in jrg
-
త్వరలో 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ
జంగారెడ్డిగూడెం: జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా సుమారు 46 వేల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సివిల్‌సప్లయిస్ డీఎం ఎంగణపతిరావు, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌డీలర్ల సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. త్వరలో రేషన్‌కార్డులు లేని వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కాగా ఈ నెల 23 శుక్రవారం జంగారెడ్డిగూడెంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, స్త్రీశిశు సంక్షేమ గనుల శాఖమంత్రి పీతల సుజాత చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న కుటుంబాల కన్నా గ్యాస్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే బ్యాచ్లర్లకు కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి వారు జిల్లాలో సుమారు 18 వేల మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటికే జిల్లాలో 10.60 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. 55,947మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించినట్టు చెప్పారు. రూ.794 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.709 కోట్లు జమచేశామన్నారు. నగదు రహిత కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు నగదు సమస్య రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఈ నెలాఖరుకు నగదు సమస్యలు పరిష్కారం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పారిజాతగిరిలో తిరుప్పావై ప్రవచనం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి తిరుప్పావై ప్రవచనం, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ కార్యక్రమాలను జరిపించినట్టు ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన పోల్నాటి శ్రీను, పిల్లి శ్రీను, సింగంశెట్టి రామాంజనేయుల దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
జంగారెడ్డిగూడెం : రిజర్వు బ్యాంకు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్‌కు ఈ కరెన్సీ వచ్చింది. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు కరెన్సీ కంటైనర్ ముందు భాగంలో ఆర్బీఐ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. కరెన్సీ కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుందని తెలసుకున్న పట్టణ ప్రజలు కంటైనర్‌ను చూసేందుకు వచ్చారు. రద్దు చేసిన రూ.500 , రూ.1000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు పనిచేయనుండటంతో ఖాతాదారులంతా పెద్దెత్తున బ్యాంకుల వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. -
కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
జంగారెడ్డిగూడెం : రిజర్వు బ్యాంకు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్‌కు ఈ కరెన్సీ వచ్చింది. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు కరెన్సీ కంటైనర్ ముందు భాగంలో ఆర్బీఐ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. కరెన్సీ కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుందని తెలసుకున్న పట్టణ ప్రజలు కంటైనర్‌ను చూసేందుకు వచ్చారు. రద్దు చేసిన రూ.500 , రూ.1000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు పనిచేయనుండటంతో ఖాతాదారులంతా పెద్దెత్తున బ్యాంకుల వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. -
రికార్డు నృత్యం..
జంగారెడ్డిగూడెం : కూచిపూడి నృత్య చరిత్రలో నూతన అధ్యాయం. 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఏక కాలంలో శిరస్సున మంచినీటి బాటిళ్లు ధరించి నత్య ప్రదర్శనతో వహ్వా అనిపించారు. ఎక్కడా తడబడకుండా వీరు చేసిన నృత్యం ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్కు ఎక్కింది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆవిష్కృతమైంది. స్థానిక అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 25వ కూచిపూడి దేశభక్తి గీతాల నృత్య కళాత్సోవాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత ఈ ప్రదర్శన ఇప్పించారు. రాష్ట్ర భక్తి గీతం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ విద్యార్థినులు 13.56 నిమిషాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బుర పరిచింది. ప్రదర్శనను ఇండియా బుక్ ఆఫ్ రికార్డŠస్ ప్రతినిధి బి.స్వదీప్‌రాయ్ చౌదరి ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డŠస్లో ఈ నృత్య ప్రదర్శనకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని, అందుకే రికార్డు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు , నాట్యమయూరి, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత ఎస్.రూపాదేవిని అందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రతిభ, భాష్యం, కిడ్స్, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు అభినయ కూచిపూడి నాట్య అకాడమికి చెందిన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం విద్యార్థులు, ఇండియన్ యూపీ స్కూల్, అక్షర పాఠశాల, సరిపల్లికి చెందిన ఎంవీఆర్ విద్యానికేతన్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సుకవిత నాట్యాచార పసుమర్తి శ్రీనివాసశర్మ, మహిళా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ లక్ష్మికుమారి వ్యవహరించారు. తొలుత నటరాజ పూజా కార్యక్రమాలను చిట్రోజు తాతాజీ దంపతులు, బాలాజీరావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వం నుంచి అకాడమీ ఏర్పాటు కు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే అమరావతిలోను అవకాశం ఉంటే రిపబ్లిక్ డే పరేడ్ ఈ ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతులు తీసుకుంటానని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఫోన్లో అభినందనలు తెలిపారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కె.మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.రాంబాబు, మండవ లక్ష్మణరావు, సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, బండారు సత్యనారాయణ, దల్లి రామాంజనేయరెడ్డి, ప్రముఖ శిల్పి దేవికారాణి ఒడయార్, ఆకాశవాణి ప్రతినిధి బి.జయప్రకాష్, కళాకారులు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. -
స్నూపీ.. నువ్వు సూపర్..
జంగారెడ్డిగూడెం : విశ్వాసం చూపడంలో ముందుండే కుక్క జాతి.. మరో ముందడుగు వేసింది. తోటి కుక్కకు రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళ్తే, జంగారెడ్డిగూడానికి చెందిన కోటగిరి ప్రమీలకు చెందిన కుక్క పేరు బాలు. కొంతకాలంగా ఇది రక్తహీనతతో బాధపడుతోంది. హిమోగ్లోబిన్ 4 శాతానికి పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక శ్రీనివాసపురానికి చెందిన తానిగడప బద్దారావు తన పెంపుడు కుక్క స్నూపీ నుంచి రక్తాన్ని సేకరించడానికి అంగీకరించారు. స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ బీఆర్ శ్రీనివాసన్ స్నూపీ నుంచి 350 మి.లీ. రక్తాన్ని సేకరించి శనివారం కుక్క బాలుకు ఎక్కించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పారు. స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. -
శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని అభివద్ధి చెందాలని రాష్ట్రమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్లో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అభివృద్ధి చెంది తల్లితండ్రులకు, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు. చదువే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కూడా వత్తి నైపుణ్యాలు పెంచుకుని విద్యార్థులను ఆణిముత్యాలుగా తయారుచేయాలన్నారు. ఏజెన్సీలో గిరిజన విద్యార్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యార్థులు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రాన్ని నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాకు ఈ ఏడాది 212 కోట్లు బడ్జెట్లో కేటాయించారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 3.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. 12 వేల మంది ఉపాధ్యాయులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోడల్ ప్రై మరీ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ప్రారంభించామన్నారు. జిల్లాలో 366 మందికి ఇన్సై ్పర్ అవార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 255 మంది నమోదు చేసుకున్నట్టు చెప్పారు. ఒక్కొక్క అవార్డుకు పారితోషికంగా రూ. 5వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమచేసినట్టు తెలిపారు. కాగా 366 ప్రదర్శనలు రావాల్సి ఉండగా, 255 ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నారు. తొలుత మంత్రి పీతల సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు డీఈవో డి.మధుసూదనరావు అధ్యక్షతన వహించగా, ఐటీడీఏ పీవో ఎస్.షాన్మోమన్, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, గంటా సుధీర్‌బాబు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీ వైస్‌చైర్ పర్సన్ చింతల వెంకటరమణ, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ అట్లూరి రామ్మోహన్, మండవ లక్ష్మణరావు, డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎస్ఏపీవో బ్రహ్మానందరెడ్డి, కోనేరు సుబ్బారావు, ఎస్ఎంసీ చైర్మన్ ఆర్.బలరాం, ఏఎంవో ఎ.సర్వేశ్వరరావు, ఐటీడీఏ డీవైఈవో రామారావు, నగర పంచాయతీ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఈనెల 16 నుంచి మూడు రోజులపాలు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు డీవైఈవో ఎం.తిరుమదాసు చెప్పారు. మంగళవారం హైస్కూల్లో కొయ్యలగూడెం విద్యాకమిటీ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు జిల్లాస్థాయిలో విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్‌తో వస్తారని, ఇబ్బందులు తలత్తెతకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సైన్స్ ఫెయిర్ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. రిజిస్ట్రేషన్ కమిటీకి బుట్టాయగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జె.సురేష్‌బాబు, ఫుడ్‌కమిటీకి జంగారెడ్డిగూడెం జెడ్పీ హెచ్ఎస్ (బాలురు) స్కూల్ అసిస్టెంట్ ఎల్.నాగేశ్వరరావు, ప్రెస్ అండ్ పబ్లిసిటీ కమిటీకి జి.పంగిడిగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఏడీ శిఖామణి, కల్చరల్ కమిటీకి రేగులకుంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కె.నాగేశ్వరరావు, డిసిప్లిన్ కమిటీకి రెడ్డిగణపవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.రాముడు బాధ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మొత్తంగా 20 కమిటీలు నియమించామన్నారు. జంగారెడ్డిగూడెం ఎంఈవో ఆర్.రంగయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ రైతు సదస్సు వాయిదా
టి.నరసాపురం: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ఆయిల్‌పామ్ రైతు సదస్సు వాయిదా పడిందని నవభారత్ జోన్ ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆచంట సూర్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల సదస్సు వాయిదా పడిందని, మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
హోదాపై ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వం
జంగారెడ్డిగూడెం రూరల్: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తన స్వప్రయోజనాల కోసం ఆలోచిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టే పనిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనే ఆందోళనలో రాష్ట్ర ప్రజలు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రశాంతంగా మంత్రివర్గ సహచరులతో మంతనాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే కావాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని టీడీపీ మంత్రులను రాజీనామా చేయించి అల్టిమేటం జారీ చేస్తేనే హోదా విషయంలో స్పష్టమైన హామీ వస్తుందన్నారు. ఇదే ప్రజల అభిమతమని ఈ దిశగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజలను మభ్యపెట్టడమే.. ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళలను కూడా కించపరిచేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడటం లేదని నాని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్టు కావాలనే భయంతోనే హోదాపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడితే ఊరుకునేది లేదని తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు ఎలా బనాయించాలనే కార్యక్రమాలను సీఎం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంకు కరుణాకరరెడ్డి మద్దతు ప్రకటించారు తప్ప తుని విధ్వంసంలో ఆయనకు సంబంధం లేదన్నారు. అయితే ఇప్పుడు కరుణాకరరెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దయాల నవీన్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు బండి అబ్బులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, సర్పంచ్ల చాంబర్ జిల్లా ఉపాధ్యక్షురాలు గంజిమాల దేవి, మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు, జగ్గవరపు జానకిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
జంగారెడ్డిగూడెం : స్థానిక సీఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో వందలాది మంది అభ్యర్థులు పాల్గొన్నట్టు సెట్వెల్ మేనేజర్ కేఎస్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో చేరడానికి కావలసిన శిక్షణను 30 రోజుల పాటు అందిస్తామని చెప్పారు. తదుపరి ఎంపికలు ఈ నెల 29న ఏలూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌జేకే నరేంద్రకుమార్ మాట్లాడుతూ ఇటువంటి రిక్రూట్మెంట్ అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నిర్వహింని ర్యాలీలో వివిధ రకాల పరీక్షల అనంతరం సుమారు 250 మందిని ఎంపిక చేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.