హానర్‌ 8 లైట్‌ లాంచింగ్‌..రేపే | Honor 8 Lite likely to be launched in India tomorrow | Sakshi
Sakshi News home page

హానర్‌ 8 లైట్‌ లాంచింగ్‌..రేపే

Published Wed, May 10 2017 12:14 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM

హానర్‌ 8 లైట్‌ లాంచింగ్‌..రేపే - Sakshi

హానర్‌ 8 లైట్‌ లాంచింగ్‌..రేపే

న్యూఢిల్లీ: చైనీస్‌ మొబైల్‌ మేకర్‌ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 8 లైట్‌'ను  భారత మార్కెట్‌ లో  రేపే (11 మే)  విడుదల చేయనుంది. ఎప‍్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలపై పలు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా  మూడు రోజుల్లో  బిగ్‌ సర్‌ప్రైజ్‌ అంటూ హానర్‌ ఇండియా ట్విట్టర్‌ లో వెల్లడించింది.  ఈ హింట్‌ తో హానర్‌ 8 లైట్‌ను గురువారం లాంచ్‌ చేయనుందని భావిస్తున్నారు.  అయితే  ఫీచర్లు, ధర, లాంచింగ్‌ పై కచ్చితమైన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి.  


హానర్ 8 లైట్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లో  వినియోగదారులకు లభ్యం కానుందని తెలుస్తోంది.  అలాగే బ్లూ,గోల్డ్‌, వైట్‌ అండ్‌ బ్లాక్‌ కలర్స్‌లో ఈ డివైస్‌ను అందుబాటులోకి తేనుంది.  ఓన్లీ మొబైల్స్‌.కాం అందించిన సమాచారం ప్రకారం దీని  ధర రూ. 17,999గా  నిర్ణయించినట్టు  సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement