త్వరలో 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ
త్వరలో 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ
Published Thu, Dec 22 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
జంగారెడ్డిగూడెం: జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా సుమారు 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సివిల్‌సప్లయిస్ డీఎం ఎంగణపతిరావు, డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌డీలర్ల సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. త్వరలో రేషన్‌కార్డులు లేని వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. చంద్రన్న క్రిస్‌మస్ కానుక పంపిణీ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కాగా ఈ నెల 23 శుక్రవారం జంగారెడ్డిగూడెంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, స్త్రీశిశు సంక్షేమ గనుల శాఖమంత్రి పీతల సుజాత చంద్రన్న క్రిస్‌మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద గ్యాస్ కనెక‌్షన్‌లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న కుటుంబాల కన్నా గ్యాస్ కనెక‌్షన్‌లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే బ్యాచ్‌లర్‌లకు కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక‌్షన్‌లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి వారు జిల్లాలో సుమారు 18 వేల మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటికే జిల్లాలో 10.60 లక్షల గ్యాస్ కనెక‌్షన్‌లు ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. 55,947మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించినట్టు చెప్పారు. రూ.794 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.709 కోట్లు జమచేశామన్నారు. నగదు రహిత కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు నగదు సమస్య రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఈ నెలాఖరుకు నగదు సమస్యలు పరిష్కారం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement