్యాస్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే బ్యాచ్లర్లకు కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి వారు జిల్లాలో సుమారు 18 వేల మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటికే జిల్లాలో 10.60 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. 55,947మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించినట్టు చెప్పారు. రూ.794 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.709 కోట్లు జమచేశామన్నారు. నగదు రహిత కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు నగదు సమస్య రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఈ నెలాఖరుకు నగదు సమస్యలు పరిష్కారం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ సన్నిధిలో తెలంగాణ ఐజీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని గురువరం తెలంగాణ ఐజీ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నరసాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు, వన్‌టాన్ సీఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ శ్యామ్‌సుందర్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని ఐజీ సజ్జనార్ సందర్శించారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
కుక్కల స్వైర విహారం.. ఏడుగురికి గాయాలు
చిన్నమండెం(రాయచోటి రూరల్): చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలో పిచ్చి కుక్కలు రెండు రోజులుగా స్వైర విహారం చేస్తున్నాయి. రెండు కుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారు. అందులో గురువారం రాత్రి నాగూరివాండ్లపల్లెకు చెందిన పాపులమ్మ, లక్ష్మీదేవి, సుగుణమ్మ.. ఆశా వర్కర్ యశోదమ్మ సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ చికిత్స చేయించుకుని, తిరిగి స్వగ్రామానికి వెళ్లారు. అంతకు ముందు రెండు పిచ్చి కుక్కలు గొర్రెలు, గేదెలతోపాటు పాపన్న, చిన్నక్క, సాయికుమార్ (4 ఏళ్ల బాలుడు), సమీర్‌ను గాయపరిచాయి. దీంతో గ్రామస్తులంతా కలిసి పిచ్చికుక్కలను చంపేశారు. -
కోట సత్తెమ్మకు బంగారు నెక్లెస్ సమర్పణ
నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోట సత్తెమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన ఎలక్టిక్రల్ డీఈ విలపర్తి శ్రీరామచంద్రమూర్తి, పద్మావతి దంపతులు గురువారం కాసు బంగారు నెక్లెస్ సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్తి్ర, ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
దెందులూరులో మరో 10 మందికి అస్వస్థత
దెందులూరు: దెందులూరులోని పెద దళితపేటలో మరో పది మంది అస్వస్థతకు గురయ్యారు. పెద దళితపేటలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు పది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో చేరారు. స్టాఫ్ నర్సులు, సెలైన్లు పెట్టి మందులు ఇచ్చారు. బుధవారం 37 మంది, తర్వాత మరో పది మంది అస్వస్థతకు గురికావడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కుళాయిల నీరు తాగొద్దు గ్రామ పంచాయతీ వీధి కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని తాగవద్దని, మాంసం, చేపలు తినవద్దని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని గ్రామ కార్యదర్శి ఎం.అనూష గ్రామంలో మైక్ ప్రచారం చేయించారు. కో-ఆపరేటివ్ సొసైటీలో ఉచితంగా సురక్షితమైన తాగునీటిని టిన్నుల ద్వారా అందిస్తున్నారని, వీటిని వినియోగించాలని సూచించారు. -
త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
నిడదవోలు : మండలంలోని పెండ్యాల జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం అండర్ – 17 త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా బాలుర జట్టుకు పెండ్యాల జెడ్పీ హైస్కూల్ నుంచి ఎం.బుల్లిరాజు, వాకా రాము, ఎస్.నరేంద్రబాబు, కె. సాయి వంశీ, కె.సత్యనారాయణ స్వామి, ఇరగవరం జెడ్పీ హైస్కూల్ నుంచి సుభానీ బాషా, ఎం.సురేష్, ఎంఎం పురం జడ్పీ హైస్కూల్ నుంచి కె.చంద్రశేఖర్, జి.సతీష్, ఎస్.లీలా సతీష్, జి.యాదగిరి లక్ష్మీనరసింహ, ఖండవల్లి జెడ్పీ హైస్కూల్ నుంచి సీహెచ్ వీర నివా ఎంపికయ్యారు. బాలికల జట్టుకు పెండ్యాల జెడ్పీ హైస్కూల్ నుంచి వి.మీనా సుప్రియ, కె.ప్రసన్న, కె.శిరీష, పేరిపాలెం జెడ్పీ హైస్కూల్ నుంచి కె.వల్లీదేవి, టి.దీప్తి, ఇరగవరం జెడ్పీ హైస్కూల్ నుంచి పి.సాయి మీనాక్షి, పోలవరం ఎస్‌ఎఫ్‌ఎస్‌హెచ్‌ఎస్ హైస్కూల్ నుంచి కె.వసుంధర, బి.కనకదుర్గ, బి.స్నేహ మాధురి, కె.అమల, భీమడోలు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్కే నవీన్ ఎంపికైనట్టు ఆర్గనైజర్ పీఈటీ ఎస్.నాగరాజు తెలిపారు. ఎంపికైన జట్లు కడపలో ఈ నెల 19 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. -
బాస్కెట్ పోటీలు ప్రారంభం
ఆచంట : అంతర్ జిల్లాల బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ పోటీలు గురువారం రాత్రి మార్టేరులోని వేణుగోపాలస్వామి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతమైన మార్టేరులో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకట్టుకుంది. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌బాబు, ట్రెజరర్ చక్రవర్తి, కేజీ బేసిన్ ఓన్జీసీ మేనేజర్ సతీష్‌కుమార్, పెనుగొండ ఏఎంసీ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, నెగ్గిపూడి, సర్పంచ్‌లు కె. మమతకుమారి, కె.మహాలక్ష్మి, మార్టేరు మొదటి బాస్కెట్‌బాల్ నేషనల్ మెడలిస్ట్ కేఆర్ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు -
జనం మధ్యకు బీసీ కమిషన్
ద్వారకాతిరుమల : బీసీ రిజర్వేషన్ల జాబి తాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ గురువారం క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. ద్వారకాతిరుమల మండలం కొమ్మర, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామాలతోపాటు తణుకు పట్టణంలో జస్టిస్ కేఎల్ మంజునాథ, కమిషన్ సభ్యులు కాపులు, బీసీల ఆర్థిక, సామాజిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పలుచోట్ల పేదల ఇళ్లకు వెళ్లారు. కాపులు, బీసీ వర్గాల వారితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కుల సంఘాల పెద్దల నుంచి వినతులు స్వీకరించారు. ద్వారకాతిరుమల మండలం కొమ్మరలో వివిధ కులాలకు చెందిన నాయకులు వాదనలు వినిపించారు. తమ కులస్తులు పేదరికంలో మగ్గుతున్నారని ఎవరికి వారు మొరపెట్టుకున్నారు. గోపాలపురం నియోజకవర్గ బీసీ సంఘ కన్వీనర్ కూరాకుల బుజ్జి మంజునాథ కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారంతా అగ్రకులాల వారేనని వివరించారు. అన్ని రంగాల్లో ముందున్న కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం సమంజసం కాదన్నారు. ద్వారకాతిరుమల మండల కాపు సంఘం అద్యక్షుడు పుప్పాల మురళి, కాపు నేత అంబటి గాంధీ, తదితరులు కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. కాపుల్లో ఎంతోమంది వెనుకబడి ఉన్నారని, కూలి పనులకు వెళితేనే గాని రోజు గడిచే పరిస్థితి లేదని వివరించారు. వాస్తవ పరిస్థితులను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి కాపులకు బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొమ్మర గ్రామానికి చెందిన మహిళ తీగల కనక మహాలక్ష్మి మాట్లాడుతూ కాపు కులానికి చెందిన తనకు నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ తోట ఉందని తెలిపింది. ఆ భూమిలో గతంలో వేసిన బోరు పాడైందని, కొత్తబోరు కోసం అర్జీ పెట్టుకుని నెలలు గడుస్తున్నా అధికారుల్లో స్పందన లేదని వివరించింది. తనలాంటి వారు ఎంతోమంది బోర్లు పాడై, పంటలు పండక పొలాలను అమ్ముకుంటున్నారని చెప్పింది. బోరు వేయాలంటే ఎంతోకొంత పొలం అమ్ముకోవాల్సిందేనని, ఈ రకంగా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పింది. అనంతరం గ్రామంలో ఎంతమంది గ్యాస్ వినియోగిస్తున్నారు, ఎంతమంది కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారనే దానిపై బీసీ కమిషన్ వివరాలు సేకరించింది. కాపుల్లో ఎంతమంది ఉపాధి హామీ కూలి పనులకు వెళుతున్నారనే విషయంతోపాటు పలు అంశాలపై వివరాలు తీసుకుంది. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు సత్యనారాయణ, ఎన్ .పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, పి.రమేష్‌కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, బీసీ వెల్ఫేర్ అధికారి జి.లక్ష్మిప్రసాద్, ఏబీసీడబ్ల్యూఓ ఏవీ ఎ.హరిబాబు పాల్గొన్నారు. -
క్రమంగా ఎయిడ్స్ తగ్గుముఖం
ఏలూరు (మెట్రో) : ఎయిడ్స్ సోకేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని సమాజంలో అందరి భాగస్వామ్యంతో ఎయిడ్్సరహిత జిల్లాగా తీర్చిదిద్దడం కష్టం కాదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ ప్రచార ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెరిగిందన్నారు. మంచి ఆహారం, మానసిక ధైర్యం కల్పిస్తే హెచ్ఐవీ సోకిన బాధితులు 20 నుంచి 25 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని అందుకే హెచ్ఐవీ బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని భాస్కర్ కోరారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ నూర్జహా¯ŒS, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి తదితరులు మాట్లాడారు. డీసీహెచ్ఎస్ శంకరరావు, ఏలూరు కమిషనర్ యర్రా సాయిశ్రీకాంత్, మాజీ డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పాల్గొన్నారు. -
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమం న్యూటన్ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు. కేడీవీ ప్రసాద్ వర్మ, జెడ్పీహెచ్ఎస్, ఎన్ఆర్పీ అగ్రహారం ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ద్వారా ఆయిల్‌ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్ఎస్, దెందులూరు రైల్ వైబ్రేషన్స్‌తో విద్యుత్ ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్ ద్వారా విద్యుత్‌ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్ క్రిస్టల్స్‌తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్ఎస్, పాలకొల్లు వ్యర్థ జలాల శుద్ధీకరణ వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్ స్కూల్, ఏలూరు కొల్లేరును కాపాడుకుందాం సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు గోల్డెన్ రైస్ గోల్డెన్ రైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్ ఉన్నాయి. ఎస్.భాస్కర్ ప్రభాత్, సెయింట్ అలోషియస్, ఆకివీడు -
కదం తొక్కిన చింతలపూడి రైతులు
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథ కం రైతులు గురువారం కదం తొక్కారు. రైతులకు న్యా యం జరిగే వరకు కాలువ తవ్వకం పనులు అడ్డుకోవాలని తీర్మానించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం అవలం బిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన భూ ములు కోల్పోతున్న జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో గురువారం ప్రజా చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడు తూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉం టామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా చైత న్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నాలుగు రెట్ల పరిహారం అందించాలని కోరారు. రైతుల ప్రదర్శన మార్కెట్ కమిటీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యా లీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, కార్యదర్శి అంజిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, సీపీఎం డివిజ¯ŒS కార్యదర్శి ఆర్వీఎస్ నారాయణ, సీపీఐ, నీటి సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తదితరులు పాల్గొన్నారు. -
సార్వా దిగుబడులు ఆశాజనకం
మార్టేరు, (పెనుమంట్ర): సార్వాలో వరిచేలపై చీడ పీడలు, తెగుళ్ల ప్రభావం అంతగా లేనందున అధిక దిగుబడులు వస్తాయని పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనాస్థానంలో గురువారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తల సమావేశంలో మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ సాధారణ స్థాయికి మించిన దిగుబడులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలాఖరుకు అన్నిచోట్లా దాళ్వా సాగు కోసం నారుమడులు పూర్తి చేయాలని రైతులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం కోతలు పూర్తికాగా దిగుబడి సగటున 32 బస్తాల వస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ సంచాలకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని దిగుబడి 30 బస్తాలకు పైగా కనిపిస్తోందని చెప్పారు. రెండు జిల్లాలకు చెందిన పలువురు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అపరాల పంటపై కూడా చర్చించారు. అనంతరం వ్యవసాయ çపరిశోధనా స్థానంలో సిద్ధమవుతున్న నూతన వరి వంగడాలను పరిశీలించారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
నిడదవోలు : రాష్ట్రం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అధికార అండదండలతో అరాచక పాలన సాగుతోందని, దోపిడీ రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చమరగీతం పాడేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని పోలిరెడ్డి కల్యాణ మండపంలో పార్టీ మండల అ««దl్యక్షుడు అయినీడి పల్లారావు అధ్యక్షతన గురువారం మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి పరిష్కారం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బాసటగా నిలుస్తున్నారన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యాచరణ ప్రణాళికతో.. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని ఆళ్ల నాని చెప్పారు. పార్టీ నిర్మాణానికి కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తలను పార్టీలో భాగస్వాములు చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేశామని సిగ్గుతో తలవంచుకుంటున్నారని చెప్పారు. జన చైతన్య యాత్రల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీలోకి రావడానికి యువత ఆసక్తి కనబరుస్తోందన్నారు. నిధులు పక్కదారి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించి, వాటితో టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆళ్ల నాని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. త్వరలో గ్రామ కమిటీలు నియమిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముళ్లపూడి శ్రీనివాస్‌చౌదరి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిందని, పేదలకు పథకాలు అందడం లేదని విమర్శించారు. మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు మాట్లాడారు. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాలా పద్మ, ఎంపీపీ మన్యం సూరిబాబు, శ్రీపాణి అలవాల రాజు, ఉప్పులూరి రామ్మోహనరావు, ఆత్కూరి దొరయ్య, యాళ్ళ రామారావు , పాఠంశెట్టి మధు, మద్దిపాటి ఫణీంద్ర, వెలగన సత్యనారాయణ, గుమ్మాపు రోహిణీబాబు, ఎస్కె మీరాసాహెబ్, కస్తూరి సాగర్, పుల్లూరి రామమూర్తి, కొప్పుల రామదేవుడు, వెలగన పోలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్
నారాయణపురం (ఉంగుటూరు) : రాష్ట్రస్థాయి అండర్–19 బాల, బాలికల స్కూల్ గేమ్స్, సపక్ తక్రా పోటీలు నారాయణపురం బాపిరాజు స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియంను ముస్తాబు చేస్తున్నారు. అండర్–19 స్కూల్‌గేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఇస్సాక్, ఒలింపిక్స్ జిల్లా అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ వి.సోమశేఖర్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 130 మంది క్రీడాకారులు తరలిరానున్నట్టు చెప్పారు. ఈ పోటీలు ఉదయం నుంచి జరుగుతాయన్నారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిరెడ్డి సత్యానారాయణ తెలిపారు. -
కార్మిక బీమాపై కలెక్టర్ సమీక్ష
ఏలూరు (మెట్రో) : జిల్లాలో అసంఘటిత కార్మికులకు ప్రమాదం ద్వారా గాని సాధారణంగా కానీ మరణిస్తే ఆ వివరాలు పంచాయతీ, రెవెన్యూ అధికారుల ద్వారా చంద్రన్న బీమా కాల్‌సెంటర్‌కు తెలపాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన చంద్రన్న బీమా అమలుపై డీఆర్డీఏ, కార్మిక, డ్వామా, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో దురదృష్టవశాత్తూ వాహన ప్రమాదం లేదా సాధారణ మరణం సంభవించినప్పుడు గ్రామంలోని కాల్ సెంటర్ నంబర్ 155214కు సంబంధిత గ్రామ వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా వారి వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందించాలని కలెక్టర్ చెప్పారు. గ్రామ మహిళా సంఘ సమాఖ్య కాల్ సెంటర్ వివరాలను అదే రోజు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ డేటాలో పొందు పరుస్తారన్నారు. మరణించిన వ్యక్తి పేరు కాల్ సెంటర్లో రిజిస్టర్ చేయించిన 7 రోజుల్లోపు పంచాయతీ లేదా మునిసిపల్ కార్యాలయం నుంచి ధ్రువపత్రం, పోలీస్ శాఖ నుంచి ప్రమాద ఎఫ్ఐఆర్ లేదా శవపంచనామా రిపోర్టును మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని ఆ¯ŒSలై¯ŒS ద్వారా సంబంధితాదికారులు కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డ్వామా ప్రతినిధి పి.కుమార్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
సత్యవరం(పెనుమంట్ర) : సత్యవరం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పార్టీ కన్వీన కవురు శ్రీనివాస్ సమక్షంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ బందుల సూరయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గెడ్డం విఘ్నేశ్వరరావు నాయకత్వంలో దాదాపు 50 మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారిని శ్రీనివాసు పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. గెడ్డం ఈశ్వర్, బాలం బులినర్సయ్య, బాలం శ్రీరాములు, కట్టా శ్రీను, కట్టా కనకయ్య తదితరులు వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ కర్రి వేణుబాబు, కార్యదర్శి ఉన్నమట్ల మునిబాబు, సీనియర్ నాయకులు నల్లిమెల్లి ప్రభాకరరెడ్డి, వీరవల్లి స్వామి, జిల్లా రైతుకమిటీ కార్యదర్శి పడాల అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప ల -
విజయనగరంలో గిరిజన విశ్వవిశవివిద్యాలయం
ద్వారకా తిరుమల : కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు భూసేకరణ కూడా జరిపినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ద్వారకా తిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల, బాలికల జూనియర్ కళాశాలలో గురువారం క్యూరియాసిటీ కార్నివాల్2016 (వైజ్ఞానిక ప్రదర్శన)ను ఆయన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు తిలకించారు. ఆ తరువాత జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది, పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు విద్యలో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు మరింతగా కృషిచేయాలన్నారు. అనంతరం మంత్రి రావెలను గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గజమాలతో సత్కరించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి, సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి వెంకటేశ్వరరావు, వెలుగు పాఠశాల ప్రిన్సిపాల్ వై.సుధారాణి పాల్గొన్నారు. -
విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టి యువకుడి మరణం
వీరవాసరం : నర్సాపురం–భీమవరం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ యువకుడు వృత్యువాత పడ్డాడు. మత్స్యపురి గ్రామానికి చెందిన నేలపాటి జానకిరాముడు (18) మోటార్ బైక్‌పై మత్స్యపురి నుంచి భీమవరం వైపు వస్తుండగా, మత్స్యపురి శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు మోటార్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని డీకొట్టింది. ఘటనలో జానకిరాముడు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. చైన్నైలో తాపీ పనులు చేస్తూ జీవించే జానకీరాముడు మూడు రోజుల క్రితం మత్స్యపురిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సినిమాకు బయలేలుదేరిన అతను కానరాని దూరాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యువకునికి తల్లిదండ్రులు లేరు. ఘటనాస్థలాన్ని నరసాపురం పోలీసులు పరిశీలించారు. -
వరి పరిశోధనాస్థానాన్ని పరిశీలించిన జపాన్ బృందం
మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వరిపరిశో«ధనాస్థానానికి శుక్రవారం జపాన్ శాస్త్రవేత్తలు విచ్చేశారు. ఈ సందర్భంగా జపాన్‌లోని కుబోటీ పరిశోధనాస్థానానికి చెందిన యమమెటో, ఖషిహరా అనే శాస్త్రవేత్తలు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలను, వరి క్షేత్రాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న యాంత్రీకరణ, నూతన పరికరాల వినియోగంపై పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎస్.కృష్ణంరాజు, ఎన్.ఛాముండేశ్వరీ, ఫణికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడానికి 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువారం వెలుగు మహిళా గ్రూపులు, సహకార సొసైటీ సభ్యులకు 2015–16 ఆర్థిక సంవత్సరంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సును ఆయన నిర్వహించారు. జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్ పంట కాలంలో దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు. కామన్ రకం ధాన్యానికి రూ.1,470, గ్రేడ్–ఎ రకం ధాన్యానికి రూ.1,530 కనీస మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని ఈ మేరకు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఏటా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం వల్ల రూ.74 కోట్లు కమీషన్ రూపంలో వెలుగు సహకార సంఘాలకు చేరుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి వెలుగు సంఘాల్లో పోటీతత్వం కూడా పెరుగుతోందని, మధ్య దళారీల బెడద లేకుండా రైతులకు నేరుగా గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రధానోద్దేశమని చెప్పారు. డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.గణపతిరావు, సహకార శాఖాధికారి ప్రసాద్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు. -
271 మంది కంప్యూటర్ టీచర్ల ఎంపిక
ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందించేందుకు కంప్యూటర్ టీచర్ల నియామకానికి సంబంధించి ఎంపికలు గురువారం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 283 మంది కంప్యూటర్ టీచర్ల నియామకానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించగా 1,256 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ అభ్యర్థుల కంప్యూటర్ నిపుణత, సర్టిఫికెట్స్, నేటివిటీ ఆధారంగా ఎంపికలు పూర్తిచేసినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. 271 మంది అభ్యర్థులు కంప్యూటర్ టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు డీఈవో వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. -
సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు సాక్షాత్కరించారు. పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని ఉభయదేవేరులతో చినవెంకన్న అధిరోహించారు. లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యనారాయణుడను నేనేనంటూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహన సేవల్లో సూర్యప్రభ వాహనానికి విశేష ప్రాధాన్యముంది. చిరుమందహాసధారిౖయెన శ్రీనివాసుడు తన అభయహస్తంతో ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తులకు వరాలు కురిపిస్తున్నట్టు కనువిందు చేశారు. సూర్యుడు రథసారథి సప్తఅశ్వాలను ఏ విధంగా అదుపులో ఉంచుతూ రథాన్ని నడిపిస్తాడో.. అదేవిధంగా మానవుడు తనలోని సప్తవ్యసనాలను అదుపులో ఉంచుకుని శ్రీమన్నారాయణుని శరణాగతి పొందితే తప్పక ముక్తి లభిస్తుందని సూర్యప్రభ వాహనసేవ అర్థమని పండితులు చెబుతున్నారు. నవనీత కృష్ణ అలంకరణలో.. నవనీత కృష్ణ అలంకరణలో రాత్రి ఉభయదేవేరులతో స్వామివారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గజవాహన సేవతో శ్రీవారు భక్తులను కటాక్షించారు. గోవిందనామస్మరణల నడుమ చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 7 గంటలకు – హనుమద్వాహనంపై గ్రామోత్సవం ఉదయం 8 గంటలకు – వాసవి భజన మండలి సంకీర్తనల ఆలాపన ఉదయం 9.30 గంటలకు – కూచిపూడి నృత్యం సాయంత్రం 5 గంటలకు – ఉపన్యాసం సాయంత్రం 6 గంటలకు – బుర్రకథ రాత్రి 7 గంటలకు – కూచిపూడి నృత్యం రాత్రి 7 గంటలకు – ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 8 గంటలకు – కూచిపూడి నృత్యం రాత్రి 8.30 గంటలకు – వెండి శేష వాహనంపై గ్రామోత్సవం కాంతుల రవళి.. శ్రీవారి లోగిలి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి క్షేత్రం విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కల్యాణోత్సవాల్లో విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ రాజగోపురాలు, పరిసరాల సముదాయం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ కటౌట్లు, గరుడాళ్వార్ విగ్రహ ప్రాంతంలో స్వాగత కటౌట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొండపైన శ్రీరామ పట్టాభిషేకం, గుడి సెంటర్లో భగవద్గీత ఘట్టం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు కనువిందు చేస్తున్నాయి. -
ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అత్తిలి : ఆలయాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములై తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్కిన్నెరపురంలో రూ. 36 లక్షల వ్యయంతో పునఃనిర్మించే కోదండ రామాలయానికి గురువారం ఎంపీ గోకరాజు గంగరాజు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి మంత్రి మాణిక్యాలరావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాలు నిర్మించడం తేలికేనని, అయితే వాటి నిర్వహణ కష్టతరంగా మారుతుందన్నారు. ప్రజలు భాగస్వాములు అయినప్పుడే ఆ ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ గంగరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాత దాట్ల రామకృష్ణంరాజు రూ.12 లక్షలు విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. దాత దాట్ల రామరాజును మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ అందే సత్యం, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, ఎంపీపీ కేతా సత్యనారాయణ, సర్పంచ్ వనుం రామకనకదుర్గ, సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జి ఘనంగా సత్కరించారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
వనంపల్లి, (పెనుమంట్ర) : పోలీసునని పలువురిని బెదిరించిన వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్సై కడలి సత్యనారాయణ కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి శివారు వనంపల్లి గ్రామానికి చెందిన యర్రపల్లి ఓంసాయి మూడురోజుల క్రితం తన స్నేహితురాలైన ఒక యువతితో పెనుమంట్ర మండలం వెలగలేరు వద్ద మాట్లాడుతుండగా.. అక్కడకు చేరుకున్న ఆచంట శివారు వంగతాళ్ల చెరువు ప్రాంతానికి చెందిన కుడిపూడి యోగేంద్రబాబు తన సెల్ఫోన్లో ఫొటోలు తీశాడు. అనంతరం వాళ్లతో తాను పోలీసునని చెప్పి రూ. 300 తీసుకున్నాడు. మరో రూ.3 వేలు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు. రోజూ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఓంసాయి పోలీసులను ఆశ్రయించగా.. యోగేంద్ర బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు నకిలీపోలీసు అని, ఇలా కొందరిని బెదిరించాడని తేలింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. -
ఆక్వాపార్క్ నిర్మాణం వద్దే వద్దు
ఏలూరు (సెంట్రల్) : భీమవరం మండలం తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్క్ విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకుని వ్యవహరించడాన్ని నిరసిస్తూ గురువారం వామపక్షాల నాయకులు కళ్లకు గంతాలు కట్టుకుని నిరసన తెలిపారు. స్థానిక ఫైర్‌స్టేçÙన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం గురువారం కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ వేలాది మంది ప్రజలు ఫుడ్ పార్కు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసు పహారాలో నిర్మాణ పను లు చేయించడం దారుణమన్నారు. సబ్ కలెక్టర్ 144 సెక్షన్ విధించగా పోలీసులు దానిని యాజమాన్యానికి అనుకూలంగా అమలు చేస్తున్నారని, సీఎం చంద్రబాబు ప్రజలపై అక్రమ కేసులు పెట్టించి పారిశ్రామికవేత్తలకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే నిమ్మ, మామిడి పండ్ల రసాలు, కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటుచేయాలని, వెంటనే పుడ్‌పార్క్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నేతల రమేష్, పి,కిషోర్, వైఎస్ కనకారావు, గొట్టాపు మురళీ, జి. విజయలక్ష్మీ, కె.కృష్ణమాచార్యులు, సీహెచ్.రాజలక్ష్మీ, ఆదిశేషులు పాల్గొన్నారు. -
ఆలయాలు రికార్డుల పరిశీలన
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాల రికార్డులను గురువారం దేవాదాయ« శాఖ మల్టీజోన్–2 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ పరిశీలించారు. ఆలయ అధికారులు, సిబ్బందితో కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ భూముల పరిరక్షణ తీరు ఎలా ఉంది అన్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వస్తున్న భక్తులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి పనుల తీరుపై సమీక్షించారు. అనంతరం మద్ది, పారిజాతగిరి, జంగారెడ్డిగూడెంలో సీతారామస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలను, బొర్రంపాలెం, టి.నర్సాపురం గ్రామాల్లో ఆలయ భూములను ఆయన పరిశీలించారు. మద్ది ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, జంగారెడ్డిగూడెం గ్రూపు ఆలయాల ఈవో గాదిరాజు వీర వెంకట రవికుమార్, పారిజాతగిరి ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, మద్ది ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. -
శాంతించిన వరద గోదావరి
కొవ్వూరు : గోదావరిలో వరద ఉధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 5,35,688 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో గురువారం సాయంత్రానికి 3,60,559 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 12,600 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 3,47,959 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్టకు నాలుగు ఆర్మ్స్‌లో ఉన్న 175 గేట్లు 0.80 మీటర్లు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి దిగువకు విడిచిపెడుతున్నారు. మరోవైపు భద్రాచలంలో నీటిమట్టం 25.40 అడుగులకు తగ్గింది. శుక్రవారం సాయంత్రానికి ధవళేశ్వరంలో వరద తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చిమడెల్టాకు నీటి విడుదల పెంపు ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో పంటలకు సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డెల్టా కాలువలకు నీటి విడుదలను పెంచారు. జిల్లాలోని పశ్చిమ డెల్టాకు 1,500 క్యూసెక్కులను పెంచి 6 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. తూర్పుడెల్టాకు 4,400, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడిచిపెడుతున్నారు. జిల్లాలోని ఏలూరు కాలువకు 454, ఉంyì కాలువకు 699, నరసాపురం కాలువకు 1,604, జీఅండ్‌వీకి 704, అత్తిలి కాలువకు 446 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
కొవ్వూరు మునిసిపల్ చైర్మన్‌గా రాధారాణి ఎన్నిక
కొవ్వూరు : కొవ్వూరు పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా 19వ వార్డు కౌన్సిలర్ జొన్నలగడ్డ రాధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఎన్నికల అధికారిగా గురువారం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రాధారాణిని చైర్మన్ అభ్యర్థిగా మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని) ప్రతిపాదించారు. వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజా రమేష్ ఆమె పేరును బలపరిచారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు కేఎస్ జవహర్‌తో పాటు 22 మంది సభ్యులు రాధారాణిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కమిషనర్ టి.నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ వైస్ చైర్మన్‌గా కిల్లాడి ప్రసాద్ తాడేపల్లిగూడెం : మునిసిపల్ వైస్ చైర్మన్‌గా 34వ వార్డు కౌన్సిలర్ కిల్లాడి ప్రసాద్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం ఒక నామినేషన్ మాత్రమే పడటంతో కిల్లాడిని ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ ప్రకటించారు . -
నిశీధి వేళ.. విషాదం
ఆ ముగ్గురూ.. స్నేహితులు. ఆడుతూ పాడుతూ.. పనులు చేసుకునేవారు. అనుక్షణం కలిసే ఉండేవారు. అప్పటివరకూ సరదాగా గడిపిన వారు అంతలోనే విగతజీవులయ్యారు. అర్ధరాత్రి వేళ.. దారికాచిన మృత్యువు ముగ్గురినీ ఒకేసారి కబళించింది. నిండా 25 ఏళ్లుకూడా లేని ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. నరసాపురం రూరల్ : మరికొద్దినిమిషాల్లో ఇల్లు చేరతామని భావించిన ఆ యువకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బుధవారం అర్ధరాత్రి వేళ.. జరిగిన ఈ హృదయవిదారక ఘటన నరసాపురం మండలం రుస్తుంబాదలో పెనువిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రుస్తుంబాదకు చెందిన మీసారపు సురేంద్ర(25), పాలపర్తి అశోక్(20), దాసరి మణిరాజు(20) స్నేహితులు. వీరిలో సురేంద్ర, అశోక్ తాపీపనిచేస్తూ ఉంటారు. మణిరాజు ఎలక్రీ్టషియన్. ముగ్గురూ అనుక్షణం కలిసే ఉండేవారు. బుధవారం అర్ధరాత్రి వారు ముగ్గురూ మోటార్‌సైకిల్‌పై నరసాపురం నుంచి రుస్తుంబాదకు వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఫలితంగా ముగ్గురూ అక్కడికక్కడే రక్తపుమడుగుల్లో దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. రుస్తుంబాద రోదనలతో మిన్నంటింది. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. గ్రామంలోని అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఈ ముగ్గురూ మరణించడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. తండ్రిలాగే.. కొడుకూ రోడ్డు ప్రమాదానికి బలి సురేంద్ర తల్లిదండ్రులు శ్యామల రావు, మిస్సమ్మ నిరుపేదలు. వారికి ముగ్గురు సంతానం. సురేంద్రతోపాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లయిపోయాయి. సురేంద్ర తండ్రి శ్యామలరావు చాలాకాలం క్రితం రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. సురేంద్ర ఒక్కడే గ్రామంలో ఉంటూ తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. ఈ క్రమంలో అతను మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ సీఐ రామచంద్రరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా.. దాసరి మణిరాజు ఎలక్రీ్టషియన్. అతని తండ్రి ఆనందరావు వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు సంతానం మణిరాజు చిన్నవాడు. ఇతనికి అక్క, అన్న ఉన్నారు. అన్న కూడా కూలిపనులు చేస్తాడు. వీరెవరికీ వివాహాలు కాలేదు. మణిరాజు ఎంతోకొంత సంపాదిస్తూ.. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఎంత రాత్రైనా రోజూ పనులు ముగించుకుని వచ్చే మణిరాజు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చెల్లెలి పెళ్లి చేద్దామన్నాడు పాలపర్తి అశోక్ తల్లిదండ్రులు రమేష్, మార్తమ్మ. రమేష్ తాపీపనిచేస్తూ ఉంటాడు. వీరికి ముగ్గురు సంతానం అశోక్ పెద్దవాడు. అతనూతాపీపనులు చేస్తుంటాడు. తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇటీవల అశోక్ పెళ్లిచేద్దామని తల్లిదండ్రులు భావిస్తే.. ముందు చెల్లికి వివాహం చేసిన తర్వాత తను చేసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ప్రమాదంలో అశోక్ మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రమాదాలకు నిలయం ఆ రోడ్డు నరసాపురం–మొగల్తూరు రోడ్డు ప్రమాదాలకు నిల యంగా మారింది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీస్‌స్టేçÙన్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మొగల్తూరు మండలం నాగిడిపాలెం వద్ద వంతెన పూర్తవడంతో ఇటీవల రద్దీ పెరిగింది. ఒక పక్క రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఒకవైపే వాహనాలను అనుమతిస్తున్నారు. దీనికితోడు మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. -
మార్టేరు విత్తనాలకు విశ్వవ్యాప్త గుర్తింపు
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వ్యవసాయ వరి పరిశోధనా స్థానం విత్తనా లు మేలైన విత్తనాలకు మారుపేరని అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ అల్దాస్ జనయ్య అన్నారు. గురువారం మార్టేరు వ్యవసాయ పరి శోధనా స్థానాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడ ఉత్పత్తయిన స్వర్ణ, ఎంటీయూ 1010, 1001 రకాలు విశ్వవ్యాప్తంగా పేరు గడించాయన్నారు. దేశవ్యాప్తంగా వివి ధ పరిశోధనా స్థానాల్లో తయారవుతున్న విత్తనాల పరిశీలనలో భాగంగా తాను మార్టేరు వచ్చినట్టు చెప్పారు. రైతుకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడినిచ్చే విత్తనాలందించేందుకు పలు పరిశోధనా స్థానాల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. తొలుత సంస్థ డైరెక్టర్ డాక్టరు పీవీ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరిశోధనా స్థానం వివరాలను, నూతన వరి వంగడాల సృష్టిని వివరించారు. ఇక్కడ నిర్వహిస్తు్తన్న వివిధ కార్యక్రమాలు, వరిక్షేత్రాలను నాబార్డు ఏజీఎం కె.కల్యాణ సుందరం తిలకించారు. పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
జాలర్ల వలలో నల్లత్రాచు
జంగారెడ్డిగూడెం : జలాశయం వద్ద చేపలు, రొయ్యల కోసం ఏర్పాటు చేసిన మావు(ఇనుప ఊసలతో ఏర్పాటు చేసిన జల్లెడ లాంటి చతురాస్రాకార బాక్సు)లో నల్లత్రాచు పడడంతో జాలర్లు బెంబేత్తిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్రకాలువ జలాశయంలో వరదనీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో జాలర్లు మండలంలోని ఎ.పోలవరం జలాశయంలో చేపలు, రొయ్యల కోసం మావులు ఏర్పాటు చేశారు. ఈ మావుల్లో సుమారు 9 అడుగుల పొడవున్న నల్లత్రాచు పాము పడింది. మావులు బయటకు తీసి చూసేసరికి జాలర్లకు చేపలకు బదులు నల్లత్రాచు కనబడటంతో హడలెత్తారు. వెంటనే తేరుకుని మావు నుంచి త్రాచును చేపల వలలోకి మళ్లించారు. అరుదుగా కనిపించే ఈ నల్లత్రాచును చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. అయితే భక్తిభావంతో మత్స్యకారులు నల్లత్రాచును చంపకుండా సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి వదిలివేశారు.